శేషాచలం కొండలు
శేషాచలం కొండలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక పర్వత శ్రేణి. ఇవి తూర్పు కనుమల్లో ఒక అంతర్భాగం. తిరుపతి పట్టణం ఈ కొండలను ఆనుకునే ఉంది. ఇక్కడ ఏడు పర్వతాలను అంజనాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, నీలాద్రి, శేషాద్రి, వెంకటాద్రి, వృషబాధ్రి అనే పేర్లతో పిలవబడుతున్నాయి. హిందూ పురాణాల ప్రకారం ఈ ఏడు కొండలు ఆదిశేషుని ఏడు పడగలకు ప్రతిరూపాలుగా భావిస్తారు. శ్రీవేంకటేశ్వర జాతీయ ఉద్యానవనం, తిరుమల కొండలు ఈ పర్వత శ్రేణిలో భాగమే.[1] ఈ పర్వతాలను 2010 వ సంవత్సరంలో జీవవైవిధ్య నెలవుగా గుర్తించారు
మూలాలు
మార్చుబయటి లింకులు
మార్చుఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |