శైలశ్రీ
శైలశ్రీ తమిళం, మలయాళ సినిమాల్లో నటించిన భారతీయ సినీ నటి. కన్నడ సినిమాకు చేసిన కృషికి 2019లో ఆమెకు రాజ్యోత్సవ అవార్డు లభించింది.
శైలశ్రీ | |
---|---|
జాతీయత | భారతీయులు |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1966–ప్రస్తుతం |
జీవిత విశేషాలు
మార్చుఆమె 1960, 1970వ దశకములో పేరొందిన కన్నడ సినిమా నటి. శైలశ్రీ దక్షిణ భారత భాషలన్నింటితో కూడా నటించింది. ప్రధానంగా కన్నడ, తమిళంలో నటించిన శైలశ్రీ తెలుగు, మలయాళంలో కొన్ని సినిమాలలోనూ నటించింది. ఆమె 1966 లో "సంధ్యారాగ" అనే చిత్రంలో చిన్న పాత్రతో అరంగేట్రం చేసింది. ఆమె ముందుగా సహాయనటి, హాస్యనటి, డాన్సర్, సహాయ నటి, ప్రతినాయకిగా వివిధ పాత్రలలో నటించి గుర్తింపు పొందింది.[1]
1971 లో విడుదలైన నేషనల్ అవార్డు గెలుచుకున్న కన్నడ చిత్రం నాగువా హూవులో ఆమె పాత్ర ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. ఆ సినిమాలో ఆమె ఒక నర్సుగా నటించింది. ఆమె ఒక వైద్యుడిని ప్రేమిస్తుంది. కానీ ఆమెను ప్రేమిస్తున్న క్యాన్సర్ రోగి అయిన ఆసుపత్రి యజమాని కుమారుడువల్ల తన ప్రేమను త్యాగం చేస్తుంది. ఆర్.ఎన్.ఆర్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఆమె కథ రాసింది.
కన్నడ చిత్రాలతో పాటు కొన్ని తమిళ చిత్రాలలో కూడా నటించింది.[2] ఆమె తెలుగులో భలే అబ్బాయిలు సినిమాలో నటించింది.
వివాహం
మార్చుఆమె కన్నడ నటుడు ఆర్న్.ఎన్. సుదర్శన్‌ను వివాహం చేసుకుంది, ఆమె అతనితో నాగువ హూవు, కదీనా రహస్య, కల్లారా కల్లా, మాలతి మాధవ, వంటి చిత్రాల్లో నటించింది.[3]
మూలాలు
మార్చు- ↑ a, b. "Sudarshan relives his celluloid journey - The Hindu". The Hindu. Retrieved Jan 10, 2011.
- ↑ "Shailashree". Antrukandamugam.wordpress.com. 2 January 2015. Archived from the original on 5 అక్టోబరు 2017. Retrieved 5 October 2017.
- ↑ "Sudarshan relives his celluloid journey". The Hindu. Retrieved 10 January 2011.