రక్తనాళాల ద్వారా రక్తం కదులుతున్నప్పుడు ప్లాస్మాలో ఉన్న నీరు, దానిలో ఉన్న ఆక్సిజన్ పోషకపదార్ధాలు రక్తనాళాల గోడల నుంచి బయటకువచ్చి కణజాలస్థలాల్లోకి చేరతాయి. ఈ ద్రవాన్ని కణబాహ్యద్రవం (Extracellular fluid) అంటారు. ఇది కణాల నుంచి కార్బన్ డైయాక్సైయిడ్ ని జీర్ణక్రియా వ్యర్ధపదార్ధాలను సేకరిస్తుంది. ఈ కణబాహ్యద్రవంలో అధిక భాగం రక్తనాళాల్లో ప్రవేశించి రక్తంలో ఒక అంశంగా రవాణా చెందుతుంది. మిగిలిన కణబాహ్యద్రవం కణజాలంలో ఉండే చిన్న శోషరసనాళికలలోకి ప్రవేశిస్తుంది. ఈ చిన్న నాళికలన్ని కలసి పెద్ద శోషరసనాళంగా ఏర్పడి, వాటి ద్వారా ప్రసరించి రక్తప్రసరణకు చేరుతుంది. ఈ విధంగా శోషరసనాళాల్లో ప్రవహించే కణబాహ్యద్రవాన్ని 'శోషరసం' అంటారు. ఈ మొత్తం వ్యవస్థని శోషరస వ్యవస్థ (Lymphatic system) అంటారు. ఈ వ్యవస్థలో శోషరస నాళికలు, శోషరస నాళాలు (Lymphatics), శోషరస వాహికలు, శోషరస గ్రంధులు (Lymph Nodes), శోషరస కణుపులు ఉంటాయి. ప్లాస్మాలోని అన్ని అంశాలు శోషరసంలో ఉంటాయి. అయితే ప్లాస్మాప్రోటీన్ ల గాఢత మాత్రం చాలా తక్కువ ఉంటుంది. దీనిలో తెల్ల రక్తకణాలు ముఖ్యంగా లింఫోసైట్లు ఉంటాయి. కానీ ఎర్ర రక్తకణాలు మాత్రం ఉండవు.

శోషరస వ్యవస్థ
An image displaying the lymphatic system.

వ్యాధులు

మార్చు