శ్రీ కృష్ణ కమిటీ నివేదిక

శ్రీకృష్ణ కమిటీ నివేదిక
(శ్రీకృష్ణ కమిటీ నుండి దారిమార్పు చెందింది)

జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ : తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమ సెగలు, భావోద్వేగాల నేపథ్యంలో కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించింది. 2010 ఫిబ్రవరి 3 నుంచి రాష్ట్రమంతా పర్యటించిన శ్రీకృష్ణ కమిటీ- అనేక విషయాలను లోతుగా పరిశీలించింది. వివిధ ప్రాంతాల్లోని మారుమూల గ్రామాల్లో పర్యటించిన అక్కడి ప్రజల మనోభావాలను తెలుసుకుంది. తాము సేకరించిన వివరాలు, విషయాలన్నింటినీ శ్రీకృష్ణ కమిటీ సమగ్రంగా విశ్లేషించింది. వివిధ అంశాలపై సమాచారాన్ని క్రోడీకరించి కీలక వ్యాఖ్యలు చేసింది. 8 అధ్యాయాలతో శ్రీకృష్ణ కమిటీ నివేదిక తయారు చేసింది. ఒక్కో ప్రాంతం నుంచి వచ్చిన భిన్న వాదనలను ప్రస్తావించడమే కాదు .. వాటిలోని హేతుబద్ధతనూ విశ్లేషించింది. వారి డిమాండ్లు సరైనవో.. కావో నిర్ధారించే ప్రయత్నం చేసింది .... మొత్తమ్మీద ఏ ప్రాంతమూ వివక్షకు గురికాలేదని, అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించే వీలుందని శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో సూచించింది.

జష్ఠిస్ శ్రీ కృష్ణ (రిటైర్డు) 2010 డిసెంబరు 30న శ్రీకృష్ణ కమిటీ నివేదికను కేంద్ర హోంమంత్రి శ్రీ పి. చిదంబరానికి న్యూ ఢిల్లీలో అందజేస్తున్న చిత్రం.

నేపథ్యం - కమిటీ - సభ్యులు మార్చు

డిసెంబరు 9, 23 ప్రకటనల తరువాత తలెత్తిన పరిణామాలపై సమాలోచనల కోసం 2010 జనవరి 5న కేంద్ర హోంశాఖ ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఆ భేటీలో వివిధ పార్టీల వాదనలు విన్న కేంద్ర ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. ఆ మేరకు వేర్వేరు అంశాలపై వివిధ రాజకీయ పార్టీలతో, ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయం తెలుసుకోవాలని నిర్ణయించింది. మొత్తంగా రాష్ట్రంలో వాస్తవ పరిస్థితుల అంచానాకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.ఎన్.శ్రీకృష్ణ అధ్యక్షతన... నలుగురు సభ్యులతో ఒక కమిటీని నియమించింది. అందులో ప్రొఫెసర్ రణబీర్‌సింగ్, డాక్టర్ అబూసాలెహ్ షరీఫ్, ప్రొఫెసర్ రవీందర్‌కౌర్, వి.కె.దుగ్గల్ సభ్యులు.

నివేదికలో ప్రసంగించిన విషయాలు మార్చు

2010 ఫిబ్రవరి 3న శ్రీకృష్ణ కమిటీ పని ప్రారంభించింది. 10 నెలల పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించిన కమిటీ సమగ్ర నివేదికను డిసెంబరు10న నాటి కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరానికి సమర్పించింది. ఆ నివేదికలో మొత్తం 9 అధ్యాయాలున్నాయి. అవి - (1) ఆంధ్రప్రదేశ్ పరిణామాల చారిత్రక నేపథ్యం (2) ఆయా ప్రాంతాల ఆర్థిక పరిస్థితులపై విశ్లేషణ (3) విద్య, ఆరోగ్య రంగాలు (4) జలవనరులు, నీటిపారుదల, విద్యుత్‌ (5) ఉద్యోగ విషయాలు (6) హైదరాబాద్ నగరం (7) సామాజిక, సాంస్కృతిక అంశాలు (8) శాంతిభద్రతల పరిస్థితి (9) భవిష్యత్తు - పరిష్కార మార్గాలు.

ఇందులో, శాంతిభద్రతల పరిస్థితికి సంబంధించిన 8వ అధ్యాయాన్ని రహస్యమైందని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది ... ఆ భాగాన్ని నేరుగా హోంమంత్రికి అందజేసింది ... అందులోని అంశాలను వెల్లడించలేదు ... ఈ రహస్య అధ్యాయంపై అనేక విమర్శలు వచ్చాయి. దీనిపై ఒకరు రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేశారు ... కోర్టు తీర్పులో భాగంగా కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి ... కాని 8వ అధ్యాయంలో ఏముందో పూర్తి వివరాలు మాత్రం ఇప్పటికీ అధికారికంగా వెల్లడి కాలేదు. అందులో ఉన్న కొన్ని ముఖ్యాంశాలను చూద్దాం. జస్టిస్‌ నరసింహరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం కమిటీ నివేదికలోని అంశాలను ప్రస్తావించింది. రాష్ట్రంలో రాజకీయ పార్టీల నాయకుల మధ్య ఐక్యతకు కృషి జరగాలని సూచించింది. రాష్ట్రంలో సమర్ధవంతమైన నాయకత్వం కూడా అవసరమని అభిప్రాయపడింది. టీఆర్‌ఎస్‌ నాయకత్వాన్ని బుజ్జగించేందుకు కృషి జరగాలని చెప్పింది. అన్ని పార్టీల నాయకులతో ఏకాభిప్రాయ సాధనకు కృషి చేయాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యమ తీవ్రతను తగ్గించేందుకు మీడియా మేనేజ్‌మెంట్‌ చేయాలని సూచించింది. 2010 నాటికి రాష్ట్రంలో 13 న్యూస్‌ ఛానల్స్‌ ఉన్నాయని వాటిలో రెండు మాత్రమే తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్లు కమిటీ అభిప్రాయపడింది. మిగిలిన న్యూస్‌ ఛానళ్లతో పాటు ప్రింట్‌ మీడియా కూడా సమైక్యాంధ్రకు అనుకూలంగా ఉందని కమిటీ నివేదిక తెలిపింది.

మొదటి అధ్యాయం - ఆంధ్రప్రదేశ్ పరిణామాలు మార్చు

నివేదిక మొదటి అధ్యాయంలో రాష్ట్రంలోని ప్రస్తుత పరిణామాల చారిత్రక నేపథ్యాన్ని అయిదు భాగాలుగా వివరించారు. 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు వరకు జరిగిన పరిణామాలు, కుదిరిన ఒప్పందాలు ...1956-73 మధ్య ఈ ఒప్పందాల అమలు, అందులో వచ్చిన సమస్యలు, ఉల్లంఘనలు జై తెలంగాణా, జై ఆంధ్ర ఉద్యమాలపై సమగ్ర స్వరూపం ఇచ్చారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు విషయంలో ఏం జరిగిందో... ప్రజల ఉద్యమాల ఫలితంగా చివరికి విశాలాంధ్ర ఎలా ఏర్పాటైందో మొదటి అధ్యాయంలో చెప్పారు. ఆ వివరాలు ఇప్పుడుచూద్దాం... దేశంలో మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ 1956 నవంబరు 1న అవతరించింది. దానికి కొంత నేపథ్యం ఉంది. నిజానికి 20వ శతాబ్దం ప్రారంభం నుంచే తెలుగు మాట్లాడే వారంతా ఒక రాష్ట్రంగా ఏర్పడాలనే ఆలోచన ఉండేది. కొన్ని ఇతర భాషల వారిలోనూ ఇదే విధమైన ఆలోచనలు అప్పట్లో ఉండేవి. తర్వాత కొంత కాలానికి అప్పటి కాంగ్రెస్ నాయకత్వం ఈ ఆలోచనను తన అధికారిక విధానంగా తీసుకుంది. అప్పుడు తెలుగు మాట్లాడే వారి జిల్లాలు కొన్ని మద్రాస్ ప్రెసిడెన్సీలో, కొన్ని నిజాం రాజ్యంలో ఉండేవి. ఆ తర్వాత, 1953 సెప్టెంబరు 14న మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు జిల్లాలు ఆంధ్రరాష్ట్రంగా ఏర్పడ్డాయి. నాటికి కొన్నాళ్లు ముందుగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు....... 55 రోజులు ఆమరణ దీక్ష చేసి ప్రాణత్యాగం చేయడంతో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది ... . దీనిపై ఇంకొంచెం లోతుల్లోకి వెళ్దాం... నాడు ఆంధ్రరాష్ట్రంలో చేరేందుకు రాయలసీమ జిల్లాలు మొదట అంగీకరించలేదు. రాయలసీమకు ఆర్థిక, సామాజిక, పరిపాలనాంశాలలో కొన్ని రక్షణలు కల్పించాలన్న శ్రీబాగ్ ఒప్పందం ఆధారంగా చివరికి ఆ రెండు ప్రాంతాలు ఒకటయ్యాయి. *******1937లో కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు నివాసమైన శ్రీబాగ్‌లో కుదిరిన ఒప్పందం సమయంలో రాయలసీమ, కోస్తాంధ్రపై జరిగిన సమావేశంలో తెలుగు మాట్లాడే ప్రజలు కలిపే ప్రతిపాదనను నిజాం తిరస్కరించారు. హైదరాబాద్ సంస్థానంలో ఉన్న తెలంగాణ జిల్లాలను... ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయాలన్న ప్రతిపాదనలను నిజాం ఎంత మాత్రం ఒప్పుకోలేదు.

ఇక-దేశంలో వివిధ రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ కోసం నెహ్రూ ప్రభుత్వం అదే 1953లో జస్టిస్ ఫజల్‌అలీ కమీషన్ ‌ను నియమించింది. ఆ కమీషన్ తెలంగాణలో పర్యటించినప్పుడు శాసనసభ్యులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి... ఆంధ్ర రాష్ట్రంతో విలీనంపై వ్యతిరేకత వచ్చింది. చివరకు ఆ కమిషన్ తన నివేదిక ఇస్తూ, రెండు ప్రాంతాల విలీనం అభివృద్ధికి దోహదం చేస్తుందని తేల్చింది. అయితే ప్రజల్లో వ్యతిరేకత ఉన్నందువల్ల ఐదేళ్ల పాటు తెలంగాణను వేరుగా ఉంచాలని సూచించింది. ఆ తర్వాత శాసనసభలో మూడింట రెండు వంతుల మంది అంగీకరిస్తే విలీనం చేయడంలో ఎలాంటి అభ్యంతరాలు రావని కూడా చెప్పింది. 1955 లో ఫజల్ అలీ కమీషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది ... 1955 అక్టోబరు 22న ఆంధ్ర, తెలంగాణ ప్రాంత ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది .... ఈ రెండు ప్రాంతాలను విలీనం చేయాలని ఇద్దరు ముఖ్యమంత్రులు తీర్మానించారు ... తరువాత ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో రెండు రాష్ట్రాల నాయకుల మధ్య చర్చలు జరిగాయి. దాని ఫలితంగా1956 ఫిబ్రవరి 20న పెద్ద మనుషులు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దాని ప్రకారం తెలంగాణకు ఆర్థిక, రాజకీయ, పరిపాలనా విషయాలలో కొన్ని రక్షణలు కల్పించాలని తీర్మానించారు. ఆ ఒప్పందంపై ఆంధ్రరాష్ట్రం పక్షాన అప్పటి ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి, ఉపముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, మంత్రి గౌతు లచ్చన్న, ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి సత్యనారాయణరాజు, హైదరాబాద్‌ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, మంత్రులు మర్రి చెన్నారెడ్డి, కె.వి.రంగారెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు జె.వి.నర్సింగరావు సంతకాలు చేశారు. దీన్నే పెద్ద మనుషుల ఒప్పందం అంటారు ....

పెద్ద మనుషుల ఒప్పందం మార్చు

పెద్ద మనుషుల ఒప్పందంలో మొత్తం 14 అంశాలు ఉన్నాయి........ (1) పరిపాలనా వ్యయాన్ని ఆయా ప్రాంతాలు దామాషా పద్ధతిలో భరించాలి. తెలంగాణ మిగులు నిధులను ఆప్రాంతం అభివృద్ధికి ఖర్చు చేయాలి. అయిదేళ్ల తర్వాత పరిస్థితిని సమీక్షించి, ఇంకా అవసరమని తెలంగాణ ఎమ్ఎల్ఏలు భావిస్తే మరొక అయిదేళ్లపాటు ఇదే పద్ధతిని పొడిగించాలి. (2) తెలంగాణలో మద్య నిషేధాన్ని అక్కడి ఎమ్మెల్యేలు కోరుకున్న విధంగా అమలు చేయాలి. (3) తెలంగాణలోని విద్యాసంస్థలలో ప్రవేశాలను అక్కడి వారికి ప్రత్యేకించాలి. (4) ఉద్యోగుల రిట్రెంచ్‌మెంట్ తప్పనిసరైతే రెండు ప్రాంతాలలో తగిన నిష్పత్తిలో జరగాలి. (5) భవిష్యత్తులో ఉద్యోగ నియామకాలు రెండు ప్రాంతాల జనాభా నిష్పత్తిలో జరగాలి. (6) పరిపాలనా వ్యవహారాలలో ఉర్దూ కొనసాగాలి. నియమాకాలలో తెలుగు తప్పక రావాలనే నిబంధన ఉండకూడదు. (7) 12 ఏళ్ల పాటు ఆప్రాంతంలో నివాసం ఉండాలన్న ముల్కీ నిబంధనను నియామకాలలో అనుసరించాలి. (8) తెలంగాణలో వ్యవసాయ భూముల అమ్మకాలను ప్రాంతీయ మండలి నియంత్రించాలి. (9) తెలంగాణ అభివృద్ధికి ఒక ప్రాంతీయ మండలి ఏర్పాటు కావాలి. (10) ప్రాంతీయ మండలిలో 20 మంది సభ్యులుండాలి. (11) ఇది కూడా ప్రాంతీయ మండలికి సంబంధించిన నిబంధనే (12) మంత్రిమండలిలో ఆంధ్ర, తెలంగాణ వారు 60:40 నిష్పత్తిలో ఉండాలి. తెలంగాణ మంత్రులలో ఒకరు ముస్లిం అయి ఉండాలి. (13) ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి పదవులలో ఒకటి ఒక ప్రాంతానికి చెందితే, రెండవ ప్రాంతానికి రెండవ పదవి లభించాలి. అయిదు కీలకశాఖలలో ఏవైనా రెండు తెలంగాణకు ఇవ్వాలి. (14) తెలంగాణకు 1962 వరకు వేరే కాంగ్రెస్ అధ్యక్షుడు ఉండాలి.

పెద్ద మనుషులు ఒప్పందం కుదిరిన తర్వాత అంటే 1956 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. ఈ కొత్త రాష్ట్రం పేరు ఆంధ్ర-తెలంగాణ అని ఉండాలని తెలంగాణ నాయకులు మొదట ప్రతిపాదించినా... చివరకు రాజీ కుదిరింది. పరిపాలనాపరంగా, రాజకీయంగా కొత్త రాష్ట్రం ఆంధ్ర-తెలంగాణల కలయిక అయినప్పటికీ, సామాజిక-ఆర్థిక కోణాల నుంచి, చారిత్రక దృష్టి నుంచి చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఈ రెండింటితో పాటు రాయలసీమ ఒక ప్రత్యేక ప్రాంతంగానే ఉండిపోయింది. ఇది తర్వాత కాలంలో భిన్నాభిప్రాయాలకు అవకాశమిచ్చింది. దాని ఫలితంగానే 1969లో జై తెలంగాణ నినాదంతో, 1972 జై ఆంధ్ర నినాదంతో రెండు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు తలెత్తాయి. పెద్ద మనుషుల ఒప్పందానికి ఆ మొదటి ఇరవయ్యేళ్లూ ఒకరకమైన పరీక్షా కాలంగా నిలిచాయి.

అధికార వ్యవస్థలో తెలంగాణకు ప్రాతినిధ్యం, బడ్జెట్ అంశాలు, విద్యా-ఉద్యోగ రంగాలలో అవకాశాలు తీవ్ర సమస్యలను సృష్టించాయి. తర్వాత కాలంలో జలవనరుల పంపిణీ, భూముల వ్యవహారాలు కూడా సమస్యగా మారాయి. ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం వారైతే ఉపముఖ్యమంత్రి పదవి తెలంగాణకు చెందాలని పెద్ద మనుషుల ఒప్పందంలో ఉంది. కాని, తొలి ముఖ్యమంత్రి అయిన సంజీవరెడ్డి, తెలంగాణకు ఆ పదవిని ఇవ్వలేదు. ఆ ఒప్పందంపై స్వయంగా సంతకం చేసిన ఆయన కూడా దానిని అమలు చేయలేదు .... తర్వాత సంజీవయ్య ముఖ్యమంత్రి అయినప్పుడు తెలంగాణ వారు ఉపముఖ్యమంత్రి అయ్యారు. కాని, మళ్లీ ముఖ్యమంత్రి అయిన సంజీవరెడ్డి ఉపముఖ్యమంత్రి పదవిని మరొకమారు రద్దు చేశారు. 1969 తెలంగాణ ఉద్యమం తర్వాత ఆ పదవిని పునరుద్ధరించారు. 1958లో ఏర్పడిన తెలంగాణ ప్రాంతీయ కమిటీకి - స్థానిక పరిపాలన, ఆరోగ్యం, ఒక స్థాయి వరకు విద్య, తెలంగాణ విద్యా సంస్థలలో అడ్మిషన్ల నియంత్రణ, ఆబ్కారీ, వ్యవసాయ భూముల అమ్మకం, వ్యవసాయాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి ప్రణాళిక వంటి అంశాలను అప్పగించారు. కానీ ప్రభుత్వం వీటన్నింటిని ఆచరణలో అమలు చేయలేదు. ఇందుకు ఆ కమిటీ అధ్యక్షుల బాధ్యత కూడా కొంత ఉందన్నది విమర్శకుల వాదన. ఏమైనా చివరకు 1973లో ఆ కమిటీ రద్దయింది. ఆరు సూత్రాల పథకం అమలుకు రావటంతో అసలు దాని అవసరమే లేకుండా పోయింది.

ప్రాంతీయ కమిటీ పనిచేస్తున్న కాలంలో, పెద్ద మనుషుల ఒప్పందంలోని కొన్ని అంశాలలో ఉల్లంఘన జరిగినట్లు తేలింది. ఉద్యోగ నియామకాలలో ముల్కీ నిబంధనలు పాటించకపోవడం ఒకటి. కనీసం 15 ఏళ్లు తెలంగాణలో నివాసం లేని వారికి కొన్ని విధాలైన ఉద్యోగాలు ఇవ్వరాదన్నది నిబంధన. కాని ఆ నిబంధనను యథేేచ్ఛగా ఉల్లంఘించారు. విద్యావకాశాల విషయంలోనూ అదే జరిగింది.

పెద్ద మనుషుల ఒప్పందాల అమలుపై మొదటి నుంచీ తెలంగాణవాదుల్లో ఒకరకమైన అభిప్రాయం ఉంది. ఒప్పందంలోని కొన్ని ముఖ్య అంశాలను ఉల్లంఘించారన్నది ప్రధాన అభియోగం. అందులో ముఖ్యమైంది దొంగ ముల్కీ సర్టిఫికెట్ల సృష్టి. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత కోస్తాంధ్ర నుంచి హైదరాబాద్‌కు వలసలు భారీగా పెరిగాయి. ఉద్యోగులు, నిరుద్యోగులలో అసంతృప్తికి ఇదే కారణం. తమకు రావాల్సిన అవకాశాలు కోస్తా ప్రజలకు దక్కుతున్నాయన్న భావన పెరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విద్యుత్ బోర్డు- ప్రభుత్వ ఉద్యోగ నియామకాల చట్టం పరిధిలోకి రాదని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో 1969 జనవరిలో ఆందోళన మొదలైంది. ఖమ్మంలో ఒక విద్యార్థి నిరాహార దీక్షతో ఆందోళన ఊపందుకుంది. విద్యార్థులలో ఒకవర్గం తెలంగాణ రక్షణను పూర్తిగా అమలు చేయాలని డిమాండ్‌ చేయగా, మరొక వర్గం ప్రత్యేక తెలంగాణ నినాదాన్నిచ్చింది. అక్రమంగా ఉద్యోగాల్లోకి వచ్చిన 6 వేల మంది కోస్తాంధ్ర వారిని తిప్పి పంపాలంటూ తెలంగాణ ఎన్జీవోలు కూడా ఉద్యమంలో చేరారు. కొన్ని ప్రాంతాలలో హింస చెలరేగింది. ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అక్రమంగా చేరిన ఉద్యోగులను గుర్తించి.. వారిని తిరిగి పంపుతామని, తెలంగాణ మిగులు నిధుల లెక్కలను తీసేందుకు ఒక అధికారిని ప్రత్యేకంగా నియమిస్తామని ప్రకటించింది. కాని ఇంతలోనే తెలంగాణ ఉద్యమకారులపై పోలీసు కాల్పులతో అంతా తారుమారైంది. కారణాలేమైనా ఏడాది పాటు సాగిన ఉద్యమం చివరకు సద్దుమణిగింది. ఆ తర్వాత ప్రభుత్వ ముల్కీ నిబంధనలను విద్యుత్ బోర్డుకు వర్తింప జేస్తున్నట్లు, కోస్తా ఉద్యోగులను తిప్పి పంపుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం- కోస్తా, రాయలసీమల్లో ఉద్యమానికి ఊతమిచ్చింది.

అదే సమయంలో మాజీ ఉపముఖ్యమంత్రి కె.వి.రంగారెడ్డి, తెలంగాణ సమస్యలకు ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారమంటూ విద్యార్థులతో గొంతు కలిపారు. ముల్కీ నిబంధనలను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో తెలంగాణ ఉద్యమం మళ్లీ తీవ్రమైంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అష్ట సూత్ర పథకాన్ని ప్రకటించారు. మర్రి చెన్నారెడ్డి నాయకత్వాన ఉన్న తెలంగాణ ప్రజా సమితి కాంగ్రెస్‌లో విలీనమైంది. సమితి చీలిపోయింది. తెలంగాణ ఉద్యమం క్రమంగా తగ్గిపోయిది. అయితే ఈ ఉద్యమం ఫలితంగా తెలంగాణకు అనుకూలమైన కొన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంది. ప్రాంతీయ కమిటీని శక్తివంతం చేయటం, మరిన్ని విద్యాసంస్థల ఏర్పాటు, తెలంగాణ నిధులను సరిగా లెక్కవేయటం, పరిశ్రమలకు ప్రత్యేక సబ్సిడీల వంటివి అందులో ఉన్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణకు చెందిన పీవీ నర్సింహారావు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ఏడాది అంటే 1972 అక్టోబరులో ముల్కీ నిబంధనలను చెల్లుబాటు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో జై ఆంధ్రా ఉద్యమం మొదలైంది. కోర్టు తీర్పు ప్రకారం ముల్కీ నిబంధనలను అమలుపరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పష్టమైన ప్రకటన చేసింది. కానీ ఈ పరిస్థితి తీవ్రతను గుర్తించిన కేంద్రం.... ఆ నిబంధనలు హైదరాబాద్‌లో 1977 వరకు, తెలంగాణ జిల్లాల్లో 1980 చివరి వరకు అమలులో ఉంటాయని చెప్పింది.

ముల్కీ నిబంధనలు పూర్తిగా వెంటనే రద్దు కావాలనుకున్న ఆంధ్ర ప్రాంతం వారు కేంద్ర నిర్ణయాన్ని తప్పుపట్టారు. దీంతో వారు తిరుపతిలో సమావేశమై ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఉపముఖ్యమంత్రి బి.వి.సుబ్బారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. 1975 జనవరిలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. సమస్య పరిష్కారానికి ఆంధ్ర నాయకులు చిత్తూరులో సమావేశమయ్యారు గాని ఏమీ తేల్చలేదు. ముల్కీ నిబంధనలకు హైకోర్టు మరో రెండు నిర్వచనాలతో రెండు తీర్పులు ఇవ్వడంతో విషయమంతా గందరగోళంగా మారింది. రెండు ప్రాంతాల నాయకులకు ఉద్యమాలపై ఆసక్తి తగ్గింది. ఇదే అదనుగా నాటి ప్రధాని ఇందిరా ఆరు సూత్రాల ప్రణాళికను ప్రకటించారు. దీంతో ముల్కీ నిబంధనలు పూర్తిగా రద్దయ్యాయి. పెద్ద మనుషుల ఒప్పందంలోని సారాంశాన్ని అమలు చేసేందుకు ప్రత్యామ్నాయాలు చూపారు. 371-D నిబంధన అమలు, నియమాకాలకు జోనల్ నిబంధన, సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాటు వంటివి అందులో ఉన్నాయి. తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ కూడా రద్దయింది. ఒక్కమాటలో చెప్పాలంటే- తర్వాత 30 ఏళ్ల పాటు రాజకీయ సుస్థిరతకు, ఆర్థిక అభివృద్ధికి ఆరు సూత్రాల పథకం అవకాశం కల్పించింది. అప్పుడప్పుడు, అక్కడక్కడ తెలంగాణ సెంటిమెంట్ మాటలు వినిపించినా, ఆందోళనలు కనిపించినా.. మొత్తమ్మీద పరిస్థితులు సుస్థిరంగా, ప్రశాంతంగా సాగాయి.

తెలుగు ఉపజాతికి ఒక సొంత గుర్తింపు ఉండాలంటూ సుదీర్ఘకాలం పాటు సాగిన ఉద్యమ ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. దేశంలో ఫెడరల్ వ్యవస్థకు కూడా ఇది ఒక ఆధారమైంది. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో కాంగ్రెస్ పార్టీ జాతీయతా స్పృహపై దృష్టి పెట్టగా, మరొకవైపు ప్రాంతీయ రాజకీయాలు, సంస్కృతులు, పరిస్థితులు ప్రాంతీయ పార్టీల ఏర్పాటుకు దారితీశాయి.

దక్షిణాదిన ఒక్క తమిళనాడు మినహా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఆధిపత్యమే కొనసాగింది. 1980ల ఆరంభం వరకూ పరిస్థితి ఇదే. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ బలహీనపడటంతో, తెలుగు వారి ఆత్మాభిమానాన్ని కూడా ఆధారం చేసుకుంటూ 1982లో ఎన్‌టి రామారావు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలలో ఏదో ఒకటి అధికారంలో ఉంటూ వస్తున్నాయి. చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిల కాలంలో దీర్ఘకాలం పాటు తెలంగాణ భావన స్తబ్దంగా ఉండిపోయింది. అయితే, వీరిలో ఎవరూ తెలంగాణ చెందిన వారు కాకపోవడంతో ఆ ప్రాంతానికి న్యాయం జరగలేదనే భావన తెలంగాణ ప్రజల్లో నాటుకుపోయింది. అదీ కాకుండా వీరి పాలనలో తెలంగాణకు చెందిన సారవంతమైన భూములు, వక్ఫ్ భూములు, వనరులు ఇతరుల పాలయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. బయటి వారు స్థాపించిన పరిశ్రమలు మొదలైన వాటి వల్ల జరిగిన అభివృద్ధితో తెలంగాణ కూడా లాభపడినా, బయటి వారికి లాభాలు ఎక్కవగా దక్కాయన్న విమర్శలున్నాయి. ఆరు సూత్రాల పథకం అమలు తర్వాత హైదరాబాద్‌లో, ఆ పరిసరాలలో జరిగిన ఆర్థికాభివృద్ధి, పట్టణీకరణ వివాదాస్పదమయ్యాయి. జరిగిన అభివృద్ధికి ఆధారం కూడా ప్రధానంగా సర్వీస్ రంగమే. ఉత్పత్తి రంగం, పరిశ్రమలు, వాణిజ్యం అభివృద్ధి చెందలేదు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి హైదరాబాద్‌ జనాభా మూడు రెట్లు పెరిగింది. కానీ పౌర సదుపాయాలు అందుకు తగినట్లుగా అభివృద్ధి చెందలేదు. ఇవ్వన్నీ తెలంగాణ వారి వాదనలు.

అయితే- హైదరాబాద్ ఇప్పుడు కేవలం తెలంగాణ నగరం కాదన్నది సమైక్యాంధ్రుల ప్రతివాదన. గత 35 ఏళ్లలో హైదరాబాద్ ఒక జాతీయ నగరంగా ఎదిగిందని వారంటున్నారు. మొత్తానికి రెండు పక్షాల మధ్య వివాదానికి హైదరాబాద్‌ కేంద్రంగా మారింది. అభివృద్ధి పరంగా హైదరాబాద్‌కు ఒక ప్రత్యేకత ఉందన్న మాట నిజమే. 1930లో నిజాం రాజ్యంలో దాదాపు 20 లక్షల మంది బయటి వారున్నారు. 10 లక్షల ఎకరాలు వారి సాగుబడిలో ఉండేవి. కోస్తాంధ్ర నుంచే కాకుండా కర్నాటక, మహారాష్ట్ర, బీహార్, ఒడిషా, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్ వారు కూడా హైదరాబాద్‌లో స్థిరపడ్డ వారిలో ఉన్నారు. అలా హైదరాబాద్ ఒక కాస్మోపాలిటన్ నగరంగా మారింది. బొగ్గు, విద్యుత్ బాగా లభించటం ఇతరులకు ఆకర్షణగా మారింది. ఈ నేపథ్యంలో IT పరిశ్రమల రాకతో నగరానికి జాతీయ స్థాయి వచ్చింది. కానీ ప్రభుత్వ ఉద్యోగాలలో నియామకమే పెద్ద సమస్యగా మారింది. 60 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాలు-స్థానికులు అన్న అంశం ఒక తీవ్ర సమస్యగా కొనసాగుతూనే ఉంది. జోనల్ విధానంలోని స్థానికులు అనే పదానికి తప్పుడు నిర్వచనం చెప్తూ తెలంగాణ వారికి ఇంకా అన్యాయం చేస్తున్నారని, ఉన్నతాధికారుల నియామకాలలోనూ వివక్ష కొనసాగుతున్నదని, నాన్-గెజిటెడ్ ఉద్యోగాలను గెజిటెడ్ హోదాకు పెంచి స్థానికులకు అన్యాయం చేస్తున్నారని తెలంగాణ వారు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వులు 1975లోనే వెలువడగా పదేళ్ల తర్వాత 1985లో గాని 610 జి.ఓ వెలువడలేదన్నది తెలంగాణ వారు ఎత్తి చూపుతున్న మరొక అంశం.

ఈ పరిస్థితుల్లో నిజానిజాలను తెలుసుకునేందుకు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కె.జయభారతరెడ్డి అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది నాటి ప్రభుత్వం. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులోని లోపాలను పరిశీలించటం ఆ కమిటీ పని. 1975-85 మధ్య రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో జరిగిన లోపాలను కమిటీ గుర్తించి, వాటిని సరిదిద్దేందుకు కొన్ని సిఫారసులు చేసింది. అదిగాక, ఆరు సూత్రాల పథకం అమలులో గల లోపాల పరిశీలనకు రిటైర్డ్ IAS అధికారి వి.సుందరేశన్ అధ్యక్షతన మరో కమిటీని నియమించారు. ఈ రెండు నివేదికల ఆధారంగా తెలంగాణ ఎన్జీవోలతో చర్చలు జరిపిన ప్రభుత్వం 1985 డిసెంబరులో 610 జీవో జారీ చేసింది. జోనల్ నిబంధనలకు విరుద్ధంగా నియమించిన బయటి ఉద్యోగులను 1986 మార్చి ఆఖరులోగా తమ తమ జోన్లకు పంపివేస్తామన్నది అందులోని ముఖ్యమైన భాగం. అందుకోసం అవసరమైతే సూపర్ న్యూమరీ ఉద్యోగాలను సృష్టిస్తామని కూడా ఆ జీవోలో తెలిపారు. 610 జీవో అమలు లోపాలను సరిదిద్దామంటూ అధికారుల నుంచి ప్రభుత్వానికి ఆ తర్వాత 15 ఏళ్ల పాటు నివేదికలు వస్తూనే ఉన్నాయి. ఆ దశలో 2001 జూన్‌లో ప్రభుత్వం ఈ విషయంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. రిటైర్డ్ IAS అధికారి జె.ఎం.గిర్‌గ్లాని అధ్యక్షతన సమీక్షా సంఘాన్ని నియమించింది. గిర్‌గ్లానీ నివేదిక 2004 సెప్టెంబరులో సర్కారుకు అందింది. దాన్ని ప్రభుత్వం రెండేళ్ల తర్వాత అంటే 2006 ఆగస్టులో ఆమోదించింది. 1985 నుంచి 2005 వరకు జీవో 610 సరిగా అమలు కాలేదన్న మాట నిజం. ఉద్యోగుల ఫిర్యాదుల్లో ఇది కూడా ఒకటి. ఈ సమస్య ఇప్పటికీ సమస్యగానే ఉంది.

తెలుగు ఉప జాతీయత అనే ప్రాతిపదికపైన ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. కాని, రాష్ట్రం ఏర్పాటు నాటి అసమానతలు మూడు ప్రాంతాల మధ్య తర్వాత కూడా కొనసాగాయి. అదేవిధంగా ఏ ప్రాంతపు సంస్కృతి ఆ ప్రాంతానిది కావటంతో ఆ సమస్యలు, ప్రాంతీయ గుర్తింపుల ఆధారంగా ఉద్యమాలు జరిగాయి. వాటిలో నక్సలైట్ ఉద్యమం ఒకటి.

1997లో బీజీపీ తన కాకినాడ సమావేశంలో ప్రత్యేక తెలంగాణ అనుకూల వైఖరి తీసుకుంది. కాంగ్రెస్ MLAలు తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటర్ల ఫోరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 2000సంవత్సరంలో సోనియాగాంధీని కలిసిన 40మందికి పైగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణ అంశంపై సోనియాగాంధీకి వినతిపత్రం సమర్పించారు ... అలా 2001 నుంచి ప్రత్యేక తెలంగాణ నినాదం మళ్లీ ముందుకొచ్చింది. పంచాయతీ ఎన్నికలలో ఒక నినాదమైంది. అప్పుడే ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి కూడా అదే నినాదంతో ఎన్నికలలో పోటీ చేసి తన బలాన్ని నిరూపించుకుంది. 1969 నాటి తెలంగాణ ఉద్యమాన్ని ప్రధానంగా వివిధ సామాజిక బృందాలు, విద్యార్థులు, ఉద్యోగులు నడిపారు. కాంగ్రెస్‌లోని అసమ్మతివాదులు దానిని బలపరిచారు. అందుకు భిన్నంగా 2001లో మొదలైన ఉద్యమానికి అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. 2002 డిసెంబరులో నల్లగొండలో జరిగిన కాంగ్రెస్ ఫోరం సభ ప్రత్యేక రాష్ట్రం తమ అజెండాలో ఉందని ప్రకటించింది. తర్వాత 2004 ఎన్నికలలో ఆ కాంగ్రెస్, టీఆర్ఎస్‌ల మధ్య ఎన్నికలు ఒప్పందం కుదిరింది. కాని, గెలిచిన తర్వాత కాంగ్రెస్ తన మాట నిలబెట్టుకోలేదు. 2009 ఎన్నికలలో టీఆర్ఎస్, టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి. టీడీపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు ప్రకటించింది. ఆ ఎన్నికలలో టీఆర్ఎస్‌కు 10 సీట్లు వచ్చాయి .... 2009 సెప్టెంబరులో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. కొంత స్తబ్దత తర్వాత, నవంబరు నుంచి తెలంగాణ ఉద్యమం తిరిగి ఉధృతమైంది. తర్వాత నవంబరు 29న కేసీఆర్‌ దీక్ష ప్రారంభించారు.

2009 డిసెంబరు మొదట్లో తెలంగాణవ్యాప్తంగా ఆందోళనలు, హింస ఆత్మహత్యలు జరగడంతో పాటు వేర్వేరు యూనివర్శిటీల విద్యార్థులతో, జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడింది. నాటి ముఖ్యమంత్రి కె.రోశయ్య డిసెంబరు 7న అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అందులో సిపిఎం, ఎంఐఎం మినహా తక్కిన పార్టీలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి సుముఖత ప్రకటించాయి. ఆ మేరకు శాసనసభలో తీర్మానానికి కూడా మద్దతు ఇస్తామని తెలిపాయి. పరిస్థితులను పరిశీలించిన కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంది. డిసెంబరు 9న నాటి హోంమంత్రి చిదంబరం తెలంగాణ ప్రక్రియ ప్రారంభమవుతుందంటూ ప్రకటించారు. అదేమాట మరునాడు పార్లమెంటు ఉభయసభల్లోనూ చెప్పారు. ఆ తర్వాత కేసీఆర్ తన దీక్షను, ఉద్యమాన్ని కూడా విరమించుకున్నారు. ఆ వెంటనే సీమాంధ్రలో ఆందోళనలు మొదలయ్యాయి. మూకుమ్మడి రాజీనామాలు మొదలయ్యాయి. దీంతో చిదంబరం డిసెంబరు 9నాటి ప్రకటనను సవరించుకుంటూ డిసెంబరు 23న మరో ప్రకటన చేశారు ...అప్పటి నుంచి తెలంగాణ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. సీమాంధ్రలో ఉద్యమం నిలిచిపోగా తెలంగాణలో ఉద్యమం తిరిగి మొదలైంది.

ఆ తర్వాత టీఆర్ఎస్‌తో పాటు తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఉద్యమాన్ని శక్తిమంతం చేసింది. సీమాంధ్రలలో ప్రత్యేక రాష్ట్ర అనుకూల- వ్యతిరేక భావనలు బలంగా ఏర్పడ్డాయి. రాష్ట్ర ఏర్పాటులో ఆలస్యానికి నిరసనగా 10 మంది టీఆర్ఎస్, ఒక బీజీపీ సభ్యుడు తమ స్థానాలకు రాజీనామా చేశారు. ఆ ఉపఎన్నికల్లో అన్ని స్థానాలనూ వారే భారీ మెజారిటీతో గెలిచారు. వారిలో ఒకరు టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక- గ్రూప్-1 ఉద్యోగాల్లో తెలంగాణకు 42 శాతం రిజర్వ్ చేయాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించలేదు. జ్యుడీషియల్ పదవుల్లో తెలంగాణ వారి పట్ల వివక్ష ఉందన్న లాయర్ల ఫిర్యాదు కూడా తెలంగాణ మలి దశ ఉద్యమానికి ఊతమిచ్చింది.

ఇక ఆర్థిక వ్యవస్థలు, పట్టణీకరణ, స్థూల జాతీయ ఉత్పత్తి, మూడు ప్రాంతాల్లోని ముఖ్య పట్టణాలను తోసిరాజంటూ... హైదరాబాద్‌ మహానగరంగా ఆవిర్భవించడం... ఇలా ఎన్నో కీలక అంశాలను కూడా శ్రీకృష్ణ కమిటీ వివరించింది. అవేమిటో చూద్దాం.

కీలక అంశాలు మార్చు

దేశంలోని వివిధ రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ నాల్గవ స్థానంలో ఉందన్నది కమిటీ తొలి వాదన. 2007-08 నాటి లెక్కల ప్రకారం వార్షిక స్థూల ఉత్పత్తి 3 లక్షల 26 వేల 547 కోట్ల రూపాయలు. తలసరి ఆదాయం 35,600 రూపాయలు. కోస్తాంధ్ర తలసరి ఆదాయం రాష్ట్ర సగటు కన్నా ఎక్కువగా 36,496 రూపాయలు. తెలంగాణ ఆదాయం హైదరాబాద్‌ను కలిపి చూపినా కోస్తాంధ్ర కన్నా తక్కువగా 36,082 రూపాయలు, హైదరాబాద్ లేకుండానైతే 33,771 రూపాయలుగా ఉంది. ఇక రాయలసీమ పరిస్థితి ఏవిధంగా చూసినా చివరి స్థానంలోనే ఉంది. అక్కడ తలసరి ఆదాయం 33,056 రూపాయలు మాత్రమే. ఇక- పట్టణీకరణ అన్ని ప్రాంతాలలోనూ తక్కువే. తెలంగాణలో 22 శాతం, కోస్తాలో 25 శాతం కాగా రాయలసీమలో 23 శాతం. అలా చూసినా మొత్తం మూడు ప్రాంతాల పట్టణీకరణను నిరోధిస్తూ హైదరాబాద్ ఒక్కటే మహానగరంగా అభివృద్ధి చెందిదని కమిటీ తేల్చింది. అందుకే మూడు ప్రాంతాల ప్రజలు హైదరాబాద్‌పైనే ఆధారపడాల్సి వచ్చిందని అభిప్రాయపడింది. 2000-01 నుంచి 2007-08 సంవత్సరాల మధ్య మొత్తం రాష్ట్రంలో తలసరి ఆదాయం 58 శాతం పెరిగింది. ఈ పెరుగుదల ఒక్క హైదరాబాద్ నగరంలోనే 77 శాతం. హైదరాబాద్‌ను మినహాయించిన తెలంగాణలో 60 శాతం, రాయలసీమలో 58 శాతం, కాగా కోస్తాంధ్రలో 54 శాతం.

ప్రధాన రంగాల వారీగా చూసినపుడు వ్యవసాయంలో కోస్తా వాటా తగ్గింది ... పరిశ్రమలు, సర్వీస్ రంగాలలో పెరిగింది ... రాయలసీమ వాటా పరిస్థితి కూడా అలాగే ఉంది. హైదరాబాద్ వాటా వ్యవసాయంలో, పరిశ్రమలలో గణనీయంగా తగ్గగా, సర్వీస్ రంగంలో బాగానే పెరిగింది. ఇక తెలంగాణ వాటా వ్యవసాయంలో తగ్గి, సర్వీస్ రంగంలో పెరగింది .. పరిశ్రమలలో యధాతథంగా ఉంది. 2008-09 లెక్కల ప్రకారం అమ్మకం పన్ను వసూళ్లలో కోస్తా వాటా 14.3 శాతం, రాయలసీమ వాటా 2.9 శాతం కాగా హైదరాబాద్ లేని తెలంగాణది 7.6 శాతం, హైదరాబాద్‌తో కలిపితే 82.8 శాతం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మొత్తం రాష్ట్రంలోనే తక్కువ. ఆ మొత్తాలు 12,421 కోట్లు. అందులో, హైదరాబాద్‌లో కలిపిన తెలంగాణలో 6490 కోట్లు. హైదరాబాద్ లేని తెలంగాణలో 1658 కోట్లు. ఈ పెట్టుబడులు కోస్తాలో 5499 కోట్లు కాగా రాయలసీమలో 732 కోట్లు మాత్రమే. ప్రతి వెయ్యి చదరపు కిలో మీటర్లకు రోడ్ల నిర్మాణంలో కోస్తాంధ్ర అగ్రస్థానంలో ఉండగా, రాయలసీమ రెండో స్థానంలో, హైదరాబాద్ లేని తెలంగాణ చివరిస్థానంలో ఉన్నాయి. అయితే పంచాయతీ రాజ్ రోడ్ల విషయంలో తెలంగాణది మొదటిస్థానం కాగా, కోస్తాది రెండవ స్థానం, సీమది మూడవ స్థానం.

పంటల సాగుకు సంబంధించి కోస్తాలో మొత్తం సాగు భూములు 1956-60 లో 42 లక్షల హెక్టార్లు కాగా, 2006-09 నాటికి 53 లక్షల హెక్టార్లకు పెరిగింది. ఇది 20 శాతం పెరుగుదల. తెలంగాణలో 48 లక్షల నుంచి 50 లక్సలకు పెరిగింది. ఇది కేవలం 5 శాతం అభివృద్ధి. రాయలసీమలో 32 లక్షల నుంచి 6 శాతం తగ్గి 30 లక్షల హెక్టర్లకు చేరింది. నీటిపారుదల కోస్తా, తెలంగాణలలో గణనీయంగా పెరగగా, రాయలసీమలో అది స్వల్పంగానే ఉంది. వ్యవసాయానికి విద్యుత్ వినియోగం 1974-75 కాలంలో తెలంగాణలో ఒక్కో కనెక్షన్‌కు సగటున 1898 kwh ఉండగా, 2008-09 నాటికి 5920 kwh కి పెరిగింది. ఇదే కాలంలో రాయలసీమలో 2136 నుంచి 6346 కు, కోస్తాలో 3323 నుంచి 5791 కి పెరిగింది. 2001 జనాభా లెక్కల ప్రకారం, రాష్ట్రంలో కాయకష్టం చేసుకుని జీవించే వారి సంఖ్య పురుషులు 56.2 శాతం, స్త్రీలు 35.1 శాతం. ప్రాంతాల వారిగా చూసినప్పుడు ఈ లెక్కలు హైదరాబాద్‌తో కలిపిన తెలంగాణలో 53.8 శాతం, 36.8 శాతంగా తేలాయి. హైదరాబాద్ గాక తక్కిన తెలంగాణలో 54.8 శాతం, 40.5 శాతం, హైదరాబాద్ నగరంలో 47.3 శాతం, 9.9 శాతం, రాయలసీమలో 57.2 శాతం, 37.8 శాతం, కోస్తాంధ్రలో 58.2 శాతం, 32.4 శాతం. ఎంప్లాయిమెంట్ ఎక్సేంజీల ద్వారా ఉద్యోగాలు లభించటం ప్రతి వెయ్యి మంది జనాభాకు, 2008 లో రాష్ట్రం సరాసరి 94. కోస్తాంధ్ర లెక్క 79, రాయలసీమ 104, హైదరాబాద్ 117 కాగా, హైదరాబాద్ లేని తెలంగాణది 123, హైదరాబాద్‌తో కూడిన తెలంగాణది 122.

ప్రత్యేక తెలంగాణ కోరే వారి ప్రధానమైన వాదనలలో ఒకటి ఆ ప్రాంతం బాగా వెనుకబడిందని, వివక్షకు గురైందని, కోస్తాతో పోల్చినపుడు ఆ ప్రాంతంలో తలసరి ఆదాయం, ఉపాధి అవకాశాలు, వ్యాపారవకాశాలు, విద్యావకాశాలు తక్కువని, అధికాదాయం గల ఉపాధి అవకాశాలు కూడా కోస్తా వారికి ఎక్కువని తెలంగాణ వారంటారు. లెక్కలు, శాతాలను చూసినపుడు ఇదంతా నిజమేననిపిస్తుంది. కాని ఆదాయాల పెరుగుదల రేటు, అభివృద్ధి రేటు, రాష్ట్ర ఆదాయంలో వాటా మొదలైన వాటిని పరిశీలించినపుడు పైవిధమైన తేడాలలో విశేషం కన్పించదు. గతంతో పోల్చితే ఈ వ్యత్యాసాలు చాలా తగ్గాయి. అభివృద్ధి రేట్లు కోస్తాతో పాటు తెలంగాణాలో కూడా గణనీయంగా ఉన్నాయి. అయితే ఒకే ప్రాంతంలోని వేర్వేరు వర్గాల మధ్య వ్యత్యాసాలు తెలంగాణ, రాయలసీమలో పెరుగుతుండగా, కోస్తాలో తగ్గుతుండటం విశేషం. ఇటువంటి పరిస్థితుల్లో సాధారణ ప్రజలను ఉద్యమాల కోసం ఉపయోగించుకోవటం తేలిక. తెలంగాణ అంశాన్ని కేవలం వెనుకబాటు తనం కోణం నుంచి చూసినపుడు విభజన కోరిక సమర్ధనీయంగా తోచదు. ఎందుకంటే, తేడాలు తగ్గుతుండటమేగాక, హైదరాబాద్‌తో కలిపి చూపినపుడు ఆ ప్రాంత పరిస్థితి మెరుగుగానే ఉంది. అందువల్ల నిజంగా వెనుకబడిన ప్రాంతం రాయలసీమ అని చెప్పాలి. ఆర్థిక కార్యకలాపాల రీత్యా హైదరాబాద్ చాలా కీలకమైనది. అక్కడ తమ కార్యకలాపాలు సాగించేందుకు ఎవరికైనా అవకాశం ఉండాలి. అయితే నగరంపై రాజకీయ నియంత్రణ సమైక్యాంధ్రప్రదేశ్‌కు ఉంటుందా లేదా అనే దానితో నిమిత్తం లేకుండా కూడా అందుకు అవకాశం ఉండవచ్చని శ్రీకృష్ణ కమిటీ అభిప్రాయపడింది ...

శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని తొలి అధ్యాయ సారాంశమిది.

రెండవ అధ్యాయం - విద్య మార్చు

మానవాభివృద్ధికి సంబంధించి విద్యారంగం ఒక ముఖ్యమైన సూచిక. ఇదే అంశం ప్రస్తుతం సీమాంధ్రులను, తెలంగాణవాదులను ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న సందర్భంలో..... హైదరాబాద్ నగరం తెలంగాణకే రాజధాని అయితే తమ పిల్లల చదువులు, వారి భవిష్యత్తు ఏమిటన్నది సీమాంధ్రుల ప్రశ్న. విద్యారంగానికి సంబంధించిన ఇలాంటి అనేక ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకపోయినప్పటికీ.. శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో ఈ రంగాన్ని లోతుగా అధ్యయనం చేసింది. వి నిజానికి అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ జాతీయ సగటు కన్నా వెనుకబడి ఉంది. ఈ తేడా ఇటీవలి సంవత్సరాల్లో కొద్దిగా తగ్గింది. 1956లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన కృషి ఇందుకు కారణంగా చెప్పొచ్చు. జాతీయ స్థాయి అక్షరాస్యత శాతం 1961లో 28 కాగా, ఆంధ్రప్రదేశ్ శాతం 21 మాత్రమే. ప్రాంతాలవారీగా చూస్తే ఈ శాతాలు కోస్తాలో 24, రాయలసీమలో 21గా ఉండేవి. తెలంగాణ విషయానికి వస్తే.... హైదరాబాద్‌లో 35, హైదరాబాద్‌తో కలిపి 17, హైదరాబాద్ లేకుండా 14 శాతం ఉండేవి. అంటే తెలంగాణలో అక్షరాస్యత చాలా తక్కువ. 2001నాటికి మన రాష్ట్ర అక్షరాస్యత జాతీయ సగటు కన్నా తక్కువే. జాతీయ సగటు 65 శాతం కాగా, ఆంధ్రప్రదేశ్‌ది 60. కోస్తా 63 శాతంతో, రాయలసీమ 60 శాతంతో రాష్ట్ర స్థాయికి సమానంగానో, కొంత ఎక్కువగానో ఉంది. కాని, తెలంగాణను విడిగా చూసినపుడు 55 శాతం, హైదరాబాద్‌తో కలిపి లెక్కగట్టినా 58 శాతంగా ఉంది. ఒక్క హైదరాబాద్‌ను విడిగా చూసినపుడు మాత్రం అక్షరాస్యత 79 శాతం. అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కోస్తా, సీమలో అక్షరాస్యత బాగా మెరుగుపడగా, తెలంగాణలో పరిస్థితి మాములుగా ఉంది.

అక్షరాస్యతలో తేడాలు

1961తో పోలిస్తే 2001లో.... తెలంగాణకు ఇతర ప్రాంతాలకు మధ్య అక్షరాస్యత శాతంలో తేడా తగ్గింది. ప్రధానంగా 1970వ దశకం నుంచి ఈ శాతాలు బాగా తగ్గుతూ వస్తున్నాయి. అప్పటినుంచి అక్షరాస్యత పెరుగుదల శాతం మాత్రం కోస్తా, సీమలలో కంటే తెలంగాణలో ఎక్కువగా నమోదవుతోంది. వెనుకబడిన ప్రాంతాలకు ఎక్కువ చేయూతనిచ్చి ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందిన ప్రాంతాల స్థాయికి పెరిగేందుకు ప్రజాస్వామిక వ్యవస్థలో చర్యలు తీసుకోవాలని శ్రీకృష్ణ కమిటీ సూచించింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 45 ఏళ్ల తర్వాత కూడా అంతరం తగ్గకపోవడానికి కారణం తెలంగాణ పట్ల వివక్షే అన్నది అక్కడి ప్రజల వాదన. జిల్లాల వారీగా లెక్కలను తీసుకుని చూస్తే, రాష్ట్రంలో అతి తక్కువ అక్షరాస్యత ఉన్న 10 జిల్లాలలో 6 తెలంగాణలోనే ఉన్నట్లు తేలింది. అంతేకాదు, బాలికల అక్షరాస్యత, బడికి వెళ్తున్న పిల్లల శాతం, ఎస్సీ, ఎస్టీల అక్షరాస్యతలను చూసినా తెలంగాణ కన్నా ఆంధ్ర, రాయలసీమలలో పరిస్థితి మెరుగ్గానే ఉంది. అయితే, సాధారణ అక్షరాస్యత లాగానే ఈ విషయంలోనూ తేడాలు తగ్గుతున్నాయి.

అక్షరాస్యత లెక్కలను సరిగ్గా అంచనా వేయాలంటే యువజనుల పరిస్థితి తెలుసుకోవాలి. పిల్లలు పైస్థాయి చదువులకు ఎంతమంది వెళుతున్నారనే దానిని బట్టే ఒక ప్రాంతపు ప్రగతి అర్థమవుతుంది. అలా చూసినప్పుడు 8 నుంచి 24 ఏళ్ల వయసు వారిలో తెలంగాణ అక్షరాస్యత 1983లో 46 శాతం కాగా, 2007లో అది 89 శాతం అయింది. ఇది రాయలసీమలో 51 శాతం నుంచి 82 శాతానికి, ఆంధ్రలో 54 శాతం నుంచి 88 శాతానికి పెరిగింది. అంటే ఈ పెరుగుదల శాతం తెలంగాణలో తక్కిన ప్రాంతాల కన్నా ఎక్కువగా 93శాతం ఉండగా, సీమలో 61శాతం, ఆంధ్రలో 63శాతంగా ఉంది. 1982లో తక్కిన రెండు ప్రాంతాల కన్నా తెలంగాణ వెనుకబడి ఉండగా 2007 వచ్చే సరికి వాటిని మించిపోయింది.

స్వతంత్ర పోరాటం సాగుతున్న సమయంలో, ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు దశలో, ఆతర్వాత కొంతకాలం వరకు తెలంగాణ వెనుకబడి ఉండటానికి కారణాలు అనేకం. ఒక రకంగా అవి చారిత్రక కారణాలు. సీమాంధ్ర ప్రాంతం బ్రిటీష్ వలస పాలనలో ఉండటం వల్ల.. అక్కడ తగినన్ని పాఠశాలలు, టీచర్లు ఉండటం వల్ల.. ఇంగ్లిష్ చదువు అందుబాటులో ఉండటం ఆ ప్రాంతం అక్షరాస్యతలో మెరుగ్గా ఉండింది. నిజాం పాలనలో ఉన ్న తెలంగాణ ఆ విషయంలో వెనుకబడిందని శ్రీకృష్ణ కమిటీ విశ్లేషించింది.

తెలంగాణలో బోధనాభాషగా ఉర్దూ ఉండటం వల్ల.. తెలుగుకు అంత ప్రోత్సాహం దొరకలేదు. అందుకే ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు తగిన అర్హతలు గల ఉపాధ్యాయులను కోస్తా ప్రాంతం నుంచి తీసుకురావలసి వచ్చింది. చారిత్రక కారణాలతో పాటు, గ్రామీణులు, ఎస్సీ, ఎస్టీలు, బీసీలు కూడా అక్షరాస్యతకు దూరమయ్యాయి. ఎస్సీలను తీసుకుంటే, 2001లో రాష్ట్రంలో వారి అక్షరాస్యత 54 శాతం. అందులో పురుషులది 64 శాతం. స్త్రీలది 43 శాతం. ఇక ప్రాంతాల వారీగా చూసినపుడు ఎస్సీల మొత్తం అక్షరాస్యత కోస్తాలో 60 శాతం, సీమలో 51 శాతం, హైదరాబాద్ నగరంలో 69 శాతం, తెలంగాణలో 46 శాతం, హైదరాబాద్‌తో కూడిన తెలంగాణలో 47 శాతం. ఈ తేడాలు స్త్రీ, పురుషుల విషయంలోనూ కనిపిస్తున్నాయి. సాధారణ అక్షరాస్యతలాగానే ఎస్సీల అక్షరాస్యతకు సంబంధించి కూడా తెలంగాణ వెనుకబడి ఉంది. ఎస్‌టిల విషయంలోనూ ఇదే పరిస్థితి ఉంది.

పాఠశాలలో చేరే వారి సంఖ్య తెలంగాణలో ఎక్కువైనట్లు అధికారిక లెక్కలు చూపుతున్నాయి. అయితే, ఇవి సరైన లెక్కలు కావని, మధ్యాహ్న భోజన పథకం కారణంగా కాంట్రాక్టర్లు ఎక్కువ చేసి చూపించే లెక్కలని స్వచ్ఛంద సంస్థల వారి వాదన. 2007లో మానవాభివృద్ధి నివేదిక కూడా ఈ విషయాన్నే చెప్పింది. పాఠశాలలో చేరే పిల్లల సంఖ్య ఒకటైతే, మధ్యలో చదువు మానే వారి లెక్క మరొకటి. మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్ జిల్లాలలో అన్ని స్థాయిలలో కూడా మధ్యలో చదువు మానే వారు ఎక్కువ. ప్రకాశం, గుంటూరు, ఆదిలాబాద్, నిజామాబాద్‌లలో ప్రాథమిక పాఠశాలల స్థాయి పరిస్థితి బాగానే ఉన్నా, పై తరగతులలో బడి మానేసే వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. వారిలో కొందరు తర్వాత క్లాసుల కోసం వేరే జిల్లాలకు వెళుతుండటం ఇందుకొక కారణం కావచ్చు. పైచదువుల విషయంలో ప్రస్తుతం కోస్తా కన్నా తెలంగాణలో ఎక్కువ డిమాండ్ ఉంది. కోస్తా ప్రాంతం వ్యవసాయకంగా అభివృద్ధి చెందడం, వెనుకబడిన తెలంగాణలో జీవనాభివృద్ధి కోసం ఆరాటం ఎక్కువ కావటం ఇందుకు కారణంగా చెప్పుకోవాలి. తెలంగాణలో ఆర్థిక పరిస్థితులు క్రమంగా బాగుపడుతూ, వారిలో చదువు పట్ల ఆకాంక్ష పెరగటం కూడా ఇందుక్కారణం. అదే సమయంలో రిజర్వేషన్లు, ఫీజుల రీఇంబర్స్‌మెంట్ ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఆప్రాంతపు విద్యార్థులు బాగా చదువుకోవాలని, మంచి ఉద్యోగాలు సంపాదించాలని, వీలనైంత వరకు ప్రభుత్వ సర్వీసులలో చేరాలని ప్రయత్నిస్తున్నారని కమిటీ నిర్ధారించింది.

విద్యా సౌకర్యాలు పిల్లలకు అందుబాటులో ఉండటం ఎంత ముఖ్యమో, వాటి ప్రమాణాలు కూడా అంతే ముఖ్యం. విద్యా సౌకర్యాలు అందుబాటులో ఉండటం విషయంలో ఇతర రాష్ట్రాల స్థాయి కన్నా ఆంధ్రప్రదేశ్ స్థితి మెరుగుగా ఉంది. రాష్ట్రంలో దాదాపు 90 శాతం మంది పిల్లలకు ప్రాథమిక పాఠశాలలు తాము నివసించే ప్రాంతంలోనే అందుబాటులో ఉన్నాయి. వేర్వేరు జిల్లాలతో పోలిస్తే ఈ విషయంలో వాటి మధ్య తేడాలు ఎక్కువ లేవు. ఉన్న తేడాలు కూడా తగ్గుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం ప్రాథమిక పాఠశాలలు 1960-61లో 30,495 ఉండగా, 2008-02 వచ్చేేసరికి 65,609కి పెరిగాయి. ఇదే కాలంలో ఈ సంఖ్య ప్రతి లక్ష మంది జనాభాకు తెలంగాణలో 71.9 నుంచి 71.7కు తగ్గింది. రాయలసీమలో 104.8 నుంచి 85.9కి, కోస్తాలో 86.2 నుంచి 77.4 కు తగ్గింది. రాయలసీమలో 104.8 నుంచి 85.9కి, కోస్తాలో 86.2 నుంచి 77.4కు తగ్గాయి. మొత్తం ప్రాథమిక పాఠశాలల సంఖ్య రాష్ట్రంలో పెరిగినప్పటికీ, ప్రతి లక్ష జనాభాకు పాఠశాలలు తగ్గడానికి కారణం.... ప్రాథమిక పాఠశాలల స్థాయి ప్రాథమికోన్నతకి, ఉన్నత పాఠశాలకు పెరగడమే. అంటే గతంలో కన్నా ఇప్పుడు ప్రాథమికోన్నత స్కూళ్లు, హైస్కూళ్లు పెరుగుతున్నాయన్న విషయం తెలిసింది. ఈ పెరుగుదల అన్ని ప్రాంతాల్లో ఉంది. ప్రాథమికోన్నత స్కూళ్ల సంఖ్య 1960-61 లో 444 కగా, 2008-09 నాటికి గణనీయంగా 14,942కు పెరిగింది. అంటే ప్రతి లక్ష మంది జానాభాకు 1.23 స్కూళ్ల నుంచి 19.61 స్కూళ్లు అయ్యాయి. ప్రాంతాల వారీగా చూసినపుడు ఈ సంఖ్యలు ప్రతి లక్ష జనాభాకు తెలంగాణలో 1.3 స్కూళ్ల నుంచి 18.2కు పెరిగాయి. రాయలసీమలో 1.4 నుంచి 20.4కు, కోస్తాలో 1.1 నుంచి 15.3కు పెరిగాయి. ఈ పెరుగుదల మూడు ప్రాంతాల్లోనూ గణనీయంగా ఉందన్నమాట. స్పాట్............ వాయిస్4: రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్లకు డిమాండ్ 1980 నుంచి, మరీ ముఖ్యంగా 1990ల నుంచి పెరుగుతోంది. విద్యా ప్రమాణాలు ప్రభుత్వ పాఠశాలల్లో కన్నా ప్రైవేటులోనే బాగుంటాయన్న అభిప్రాయం ఇందుక్కారణం కావచ్చు. 2009 నాటి లెక్కల ప్రకారం ప్రైవేటు స్కూళ్లకు వెళ్లే పిల్లల సంఖ్యలు తెలంగాణలో 33.1 శాతం కాగా, కోస్తాలో 28.5, రాయలసీమలో 23.9గా ఉన్నాయి. చదువుకున్న తల్లుల సంఖ్య విషయంలో 39.7 శాతంతో తెలంగాణ అడుగున ఉండగా, అక్కడ ట్యూషన్లకు వెళ్లే వారు కూడా 12.3 శాతమే. ఇది మూడు ప్రాంతాలలోకీ తక్కువ. విద్యా ప్రమాణాల విషయంలోనూ తెలంగాణ పిల్లలు వెనుకబడి ఉన్నారని శ్రీకృష్ణ కమిటీ అంచనా వేసింది

ఉన్నత పాఠశాలలు

రాష్ట్రంలో ఉన్నత పాఠశాలల సంఖ్య 1960-61లో 1224 నుంచి 2008-09లో 17,376 కు పెరిగింది. ప్రతి లక్ష జనాభాకు 3.40శాతం పాఠశాలలు ఉండగా ఇపుడవి 22.80శాతానికి పెరిగాయి. ప్రాంతాలవారీగా చూసినపుడు 1960-61లో తెలంగాణలో 3.1 నుంచి 2008-09 లో 25.4కు పెరిగాయి. సీమలో 3.3 నుంచి 18.6కు, కోస్తాలో 3.7 నుంచి 15.7కు పెరిగాయి. అంటే పెరుగుదల విషయంలో కోస్తా కన్నా సీమ, దానికన్నా తెలంగాణ ముందున్నాయి. 11,12వ తరగతుల కోసం కేంద్ర ప్రభుత్వం నడిపే స్కూళ్లను, కొన్ని ప్రైవేటు అన్ ఎయిడెడ్ స్కూళ్లను హయ్యర్ సెకండరీ స్కూళ్లని అంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే వాటిని జూనియర్ కాలేజీలంటున్నారు. ఈ స్కూళ్లు, కాలేజీలు కోస్తాలో 39 శాతం, రాయలసీమలో 15 శాతం, హైదరాబాద్ నగరంలో 80 శాతం, హైదరాబాద్ మినహా తక్కిన తెలంగాణలో 38 శాతం ఉన్నాయి. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణలో 46 శాతం ఉన్నాయి.

వాయిస్2: ఇక ప్రతి లక్ష మంది ఎస్సీలకు హాస్టళ్లు అతి తక్కువగా ఉన్నాయి. అయితే ఈ తేడా 1991- 2001 నాటికి బాగా తగ్గింది. ఎస్టీ విద్యార్థుల విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. దేశ స్వాతంత్ర్యం నాటికి సీమాంధ్రలో తగినన్ని కాలేజీలు ఉండేవి గనుక, 1956లో ఆంధ్ర్రప్రదేశ్ ఏర్పాటు నాటికి ఆ ప్రాంతం తెలంగాణ కంటే కూడా ముందంజలో ఉంది. అలా మచిలీపట్నం, రాజమండ్రి, విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ, విజయవాడలలో కలిపి మొత్తం ఏడు కాలేజీలు ఉండేవి. విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీ ఉండేది. రాయలసీమలోని మదనపల్లె, అనంతపురంలోనూ కాలేజీలుండేవి. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, వరంగల్‌లలో మాత్రమే కాలేజీలు ఉండేవి. అలా సీమాంధ్ర ప్రాంతం విద్యారంగంలో ముందుండటం వల్ల పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణకు విద్య, ఆరోగ్య రంగాల్లో కొన్ని రక్షణలు కల్పించారు. అదేవిధంగా, ఆ తర్వాత వివిధ ఒప్పందాలలోనూ ఈ రక్షణలు కొనసాగించారు. ఉద్యోగాల విషయమై వవాదాలు నేటికీ కొనసాగటానికి మూలాలు కూడా ఇందులో ఉన్నాయి. 1969 నాటి అఖిలపక్ష ఒప్పందం, 1972 నాటి పంచ సూత్ర పథకం, 1973 నాటి ఆరు సూత్రాల పథకం, 1974 నాటి ఆంధ్రప్రదేశ్ విద్యాసంస్థల ఉత్తర్వులలో ఇదే కన్పిస్తుంది.

వాయిస్3: రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాత ప్రస్తుతం రాష్ట్రంలో యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థల విధానాలు రెండు విధాలుగా ఉన్నాయి.17 యూనివర్సిటీలలో రాష్ట్ర వ్యాప్తమైనవి. వాటిని స్టేట్ యూనివర్సిటీలు అంటున్నారు. వీటిల్లో అడ్మిషన్ల కోసం రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విభజించారు. ఉస్మానియాలో తెలంగాణ వారికి, వెంకటేశ్వరలో రాయలసీమ, నెల్లూరు వారికి, ఆంధ్ర యూనివర్సిటీలో ఎనిమిది కోస్తా జిల్లాల వారికి ప్రవేశాలుంటాయి. తక్కిన వాటిలో 85 శాతం సీట్లు స్థానికులకు రిజర్వవుతాయి. 2008-09 లెక్కల ప్రకారం తెలంగాణలో ప్రభుత్వ కాలేజీలు 99, ఎయిడెడ్ కాలేజీలు 17, మొత్తం 116 ఉన్నాయి. హైదరాబాద్‌తో కలిపి ప్రభుత్వ కాలేజీలు 106, ఎయిడెడ్‌వి 53, మొత్తం 159 ఉన్నాయి. దీంతో పోల్చితే ఆంధ్రలో ప్రభుత్వానివి 80, ఎయిడెడ్‌ 101, మొత్తం 181, సీమలో ప్రభుత్వానికి 54, ఎయిడెడ్ 25, మొత్తం 79 ఉన్నాయి. అంటే......... యువకుల జనాభా విషయంలో ఆంధ్ర, తెలంగాణలు ఇంచుమించు ఒకే స్థాయిలో ఉన్నా కోస్తాలో ఎక్కువ కాలేజీలు ఉన్నాయి. ఇందుకు ఒక కారణం ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నాటికే ఆంధ్రలో ఎయిడెడ్ కాలేజీలు ఎక్కువగా ఉండటం. సాంకేతిక విద్య, వృత్తి విద్యతో పాటు... హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో విద్యారంగం పరిస్థితిపైనా శ్రీకృష్ణ కమిటీ లోతుగా అధ్యయనం చేసింది.రాష్ట్రంలో వృత్తి విద్యా కళాశాలలు సంఖ్య 1996 నుంచి గణనీయంగా పెరిగింది. ఆ సంఖ్య 1996లో 37 కాగా, 2008-09 నాటికి 540 పెరిగింది. ఇది 1359 శాతం పెరుగుదల. ఫార్మసీ కాలేజీలు 4167 శాతం పెరిగి 6 నుంచి 256కు చేరాయి. ఎంబిఏ కాలేజీలు 775 శాతం పెరిగి 57 నుంచి 499కి పెరిగాయి. ఎంసిఎ కాలేజీలు 44 నుంచి 698 అయ్యాయి. ఇది 1486 శాతం పెరుగుదల. ప్రాంతాలవారీగా చూసినపుడు 2009-10లో ఇంజినీరింగ్ కాలేజీలు కోస్తాలో 233, రాయలసీమలో 87, హైదరాబాద్‌ను కలిపిన తెలంగాణలో 286, హైదరాబాద్-రంగారెడ్డిన తీసివేసిన తెలంగాణలో 134 ఉన్నాయి. ఫార్మసీ కాలేజీలు కోస్తాలో 93, సీమలో 27, హైదరాబాద్ కలిపిన తెలంగాణలో 159, హైదరాబాద్‌ను రంగారెడ్డిని తీసివేసిన తెలంగాణలో 92 ఉన్నాయి. ఇతర కోర్సులకు సంబంధించి కూడా ఇంచుమించు ఇటువంటి పరిస్థితే ఉంది.

ఈ తరహా కాలేజీలు కోస్తాంధ్ర, రాయలసీమ కన్నా తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయి. అయితే అవి ఎక్కువ భాగం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కేంద్రీకృతం అయ్యాయి. అందుకు కారణం మార్కెట్ శక్తులు. ఈ కాలేజీలలో అధికశాతం ప్రైవేట్‌ యాజమాన్యాల నిర్వహణలో ఉన్నవే. ఇటువంటి కాలేజీల నిర్వహణలో లాభాలు ఉన్నాయి కాబట్టి అవి హైదరాబాద్, రంగారెడ్డిలోనే ఎక్కువగా నెలకొల్పారు. మళ్లీ ఈ రెండు జిల్లాలను మినహాయిస్తే తక్కిన తెలంగాణ ప్రాంతంలో ఈ కాలేజీలు కోస్తా కన్నా తక్కువ. రాయలసీమ మాత్రం తెలంగాణ కన్నా వెనుకబడి ఉంది. ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ కాలేజీలను భవిష్యత్తులో వెనుకబడిన ప్రాంతాలలో నెలకొల్పడం అవసరమని శ్రీకృష్ణ కమిటీ సూచించింది. ఇక- విద్యాసంస్థలు పెద్ద సంఖ్యలో కేంద్రీకరించి ఉండటంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను విడిగా పరిగణించాలి. ఈ పరిస్థితిలో ఈ రెండు జిల్లాలలో విద్యావకాశాలు అందుబాటులో ఉండటం సీమాంధ్ర, తెలంగాణ వారికి ఈ ప్రాంతం కీలకంగా మారింది. ఇది ఉద్యోగాలకు కూడా అవసరమని మూడు ప్రాంతాల విద్యార్థులు బలంగా అభిప్రాయపడుతున్నారు. అనేకమంది తల్లిదండ్రులు తమ పిల్లలను నాలుగేళ్ల పాఠశాల చదువు కోసం ఇక్కడకు పంపుతుంటారు. అందువల్ల, 6వ జోన్‌లోకి వచ్చే హైదరాబాద్‌లో ఉన్నత విద్యకు వారికి అవకాశం లభిస్తుంది. హైదరాబాద్‌లో అక్షరాస్యత శాతం 79. అక్కడ IT రంగంలో ఉద్యోగాలు ఎక్కువ. సాఫ్ట్‌వేర్ రంగానికి దేశంలోనే అదోక ముఖ్యకేంద్రం. హైదరాబాద్ యూనివర్సిటీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, నల్సార్ లా యూనివర్సిటీ వంటి ప్రముఖ సంస్థలు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి. అయితే తెలంగాణ జిల్లాలలో ఏర్పాటు చేయాల్సిన సంస్థలను హైదరాబాద్ తరలిస్తున్నారని, దాంతో ఇతర ప్రాంతాల వారు కూడా వాటిలో ప్రవేశం పొంది, తమ అవకాశాలు దెబ్బతీస్తున్నారన్నది తెలంగాణవాదుల ఫిర్యాదు. నిజానికి హైదరాబాద్ కన్నా రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నత విద్యాసంస్థలు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రభుత్వ స్కూళ్లు చాలా తక్కువ. మధ్యతరగతి, ఉన్నత తరగతుల వారి కోసం ఏర్పాటు చేసిన ప్రైవేట్ స్కూళ్లే అత్యధికంగా ఉన్నాయి. ఇటీవలి కాలంలో అత్యున్నత శ్రేణివర్గాల కోసం గ్లోబల్ స్కూళ్లు ఏర్పాటవుతున్నాయి. ముస్లింలు ఎక్కువగా నివసించే పాతబస్తీలో స్కూళ్లకు కావలసిన సదుపాయాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్రపటి నుంచి ఉర్దూ భాష, ఉర్దూలో బోధన కూడా దెబ్బతింటున్నాయి. ఈ పరిస్థితి మారాలని శ్రీకృష్ణ కమిటీ అభిప్రాయపడింది.

తలసరి లెక్కల ప్రకారం తెలంగాణ యూనివర్సిటీలకు సాలుసరి బ్లాక్ గ్రాంట్లు తక్కువగా ఇస్తున్నారన్నది ఒక ఫిర్యాదు. టీఆర్ఎస్, టీడీఎఫ్, టీటీడీపీ, టీ-కాంగ్రెస్‌లు చెబుతున్న దాని ప్రకారం... ఆ నిధులు వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రా యూనివర్సిటీకి 35,500 రూపాయలు, నాగార్జున యూనివర్సిటీకి 22,700, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీకి 37,500, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీకి 25,000, ఉస్మానియా యూనివర్సిటీకి 17,400, కాకతీయ యూనివర్సిటీకి 14,000. ఇవన్నీ కూడా 2004-09 సంవత్సరాల లెక్కలు. కానీ ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం ఈ మొత్తాలు 2004-07 నుంచి 2009-10 మధ్య సరాసరిన ఇలా ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీకి 46,100 రూపాయలు, నాగార్జున యూనివర్సిటీకి 52,968, శ్రీవెంకటేశ్వరకు 38,717, శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీకి 80,118, ఉస్మానియాకు 45,408, కాకతీయకు 58,344 రూపాయలు. ప్రభుత్వ వివరణ ప్రకారం విద్యార్థుల సంఖ్యను క్యాంపస్‌కు, కానిస్టిట్యూయెంట్ కాలేజీలకు పరిమితమై చూస్తారు. అఫిలియేటెడ్ కాలేజీలను, దూరవిద్యాకేంద్రాల విద్యార్థులను పరిగణలోకి తీసుకునే వీలే లేదు. యూనివర్సిటీలో పనిచేసే సిబ్బంది జీతభత్యాలకు, పెన్షన్లకు మాత్రమే బ్లాక్ గ్రాంట్లు మంజూరు చేస్తారు. ప్రాంతాల వారీగా చూసినపుడు 2006-10 కాలంలో తలసరి బ్లాక్ గ్రాంట్లు తెలంగాణకు 47,814 రూపాయలు లభించగా, కోస్తాకు 47,147, రాయలసీమకు 44,696 మంజూరయ్యాయి. పోతే ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో ఒక్కో విద్యార్థికి సగటున 2006-10 మధ్య, తెలంగాణకు 7614 రూపాయలు, హైదరాబాద్ కలిపిన తెలంగాణకు 8073, కోస్తాంధ్రకు 11,558, రాయలసీమకు 9192 రూపాయలు అందుతున్నాయి. ప్రభుత్వ పాలిటెక్నిక్‌లకు సంబంధించి 2004-05 నుంచి 2008-09 కాలంలో ఒక్కొక్క విద్యార్థిపై కోస్తాలో 47,040 రూపాయలు, సీమలో 76,170, హైదరాబాద్ లేని తెలంగాణలో 42,820, హైదరాబాద్‌తో కూడిన తెలంగాణలో 48,430 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇవన్ని ప్రభుత్వ లెక్కలే. ఈ వివరాలన్నింటినీ గమనించినప్పుడు బ్లాక్ గ్రాంట్ల విషయంలో తెలంగాణకు ఎక్కువ మొత్తం రాయలసీమకు తక్కువ మొత్తం అందుతుండగా, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్‌లకు సంబంధించి తెలంగాణ వెనుకబాటులో ఉంది. పాలిటెక్నిక్‌ల విషయంలో అనంతపురానికి ప్రతిసారి ఎక్కువ లభిస్తుండగా మహబూబ్‌నగర్‌కు కేటాయింపులు అందులో అయిదో వంతు మాత్రమే ఉన్నాయి. కొత్తగా ఏర్పాటైన యూనివర్సిటీలలో కడపకు చెందిన యోగి వేమనకు ఎక్కువగా, నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీకి, నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీకి తక్కువగా నిధులు ఇస్తున్నారనే ఆరోపణ కూడా నిజమేనని శ్రీకృష్ణ కమిటీ పరిశీలనలో తేలింది.

కోస్తాంధ్ర, రాయలసీమలోని ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీలకు ఎక్కువ మొత్తాలు అందజేస్తున్న ప్రభుత్వం తెలంగాణ కాలేజీల పట్ల వివక్ష చూపుతోందని కొందరి ఫిర్యాదు. ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా ధ్రువీకరించింది. అయితే ఇందుకు చారిత్రక కారణాలు ఉన్నాయి తప్ప ఉద్దేశపూర్వకంగా చేస్తుంది మాత్రం కాదన్నది శ్రీకృష్ణ కమిటీ పరిశీలనలో తేలిన వాస్తవం. రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలను, విద్యాసంస్థలను కోస్తా, సీమలలో ఆయా ప్రాంతాల వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్ వద్ద కేంద్రీకరించడం వల్ల ఆ ప్రాంత విద్యార్థులకు నష్టం కలుగుతున్నదన్న ఫిర్యాదు అందాయి. నిజానికి జేఎన్‌టీయూను వరంగల్‌లో ఏర్పాటు చేయాల్సి ఉండగా, దాన్ని హైదరాబాద్‌కు తెచ్చారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని నల్లగొండ నుంచి రెండు మాసాల్లోనే హైదరాబాద్‌కు తరలించారు. ఐఐటీని ఆదిలాబాద్ జిల్లాలోని బాసరలో ఏర్పాటు చేయాల్సి ఉండగా, మెదక్‌లో ప్రారంభించారు. హైదరాబాద్ రాజధాని కాబట్టి... అలా చేస్తున్నట్లు చెప్పారు గానీ ఈ సూత్రాన్ని సీమాంధ్రలో పాటించలేదు. దీంతో తెలంగాణలో ప్రాంతీయ సమతుల్యత, ఉపాధి అవకాశాలు, అభివృద్ధి దెబ్బతింటున్నాయి. ఇందుకు భిన్నంగా ఒక్క తిరుపతిలోనే నాలుగు రాష్ట్ర స్థాయి విద్యాకేంద్రాలు నెలకొల్పారన్నది మరో ఫిర్యాదు. అయితే, ఈ స్థాయి విద్యా సంస్థల ఏర్పాటు వల్ల జిల్లాలో ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుందన్న విషయం మినహాయిస్తే, కోర్సుల ప్రవేశాలలో వచ్చే తేడా ఏమీ లేదు. పైరంగాలకు ప్రభుత్వం ఇచ్చిన వివరణ ప్రకారం....... హైదరాబాద్ పరిసరాలలో అనేక పరిశ్రమలు, పరిశోధనా కేంద్రాలు, ఇతర విద్యా సంస్థలు, అంతర్జాతీయ విమానాశ్రమం వంటివి ఉండటం వల్ల ఐఐటీని బాసర నుంచి మెదక్‌కు మార్చారు. దేశ విదేశాల నుంచి వచ్చే ప్రొఫెసర్లు, నిపుణులకు కూడా ఇది సౌకర్యవంతంగా ఉంటుంది. ఏది ఏమైనా హైదరాబాద్, వరంగల్, రాయలసీమలో కడప, చిత్తూరు, కోస్తాంధ్రలో విశాఖపట్నం, గుంటూరు పట్టణాలు విద్యా కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నందున మూడు ప్రాంతాల ప్రయోజానాలు బాగానే నెరవేరుతున్నట్లు భావించాలని కమిటీ తన నివేదికలో చెప్పింది.

తెలంగాణలో మెడికల్, డెంటల్ కాలేజీల సీట్లు తక్కువగా ఉన్నాయి. ఇది ఫిర్యాదే కావచ్చు కానీ నిజం లేకపోలేదు. కోస్తాలోని 9 జిల్లాలలకు 5 మెడికల్ కాలేజీలు, రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో నాలుగు మెడికల్ కాలేజీలు ఉండగా, హైదరాబాద్ మినహా తెలంగాణలోని 9 జిల్లాలలో రెండే కాలేజీలు ఉన్నాయి. ఇదే విషయాన్ని కొందరు కమిటీ దృష్టికి తెచ్చారు. నర్సింగ్ కాలేజీలు కూడా రాయలసీమలోనే ఎక్కువగా ఉండగా, తెలంగాణలో నిజాం కాలం నాటిది ఒకే ఒక్కటి ఉంది. ఈ విమర్శలో వాస్తవం ఉండటం వల్ల తెలంగాణ ప్రాంతంలో మరికొన్ని మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయటం అవసరమని శ్రీకృష్ణ కమిటీ సూచించింది. ఇక- తెలంగాణలో అడ్మిషన్లు తీసుకుంటున్న వారిలో ఎక్కువ మంది బోగస్ సర్టిఫికెట్లు పొందుతున్నారని, ఇక్కడ ఉన్నత విద్య చదవాలంటే కనీసం నాలుగేళ్ల పాటు ఇక్కడి స్కూళ్లలో చదవాలనే నిబంధనను ఆ విధంగా ఉల్లంఘిస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఏమైనా బోగస్ సర్టిఫికెట్లపై విచారణ జరపాలని శ్రీకృష్ణ కమిటీచెప్పింది.

ఇంగ్లీషు భాషలో విద్యార్థులు బలహీనంగా ఉన్న ప్రాంతాలలో ఆ భాషా బోధనను మెరుగుపరచాలని సిఫారసు చేసింది. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలలో బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారిలో ఎక్కువ మంది తొలితరం విద్యావంతులు. వారంతా బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించి జీవితంలో ముందుకు పోవాలనుకుంటున్నారు. కానీ అందుకు సమైక్యాంధ్రలో అవకాశాలు లభించటంలేదనే భావనతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ముందున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో కూడా వీరే ఎక్కువ. కాబట్టి వారికి తగిన విద్య, శిక్షణలు అందుబాటులో ఉండేట్లు చూస్తే ఆందోళనల పట్ల వారి థృక్పథం పాజిటివ్‌గా మారుతుందని శ్రీకృష్ణ కమిటీ సూచించింది. మానావాభివృద్ధికి విద్య ఎలాగో... ఆరోగ్యం కూడా అంతే. నిజానికి వేర్వేరు పార్టీలు, సంస్థలు, వ్యక్తులతో మాట్లాడినపుడు వైద్య ఆరోగ్య రంగాలు ప్రస్తావనకు రాలేదు. కాని ఈ రంగాలకు ఎంతో ప్రాముఖ్యం ఉందని గుర్తించిన శ్రీకృష్ణ కమిటీయే ఈ దిశగానూ సమాచారం సేకరించింది. 1961 నుంచి 2009 మధ్య ఆయా ప్రాంతాల్లో ప్రతి లక్ష జనాభాకు ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రి, పడకలు, డాక్టర్ల సంఖ్య ఎంతున్నాయని వివరాలు సేకరించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ రంగంపై లెక్కలు చాలానే ఉన్నాయి... కానీ ప్రైవేటు రంగంపై స్వల్ప సమాచారమే దొరికిందని శ్రీకృష్ణ కమిటీ తెలిపింది.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అలోపతిక్ డిస్పెన్సరీలు 1960-61లో 564 ఉండగా, 1990-91 నాటికి 1680కి పెరిగాయి. కానీ 2009 వచ్చే సరికి 289కి తగ్గాయి. ఇందుకు ఒక కారణం డిస్పెన్సరీలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయికి పెంచటమేనని కమిటీ వెల్లడించింది. ప్రాంతాల వారీ వివరాలను గమనిస్తే... హైదరాబాద్‌లో కలిపిన కలపకున్నా కూడా తెలంగాణ పరిస్థితి కోస్తా, రాయలసీమల కన్నా తీసికట్టుగా ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 1998-99లో 1422 కాగా, 2004లో 1581 ఉంది. రెండు, మూడు స్థాయిల్లోని ఆసుపత్రులను ప్రజలు బాగానే వినియోగించుకుంటున్నారనీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్లు సరిగా లేకపోవడం వల్ల వాటి వినియోగం సంతృప్తికరంగా లేదని కమిటీ తెలిపింది. ఒక సర్వే ప్రకారం అక్కడ సుమారు 30 శాతం మంది డాక్టర్లు తరచూ గైర్హాజరు అవుతుంటారు. ప్రతీ లక్ష మంది గ్రామీణులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సంఖ్య 1998-99 లో తెలంగాణలో 2.94 ఉండగా 2009 మార్చిలో 2.53 ఉంది. రాయలసీమలో 3.30 నుంచి 2.69కి, కోస్తాంధ్రలో 2.75 నుంచి 2.51కు తగ్గాయి. మూడు ప్రాంతాలను పోల్చి చూసినపుడు వాటి మధ్య తేడాలు ఎక్కువగా లేవు.

అలోపతిక్ ఆస్పత్రుల సంఖ్య రాష్ట్రంలో 1960-61లో 289 కాగా, 2009 లో 481కి చేరింది. అయితే ఈ కాలంలో జనాభా 36 మిలియన్ల నుంచి 76 మిలియన్లకు పెరగటాన్ని బట్టి చూస్తే ఆస్పత్రుల సంఖ్య ప్రతి లక్ష మందికి 1.10 నుంచి 0.56 కు తగ్గిపోయింది. వైద్యరంగానికి బడ్జెట్ కేటాయింపుల తగ్గుదల ఇందుక్కారణం. ప్రాంతాలవారీగా పరిశీలించినపుడు తెలంగాణను హైదరాబాద్‌తో కలిపినా, కలపకపోయినా రాష్ట్ర సగటు కన్నా ఒక అడుగు ముందే ఉంది. ఇతరత్రా గల తేడాలు క్రమంగా తగ్గుతున్నాయి. హైదరాబాద్‌ను కలిపినట్లయితే తెలంగాణ ఇతర ప్రాంతాల కన్నా ముందుండగా, హైదరాబాద్ కలపకపోతే కోస్తా, సీమలకన్నా బాగా వెనుకబడింది. రాష్ట్రంలో డాక్టర్ల సంఖ్య 1960-61లో 1826 కాగా, 2009 నాటికి 10,117కు పెరిగింది. వారిలో 796 మంది కాంట్రాక్టు వైద్యులు. ప్రతి లక్ష మంది జనాభాకు డాక్టర్ల సంఖ్య కూడా ఈ కాలంలో మెరుగుపడింది. అది 5 నుంచి 12కు చేరింది. ప్రాంతాల మధ్య పోల్చి చూస్తే, హైదరాబాద్‌ను మినహాయించిన తెలంగాణ తక్కిన రెండు ప్రాంతాల కన్నా వెనుకబడి ఉంది. ఈ విషయంలో కోస్తా కన్నా రాయలసీమ ముందుంది. ఏఎన్ఎంల సంఖ్య రాష్ట్రంలో ప్రస్తుతం 27,713 కానీ ప్రాంతాల వారీగా ఎక్కువ తేడాలు లేవు. ఈ సంఖ్య తెలంగాణలో ప్రతి లక్ష జనాభాకు 44.72 కాగా, కోస్తాంధ్రలో 44.82, రాయలసీమలో 44.41.

ఇక- ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సదుపాయాలు ఎక్కువగా హైదరాబాద్‌లో కేంద్రీకృతమై ఉన్నాయి. 2009 లెక్కల ప్రకారం తెలంగాణలో 17,000 ప్రభుత్వ ఆస్పత్రి పడకలలో 6700 హైదరాబాద్‌లోనే ఉన్నాయి. 4000 మంది డాక్టర్లలో 1400 మంది హైదరాబాద్‌లోనే ఉన్నారు. రాష్ట్ర వైద్య రంగంలో ప్రైవేటు పాత్ర 1980 నుంచి గణనీయంగా పెరుగుతున్నది. జనాభా పెరుగుదలకు అనుగుణంగా ప్రభుత్వ వైద్య సౌకర్యాలు పెరగలేదు. రాష్ట్ర బడ్జెట్‌లో ఆరోగ్యానికి కేటాయింపులు వరుసగా తగ్గుతున్నాయి. ఆ మొత్తం 1974-78 అయిదవ పంచవర్ష ప్రణాళికలో 6.5 శాతం కాగా, 2005-06 నాటికి 4.5 శాతానికి పడిపోయింది. ఆస్పత్రులలో కార్పొరేటైజేషన్ ఎక్కువైంది. ఈ ఆస్పత్రుల సంఖ్య 1988 లో ఒకటి కాగా, 2004 నాటికి 16 కు పెరిగింది. ఆస్పత్రి పడకలలో 57 శాతం వాటిలోనే ఉన్నాయి. ఈ ధోరణిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించాయి. ఆరోగ్యశ్రీ వంటి ఆరోగ్య పథకంపై కూడా, అది పైకి చూసేందుకు బాగున్నా, చివరకు ప్రైవట్ ఆస్పత్రులకు లాభం చేసి ప్రభుత్వ రంగాన్ని దెబ్బతీస్తందనే విమర్శలున్నాయి.

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు