శ్రీదుబ్బరాజేశ్వరస్వామి దేవాలయం, పెంబెట్ల

శ్రీదుబ్బరాజేశ్వరస్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, సారంగపూర్ మండలం, పెంబెట్ల గ్రామంలో వెలసిన ఆలయం. దట్టమైన అడవిలోని దుబ్బ అనే ప్రాంతంలో రాజేశ్వరస్వామి స్వయంభూగా వెలిసాడు.[1] ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున ఉత్సవాలు జరుగుతాయి.[2]

శ్రీదుబ్బరాజేశ్వరస్వామి దేవాలయం
శ్రీదుబ్బరాజేశ్వరస్వామి దేవాలయం
శ్రీదుబ్బరాజేశ్వరస్వామి దేవాలయం
భౌగోళికాంశాలు :18°31′N 78°34′E / 18.52°N 78.56°E / 18.52; 78.56
పేరు
ప్రధాన పేరు :శ్రీ దుబ్బరాజేశ్వరస్వామి దేవాలయం
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:ఖమ్మం జిల్లా
ప్రదేశం:పెంబెట్ల, సారంగపూర్ మండలం
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:శివుడు

చరిత్ర

మార్చు

200 ఏళ్ల క్రితం పెంబెట్ల సమీపంలోని అడవిలోవున్న ఒక దుబ్బ ప్రాంతానికి వైశ్యుడు, ఒక పద్మశాలి కట్టెలకోసం వెళ్ళగా, అక్కడ వారికి రాజేశ్వరస్వామి దర్శనమిచ్చాడు. ఈ విషయాన్ని తమ్మల్ల వంశీయుడు సాంబయ్యకు తెలుపగా, ఆయన నిత్య దూప, దీప, నైవేద్యాలు నిర్వహిస్తూ స్వామివారికి పెంకుటింట్లో ఆలయాన్ని కట్టించాడు.

గుడి నిర్మాణం

మార్చు
 
శ్రీదుబ్బరాజేశ్వరస్వామి రథోత్సవం

అటుతరువాత ఆయన కుమార్తెన దుబ్బమ్మ రాజేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ, భక్తుల సహకారంతో 50 సంవత్సరాల క్రితం ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు. 1982, ఫిబ్రవరి 12న దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఈ ఆలయాన్ని తన పరిధిలోకి తీసుకొని ఆలయాన్ని అభివృద్ధి చేసింది. ఈ ఆలయ ప్రాగణంలో రామాలయం, వెంకటేశ్వర ఆలయం, అంజనేయస్వామి ఆలయం, నవగ్రహమంటపము, గండాదీపం, వల్లుబండ వంటి నిర్మాణాలు జరిగాయి.

ఉత్సవాలు

మార్చు

ప్రతి ఏటా ఈ ఆలయంలో మహాశివరాత్రి, శ్రీకృష్ణాష్టమి, దసరా, బతుకమ్మ, వినాయక చవితి, శ్రీరామనవమి, ఆంజనేయస్వామి జయంతి, దీపావళి వంటి పండుగలు నిర్వహిస్తారు.

2019 శివరాత్రి

మార్చు

2019 మహాశివరాత్రి సందర్భంగా మార్చి 4వ తేదీన మహాశివరాత్రి జాగరణ, రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయాన రుద్రాభిషేక నిషిపూజ, 5వ తేదీన పారణ, మధ్యాహ్నం అన్నపూజ, 6వ తేదీన స్వామివారి రథోత్సవం, 11వ తేదీన ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం నిర్వహించబడ్డాయి.

మూలాలు

మార్చు
  1. ఈనాడు, రాజన్న సిరిసిల్ల జిల్లా (4 March 2019). "స్వయం భూ.. దుబ్బ రాజన్న". Archived from the original on 4 March 2019. Retrieved 4 March 2019.
  2. "Vemulawada gears up for Sivaratri". Retrieved 4 March 2019.