శ్రీనివాస్ రామడుగుల
తెలుగు కవి
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
శ్రీనివాస్ రామడుగుల పూర్తిపేరు రామడుగుల వెంకట సత్య సూర్య శ్రీనివాస్. తెలుగు యువకవులలో ఒకరు. ఇతని కలం పేరు "శ్రీ". కవి సంగమంలో కవిత్వం వ్రాస్తుంటారు.
శ్రీనివాస్ రామడుగుల | |
---|---|
జననం | శ్రీనివాస్ 1968 జనవరి 11 రంగాపురం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, |
నివాస ప్రాంతం | భోపాల్ |
వృత్తి | దూరదర్శన్ కేంద్రం లో ఇంజినీర్, రచయిత |
మతం | హిందూ |
భార్య / భర్త | సత్యలక్ష్మి |
పిల్లలు | సింధూజ |
తండ్రి | సూర్య గంగాధరం |
తల్లి | సీతారామం, |
జీవిత విశేషాలు
మార్చురామడుగుల సీతారామం, సూర్య గంగాధరం దంపతులకు 1968 జనవరి 11న తూర్పు గోదావరి జిల్లా రంగాపురం గ్రామంలో జన్మించాడు.
నివాసం - వృత్తి, ఉద్యోగం
మార్చుప్రస్తుతం భోపాల్ లోని దూరదర్శన్ కేంద్రంలో ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు.
వివాహం - పిల్లలు
మార్చుఇతని వివాహం సత్యలక్ష్మితో జరిగింది. ఇతనికి ఒక కుమార్తె (సింధూజ).
ప్రచురించిన పుస్తకాలు
మార్చు- "శ్రీ వాక్యం" (ఏక వాక్య కవితల సహస్రం) 2013 సెప్టెంబరు 1 న విశాఖపట్టణంలో రోజా డాన్స్ అండ్ ఆర్ట్ అకాడమీ వారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది.
- "మనసంతా నువ్వే" (దీర్ఘ కవితల సంపుటి) 2014 జనవరి 11 న హైదరాబాదులో సి నారాయణ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది.
బహుమానాలు, బిరుదులు, గుర్తింపులు
మార్చుబహుమానాలు
- 2013 సెప్టెంబరులో విడుదల చేసిన శ్రీవాక్యానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి అవార్డు 2014 సెప్టెంబరు 1న హైదరాబాద్ లో.
- "ప్రేమను ప్రేమించు ప్రేమకై" గ్రూప్ లో కవితలకి ప్రథమ బహుమతి ఒకసారి, ద్వితీయ బహుమతి మరోసారి.
- తిరుపతి దేవస్థానం వారు నిర్వచించిన పురాణ ప్రబోధ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో వెండిపతకం (1982లో )
బిరుదులు
మార్చు- "ఏకవాక్య కవితా విశారద" విశాఖపట్టణంలో రోజా డాన్స్ అండ్ ఆర్ట్ అకాడమీ వారిచే. 2013 సెప్టెంబరు 1న బహూకరించబడింది.
గుర్తింపులు
మార్చు- తెలుగు వన్.కాంలో ప్రత్యేకమైన రోజులలో కవితలు చాలా ప్రచురించబడ్డాయి.
- సేవ పత్రికలో కొన్ని ప్రచురించబడినవి.
- NATA వారు ఇప్పటివరకు ప్రచురించబడిన రెండు సంచికల లోను కవితలు ప్రచురించబడినవి.
- తెలుగు వెలుగులు పత్రికలో బెంగళూరు తెలుగు పత్రికలో ఆస్ట్రేలియా వారి పత్రికలో కవితలు ప్రచురించబడినవి
- ఏక వాక్య కవితలు 3500 ఇప్పటికి వ్రాయడం జరిగింది.ఇదొక రికార్డు తెలుగు సాహితీ చరిత్రలో.
- దీర్ఘ కవితలు సుమారుగా 250 వరకు రచించాడు
- ద్విపాద కవితామాలికలు సుమారు 1500 దాకా రచించాడు.
మనసంతా నువ్వే, శ్రీ వాక్యం పుస్తకాల ఆవిష్కరణ చిత్రమాలిక
మార్చు-
శ్రీ వాక్యం పుస్తకం ఆవిష్కరిస్తున్న కవులు
-
శ్రీనివాస్ రామడుగులకు సన్మానం
-
మనసంతా నువ్వే పుస్తకం ఆవిష్కరిస్తున్న కవులు
-
సినారే చేతుల మీదుగా జ్ఞాపిక స్వీకరణ