భోపాల్
?భోపాల్ మధ్యప్రదేశ్ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 23°15′N 77°25′E / 23.25°N 77.42°ECoordinates: 23°15′N 77°25′E / 23.25°N 77.42°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
308.14 కి.మీ² (119 sq mi) • 427 మీ (1,401 అడుగులు) |
జిల్లా (లు) | భోపాల్ జిల్లా |
జనాభా • జనసాంద్రత |
14,82,718 (2001 నాటికి) • 160/కి.మీ² (414/చ.మై) |
మేయర్ | సునీల్ సూద్ |
కోడులు • పిన్‌కోడ్ • ప్రాంతీయ ఫోన్ కోడ్ • వాహనం |
• 462001 • +91 (0)755 • MP-04 |
భోపాల్ (ఆంగ్లం: Bhopal, హిందీ: भोपाल, ఉర్దూ: بھوپال) మధ్యభారతదేశములో ఒక నగరం. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని, 'భోపాల్ డివిజన్' కూడానూ. మధ్యప్రదేశ్ లో ఇండోర్ తరువాత రెండవ పెద్ద నగరం.భోపాల్ భారతదేశములో 17 వ అతిపెద్ద నగరం, ప్రపంచంలో అతిపెద్ద నగరాల్లో 131 వది.భోపాల్ లో అనేక జాతీయ విద్యాపరిశోధన సంస్థలు, ఉన్నాయి.వాటీలో IISER, MANIT , AIIMS, NLIU, SPA, IIIT ముఖ్యమైనవి. భోపాల్ కు "సరస్సుల నగరం" "మసీదుల నగరం అని పేరు. దీని భౌగోళికం ప్రకృతి సరస్సులు, మానవ నిర్మిత సరస్సులతో నిండియున్నది.[1]
గ్యాస్ దుర్ఘటనసవరించు
1984 డిసెంబరు రెండోతేదీ: యూనియన్ కార్బైడ్ పరిశ్రమనుంచి టన్నుల కొద్దీ లీకైన మిథైల్ ఐసోసైనేట్ (మిక్) మూడువేల నిండు ప్రాణాల్ని కబళించింది. కంటిచూపు పోయినవారు, వూపిరితిత్తులకు తూట్లు పడ్డవాళ్లు, జీవచ్ఛవాలుగా మిగిలినవాళ్లెందరో లెక్కే లేదు. పాతికవేలమంది నేల రాలిపోయారు. అయిదున్నర లక్షల మందికిపైగా అనారోగ్య పీడితులయ్యారు.నేటికీ అక్కడి గాలిలో, నీటిలో, భూగర్భంలో విషపదార్థ నిక్షేపాలు పుట్టబోయేవారినీ శాపగ్రస్తులు చేస్తున్నాయి.ఆ సంస్థ సారథి ఆండర్సన్ 1984 డిసెంబరులో పట్టుబడినా, భారత్‌కు తిరిగి వస్తానన్న హామీతో బురిడీ కొట్టించి దేశం దాటి మళ్లీ ఇటువైపు తొంగిచూడనే లేదు. ఆండర్సన్‌ను అప్పగించాల్సిందిగా ఆరేళ్లక్రితం భారత్ చేసిన అభ్యర్థనను అమెరికా నిష్కర్షగా తోసిపుచ్చింది. విపరీత కాలహరణం జరిగాక ఒక్కో బాధితుడికీ సగటున విదిపింది రూ.12,410. కేంద్ర న్యాయమంత్రి వీరప్ప మొయిలీ భోపాల్ విషవాయు ఉదంతంలో న్యాయమే సమాధి అయిందన్నారు.
చరిత్రసవరించు
భోపాల్ నగరాన్ని భూపాల్ షాహి సలం అనే గోండు రాజు స్థాపించాడు ఇతని పేరు తోనే ఈ నగరానికి భూపాల్ అనేే పేరు వచ్చింది కాలక్రమంలో బ్రిటిష్ వాళ్ళ ఉచ్ఛారణలో తేడాల వల్ల భూపాల్ నుండి భోపాల్ గా మారింది. 18 వ శతాబ్దం లో ఈ నగరాన్ని పాలించిన గోండు రాణి కమలపతి చివరి గోండు రాణి గా పరిగణిస్తారు
భౌగోళికంసవరించు
భోపాల్ సముద్రమట్టానికి 500 మీటర్ల సరసరి ఎత్తున ఉంది.భోపాల్ మద్యభారతదేశములో వింద్య పర్వతలకు సమీపంలో మాల్వా పీఠభూమి మీద ఊంది. భోపల్ తేమ ఉపఉష్ణమండల వాతావరణం వుండడం వల్ల చలిగా, శీతకాలంలో పొడీగా వేసవికాలంలో వేడీగా వుంటూంది.వేసవికాలం మార్చి నెల చివరి నుండి జూన్ నెల మద్య వరకు వుంటూంది, అధిక ఉష్ణోగ్రతలు మే నెలలో 40 °C లను దాటూతాయీ.మిగతా నెలల్లో ఉష్ణోగ్రత సరసరిగా సుమారు 25 °C (77 °F) వుంటూంది.వర్షాకాలంలో తేమ అధికంగా వుండీ వర్షపాతం సుమారుగా (1020 mm) వుంటూంది.
మూలాలుసవరించు
- ↑ "City of Lakes". Archived from the original on 2006-11-01. Retrieved 2007-04-12.