శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు తెలుగు కథా సాహిత్యంలో ఇతివృత్తము శైలిల వల్ల ప్రత్యేకతను సంతరించుకున్నాయి. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు సమాజంలోని వివిధ దురాచారాలు, ఆనాటి సమాజంలో వస్తున్న మార్పులు, జమీందారీ సంస్కృతి తదితర అంశాలపై వచ్చాయి. ఈ కథలు వివిధ తెలుగు పత్రికల్లో ముద్రణ కావడంతో పాటు చాలా సంకలనాలుగా ప్రచురణకు నోచుకున్నాయి.

రాజమండ్రి పట్టణంలోని శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి విగ్రహం

రచనా నేపథ్యం మార్చు

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి 20వ శతాబ్ది తొలి అర్థభాగంలో గోదావరి మండలంలోని తెలుగువారి జీవన సంస్కృతి ముడిసరుకుగా రాసిన 65కథలు పలు సంకలనాలుగా ప్రచురితమయ్యాయి. ఆంగ్లసాహిత్యం, ఆంగ్లభాషలతో ప్రాథమిక పరిచయం లేకున్నా తన స్వతంత్ర ఆలోచనలతో అత్యాధునికమైన భావజాలాన్ని, అపురూపమైన శైలిని అభివృద్ధి చేసుకోవడం విశేషం.

రెండవ సంపుటం మార్చు

  • ఇల్లుపట్టిన వెధవాడపడుచు[1] (1940)

మూలాలు మార్చు