స్వర్ణ దేవాలయం, శ్రీపురం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఈ దేవాలయములో గర్భగుడికి మూడు వైపులా నీరు , ఒకవైపు ద్వారం వుంటుంది. ఆ నీటిని పవిత్రంగా భావిస్తారు. ప్రతి శుక్రవారం గుడిని అందంగా అలంకరిస్తారు. ఇటీవలే నిర్మించిన స్వర్ణ దేవాలయం. తమిళనాడు రాష్ట్రంలోని వేల్లూర్ కు దగ్గర్లో మలైకుడి అనే ప్రాంతానికి దగ్గర్లో కొండల దిగువున దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. చెన్నై నుంచి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.[1] దీని నిర్మాణానికి నారాయణి అమ్మ అనే స్వామి నేతృత్వం వహించాడు. అతనిని శక్తి సిద్ధ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఆలయం 55,000 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించబడింది. దీని గర్భగుడి సుమారు 1.5 మెట్రిక్ టన్నుల అసలుసిసలైన బంగారంతో చేసిన మందపాటి రేకులతో కప్పబడి ఉండటం చేతనే దీనికి బంగారు గుడి అని పేరు వచ్చింది.[2] ఆలయ ఆవరణం మొత్తం నక్షత్రం ఆకారం గల ప్రాకారంతో ఆవరించబడి ఉంటుంది.
Golden Temple Vellore | |
---|---|
Thirupuram | |
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 12°52′24″N 79°05′18″E / 12.873267°N 79.08842°E |
దేశం | India |
రాష్ట్రం | Tamil Nadu |
స్థలం | Vellore |
ప్రదేశం | Thirumalaikodi, Vellore District |
సంస్కృతి | |
దైవం | Sri Lakshmi Narayani |
చరిత్ర, నిర్వహణ | |
నిర్మించిన తేదీ | 4th August 2007 |
వెబ్‌సైట్ | http://www.sripuram.org |
గుడిలోకి ప్రవేశించే దారి పొడవునా భగవద్గీత, ఖురాన్, బైబిల్, గురుగ్రంథ్ సాహిబ్ నుంచి సేకరించిన శ్లోకాలు పొందుపరచబడి ఉంటాయి. ప్రతి శుక్రవారం ఇక్కడికి వచ్చే భక్తుల దర్శనాన్ని పర్యవేక్షించడానికి సుమారు 700 మంది పోలీసులను ప్రభుత్వం నియమించింది. ఇక్కడ ఆగమ శాస్త్రాల ప్రకారం పూజలు చెయ్యరు. శ్రీ విద్య అనే ప్రాచీనమైన, అరుదైన శక్తి పూజా విధానాన్ని అనుసరిస్తారు.
నారాయణి అమ్మ ఏర్పాటు చేసిన సంస్థకు సుమారు ఆరు దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి. ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధులు దీని ద్వారానే సమకూరాయని అతను తెలియజేశారు. అతను అంతకు మునుపే పేదరిక నిర్మూలనకూ, వికలాంగులకూ సహాయం చేశాడు. మూడు కోట్ల రూపాయలతో చుట్టుపక్కల ఉన్న దాదాపు 600 దేవాలయాలను జీర్ణోద్ధరణ గావించాడు.[2]