గురుగ్రంథ సాహిబ్

గురుగ్రంధ సాహిబ్ (పంజాబీ భాష : ਗੁਰੂ ਗ੍ਰੰਥ ਸਾਹਿਬ ), లేదా ఆది గ్రంధ్, లేదా ఆది శ్రీ గురు గ్రంథ్ సాహిబ్, సిక్కు మతస్తుల పవిత్ర గ్రంథం, ఆఖరి గురువు.[1]

గురుగ్రంథ సాహిబ్ పుస్తక ముఖచిత్రం

గురు గోవింద్ సింగ్ (1666-1708), సిక్కుల గురువు లలో పదవ గురువు, ఆది గ్రంధ్ను తన వారసురాలిగా ప్రకటించాడు, మానవులలో గురువులుగా ప్రకటించే విధానాన్ని స్వస్తిపలికి, గ్రంథమైన "ఆది గ్రంధ్"ను తన తరువాత గురువుగా ప్రకటించాడు.[2] ఈ గ్రంథం పవిత్రగ్రంథంగానే గాక, పది-గురువుల జీవనవిధానంగానూ పరిగణింపబడింది.[3] గురుగ్రంధ సాహిబ్, ప్రార్థనలకొరకు ఒక వనరుగా పరిగణింపబడింది.[4] మరియుసిక్కు మతములో ప్రార్థనాంగము.

గురు అర్జున్ దేవ్ (1563-1606) చే మొదటిసారిగా ఆది గ్రంథం కూర్పు చేయబడింది. ఇందులో మొదటి ఐదు సిక్కు గురువులు, హిందూ ముస్లింల సంప్రదాయాలకు చెందిన అనేక గురువుల గురించి వ్రాయబడింది.[5] గ్రంథాన్ని అసలు రూపం ఇచ్చినవారు భాయ్ గురుదాస్, తరువాత భాయ్ మణిసింగ్. పదవ గురువు పరమదించిన తరువాత, ఆదిగ్రంధ్ చేతివ్రాత ప్రతులను బాబా దీప్ సింగ్ తయారుచేసి పంచిపెట్టాడు. గురుగ్రంధ సాహిబ్ గ్రంథము 1430 పుటలు కలిగిన గ్రంథము. సిఖ్ గురువుల కాలంలో, 1469 నుండి 1708 వరకు గ్రంథరూపం ఇవ్వబడింది.[1] ఈ గ్రంథం స్తోత్రం రూపంలో ఉంది.[5]

గురుగ్రంథ్ సాహిబ్ వాణి

మార్చు

కొన్ని ముఖ్యమైన వాణులు :-

  1. ప్రపంచంలోని మానవులంతా సమానమే
  2. స్త్రీలందరూ సమానమే
  3. అందరికీ ఒకే భగవంతుడు
  4. సత్యమునే పలికి సత్యముగా జీవించు
  5. ఐదు విషయాలపట్ల శ్రద్ధ వహించు
  6. దేవుడి ఆజ్ఞపై జీవించు (ఒకే దేవుడి నిర్ణయం)
  7. మానవత్వం, దయ, జాలి, ప్రేమ లను ఆచరించు
  8. జీవించి యుండగానే పరమాత్మను చేరే మార్గ తత్వము.
  9. గురువు బోధనల ద్వారా దైనందిన జీవితంలోని సమస్యలనుండి బయటపడటం.
  10. ఇందులో కథలు లేవు, జీవనమార్గాన్ని సూచించే సూక్తులు, విశాలతత్వంతో జీవించే మార్గాలూ ఉన్నాయి.

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Keene, Michael (2003). Online Worksheets. Nelson Thornes. p. 38. ISBN 074877159X.
  2. Partridge, Christopher Hugh (2005). Introduction to World Religions. p. 223.
  3. Kashmir, Singh. SRI GURU GRANTH SAHIB - A JURISTIC PERSON. Global Sikh Studies. Retrieved 2008-04-01.[permanent dead link]
  4. Singh, Kushwant (2005). A history of the sikhs. Oxford University Press. ISBN 0195673085.
  5. 5.0 5.1 Penney, Sue. Sikhism. Heinemann. p. 14. ISBN 0435304704.

బయటి లింకులు

మార్చు
 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

గ్రంధాలు

మార్చు

ఇతరములుr

మార్చు