భమిడిపాటి శ్రీలలిత ( 2001 సెప్టెంబరు 5) భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఒక తెలుగు కర్ణాటక సంగీత గాయని. ఈమె నాలుగు సంవత్సరాల వయస్సు నుంచే సంగీతాన్ని అభ్యసించడం ప్రారంభించింది. 6 సంవత్సరాల వయస్సులోనే శ్రీలలిత తన గాన ప్రదర్శనను ప్రారంభించింది. ఈమె సరేగమప లిటిల్ చాంప్స్‌లో పాల్గొంది. తర్వాత పాడుతా తీయగా సీజన్ 6 రన్నర్ అప్ గా నిలిచింది, సూపర్ సింగర్స్ సీజన్ 9, బోల్ బేబీ బోల్, స్వరాభిషేకం మొదలైన వివిధ టెలివిజన్ షోలలో పాల్గొంది.

బాల్యం, విద్య మార్చు

శ్రీలలిత తండ్రి భమిడిపాటి రాజశేఖర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నారు. తన తండ్రి ఉద్యోగం కారణంగా, శ్రీ లలిత తన పాఠశాల విద్యను తణుకు (ప్రీ-స్కూల్), చెన్నై (1వ, 2వ తరగతి), విజయవాడలో 10వ తరగతి వరకు చదివింది.

ఇవి కూడా చూడండి మార్చు

బయటి లింకులు మార్చు

యూట్యూబ్ లింకులు మార్చు

మూలాలు మార్చు