శ్రీవారి ప్రియురాలు

శ్రీవారి ప్రియురాలు 1994 సెప్టెంబరు 15న విడుదలైన తెలుగు సినిమా. సుజాత ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద ఎల్.వి.రామరాజు నిర్మించిన ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించాడు. వినోద్ కుమార్, ఆమని లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్-కోటి సంగీతాన్నందించారు.[1]

శ్రీవారి ప్రియురాలు
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం ముత్యాల సుబ్బయ్య
తారాగణం వినోద్ కుమార్,
ఆమని
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ సుజాత ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

ఒక పట్టణ వైద్యుడు ఒక గిరిజన గ్రామాన్ని సందర్శించినప్పుడు అక్కడ ఒక అమ్మాయి మనోహరమైన అమాయకత్వాన్ని చూసి ముగ్ధుడై ఆమెను వివాహం చేసుకుంటాడు. అతని నుండి విడిపోయిన ప్రేయసి అమెరికా నుండి తిరిగి వచ్చినప్పుడు ఇబ్బందులు తలెత్తాయి. అమాయకమైన భార్య బలవంతంగా విడాకులు ఇవ్వవలసి వచ్చినప్పుడు, న్యాయవాది అత్తగారు ఆమెను రక్షించడానికి ప్రయత్నిస్తుంది.[2]

తారాగణం

మార్చు
  • వినోద్ కుమార్,
  • ఆమని,
  • ప్రియా రామన్,
  • కైకాల సత్యనారాయణ,
  • శారద,
  • పి.ఎల్. నారాయణ,
  • బ్రహ్మానందం కన్నెగంటి

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
  • స్టూడియో: సుజాత ఆర్ట్ ప్రొడక్షన్స్
  • నిర్మాత: ఎల్.వి. రామరాజు;
  • కంపోజర్: రాజ్-కోటి
  • సమర్పణ: లక్కం రాజు రామచంద్రరాజు

మూలాలు

మార్చు
  1. "Srivari Priyuralu (1994)". Indiancine.ma. Retrieved 2023-02-18.
  2. Srivari Priyuralu (1994) - Plot - IMDb (in అమెరికన్ ఇంగ్లీష్), retrieved 2023-02-18

బాహ్య లంకెలు

మార్చు