వినోద్ కుమార్

సినీ నటుడు

వినోద్ కుమార్ ఒక ప్రముఖ సినీ నటుడు. 110 తెలుగు సినిమాలలో నటించాడు. ఇంకా తమిళంలో రెండు, కన్నడంలో 30, ఒక మలయాళ సినిమాలో నటించాడు. అతని మొదటి చిత్రం 1985లో విడుదలైన కన్నడ చిత్రం తవరు మనే. తెలుగులో మొట్టమొదటి చిత్రం రామోజీ రావు నిర్మించగా 1989 లో విడుదలైన మౌన పోరాటం. మామగారు, కర్తవ్యం, భారత్ బంద్ లాంటి సినిమాలు అతనికి కథానాయకుడిగా మంచి పేరు తెచ్చిన చిత్రాలు. 1991 లో మామగారు సినిమాకు గాను ఉత్తమ సహాయనటుడిగా నంది అవార్డు వచ్చింది.

వినోద్ కుమార్
జననం
వినోద్ ఆళ్వా

ఏప్రిల్ 1, 1963
మంగుళూరు, కర్ణాటక
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1985-ప్రస్తుతం

జీవిత విశేషాలు

మార్చు

వినోద్ కుమార్ స్వస్థలం కర్ణాటకలోని మంగుళూరు. మొదట్లో ఉద్యోగం కోసం ముంబై వెళ్ళాడు. కొద్ది రోజులు మెడికల్ రెప్రెజెంటేటివ్ గా పనిచేశాడు. తర్వాత ఓ హోటల్ లో పని చేశాడు. అక్కడికి వచ్చిన కన్నడ సినీ నిర్మాత అబ్బాయి నాయుడు ఇతనిని సినిమాల్లో నటించమని బెంగుళూరు రమ్మన్నాడు. వినోద్ కుమార్ అసలు పేరు వినోద్ కుమార్ ఆల్వా. కన్నడంలో ఈయనను వినోద్ ఆల్వా అని పిలిచేవారు. మౌనపోరాటం చిత్ర నిర్మాత అట్లూరి రామారావు ఆయన పేరులోని ఆల్వా తీసేసి వినోద్ కుమార్ గా మార్చారు.[1]

వినోద్ కుమార్ కు ఇద్దరు అబ్బాయిలు. పెద్ద కుమారుడు అనోజ్ అల్వా. సినిమాల్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. రెండో కుమారుడు న్యాయశాస్త్రం చదువుతున్నాడు.

సినిమాలు

మార్చు

వినోద్ కుమార్ మొదటి సినిమా తవురు మనే అనే కన్నడ సినిమా. తెలుగులో అతని మొదటి చిత్రం మౌన పోరాటం (1989). ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

వెబ్ సిరీస్

మార్చు

మూలాలు

మార్చు
  1. "vinod kumar: నన్ను చూసి నిజమైన పోలీసు అనుకుని వదిలేసి వెళ్లిపోయారు". EENADU. Retrieved 2022-03-02.