శాంతకుమరన్ శ్రీశాంత్ ఒక కళంకిత భారతీయ క్రికెట్ ఆటగాడు. మ్యాచ్ ఫిక్సింగుకు పాల్పడి జీవితకాల నిషేధానికి గురయ్యాడు.

శాంతకుమరన్ శ్రీశాంత్
2012 లో ఒక కార్యక్రమంలో శ్రీశాంత్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
శాంతకుమరన్ శ్రీశాంత్
పుట్టిన తేదీ (1983-02-06) 1983 ఫిబ్రవరి 6 (వయసు 41)
కొత్తమంగళం,
కేరళ,
భారతదేశం
మారుపేరుశ్రీ, గోపు
ఎత్తు5 అ. 11 అం. (1.80 మీ.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్-మీడియం
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 253)2006 మార్చి 1 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు2011 ఆగస్టు 18 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 162)2005 అక్టోబరు 25 - శ్రీలంక తో
చివరి వన్‌డే2011 ఏప్రిల్ 2 - శ్రీలంక తో
తొలి T20I (క్యాప్ 10)2006 డిసెంబరు 1 - దక్షిణాఫ్రికా తో
చివరి T20I2008 ఫిబ్రవరి 1 - england తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2002–2013కేరళ
2008–2010కింగ్స్ XI పంజాబ్
2009వార్విక్‌షైర్
2011కొచ్చి టస్కర్స్ కేరళ
Banned for life in 2013[1]రాజస్థాన్ రాయల్స్
కెరీర్ గణాంకాలు
పోటీ Tests ODI FC List A
మ్యాచ్‌లు 27 53 72 82
చేసిన పరుగులు 284 44 642 127
బ్యాటింగు సగటు 10.40 4.00 9.44 6.04
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 35 10* 35 33
వేసిన బంతులు 5,419 2,476 12,895 3,874
వికెట్లు 87 75 210 104
బౌలింగు సగటు 37.59 33.44 35.55 35.48
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 3 1 6 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 5/40 6/55 5/40 6/55
క్యాచ్‌లు/స్టంపింగులు 5/– 7/– 16/– 9/–
మూలం: Cricinfo, 2013 జనవరి 4

నేపధ్యము

మార్చు

జట్టులో ఒకప్పుడు కీలక బౌలర్‌గా ఎదిగిన కేరళ స్పీడ్‌స్టర్ శ్రీశాంత్‌కు ఆది నుంచీ దూకుడెక్కువే. తన ప్రవర్తనతో ఎన్నోసార్లు మందలింపునకు గురయ్యాడు. మైదానంలో ఏమాత్రం ఆవేశం ఆపుకోలేని తత్వంతో వివాదాస్పదంగా మారాడు. కేరళ తరఫున రంజీల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి ఆటగాడిగా గుర్తింపు పొందిన శ్రీ అనవసరంగా ఉద్రేకపడే స్వభావంతో కెరీర్‌ను ఇబ్బందుల్లో పడేసుకున్నాడు.

2005లో చాలెంజర్స్ ట్రోఫీలో బాగా ఆడటంతో తొలిసారిగా జాతీయ జట్టుకు ఎంపికై ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి జట్టుకు ధారాళంగా పరుగులు ఇచ్చినా వికెట్లు తీయగలడని పేరు తెచ్చుకున్నాడు. ఐపీఎల్ తొలి సీజన్‌లో పంజాబ్‌కు ఆడిన సమయంలో ముంబై ఆటగాడు హర్భజన్ సింగ్‌తో చెంప దెబ్బ తిని వార్తల్లోకెక్కాడు. ఆ తర్వాత కెప్టెన్ ధోని, భజ్జీతో పొసకగపోవడం ఇతడిని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. స్పాట్ ఫిక్సింగ్‌లో శ్రీశాంత్ పాత్ర ఉన్నట్టు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. 2013 సెప్టెంబరు 13, శుక్రవారం బీసీసీఐ ఈ 30 ఏళ్ల ఆటగాడిపై జీవిత కాలం వేటు వేయడంతో కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పడింది.[2]

వివాహము

మార్చు

ఇతని వివాహమురాజస్థాన్ రాజవంశానికి చెందిన జ్యువెలరీ డిజైనర్ భువనేశ్వరి కుమారితో గురువాయూరు లోని శ్రీ కృష్ణ ఆలయంలో 2013 డిసెంబరు 12 తేదిన జరిగింది. ఇరు కుటుంబాలకు చెందినవారితో పాటు అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో గురువాయూర్ లోని శ్రీ కృష్ణ ఆలయంలో వీరిద్దరు కేరళ హిందు సంప్రదాయం ప్రకారం ఒకటయ్యారు. గత కొద్ది సంవత్సరాలుగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతోందని.. ఐపీఎల్ ఆరవ ఎడిషన్ లో స్పాట్ ఫిక్సింగ్ పాల్పడి.. జైలుకెళ్లిన సమయంలో కూడా శ్రీశాంత్ కు నయన్ బాసటగా నిలిచింది.[3]

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. "Who is Jiju Janardhanan?". ఇండియా Today Online. ఇండియా Today. Retrieved మే 17 2013. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  2. http://timesofindia.indiatimes.com/sports/cricket/fixing-hits-ipl/news/Sreesanth-The-showman-who-couldnt-handle-the-spotlight/articleshow/22561026.cms
  3. "Sreesanth marries Jaipur princess Bhuveneshwari Kumari". ZeeNews. 2013-12-12. Archived from the original on 2013-12-13. Retrieved 2013-12-12.

యితర లింకులు

మార్చు