శ్రీ కాకాని మల్లీశ్వర మాహాత్యము


కాకాని గ్రామంలోని మల్లీశ్వర దేవాలయం చాలా పురాతనమైనదని ప్రసిద్ధి. శ్రీ కృష్ణదేవరాయలి మంత్రులలో ఒకరైన చిట్టరుసు జీర్ణావస్థలో ఉన్న ఈ దేవాలయాన్ని పునరుద్ధరణ చేసినట్లు చరిత్రకారులు అంటున్నారు. శ్రీశైలంలోని మల్లికార్జునుడు భక్తజన రక్షణార్థం లోకసంచారం చేస్తూ తన ప్రతిరూపాలను విజయవాడ, గుంటూరు, కాకాని మొదలైన చోట్ల ఏర్పరిచినట్లు స్థలజ్ఞులు చెబుతారు. ఈ క్షేత్ర మహత్మ్యాన్ని వివరిస్తూ తాడేపల్లి వేంకటప్పయ్య శాస్త్రి ఈ ప్రబంధకావ్య్తాన్ని 1922లో వ్రాసి ప్రచురించాడు. తిరిగి 1986లో తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి రామకథామృత గ్రంథమాల తరఫున పునర్ముద్రించాడు. ఐదు ఆశ్వాసాలు ఉన్న ఈ గ్రంథంలో భక్తజనుల కోరికలను సఫలం చేసే మల్లీశ్వరస్వామి మహాత్మ్యం వివరించబడింది[1].

శ్రీ కాకాని మల్లీశ్వర మాహాత్మ్యము
కృతికర్త: తాడేపల్లి వేంకటప్పయ్య శాస్త్రి
ముద్రణల సంఖ్య: 2
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: ప్రబంధం
విభాగం (కళా ప్రక్రియ): సాహిత్యం
ప్రచురణ: రామకథామృత గ్రంథమాల
చందోలు
విడుదల: 1986
పేజీలు: 180+6

ఉదాహరణకు ఒక పద్యం:

పరమకృపాళుఁ డీశ్వరుఁడు పాలన సేయు దయార్ద్ర చిత్తుఁడై
స్మరహరుఁ డాశ్రితాళులకు సంయమముం బొనరించు, మృత్యు గ
హ్వరముఁ దెరిల్పఁ జాలుయమ శాసనుఁ డూర్జిన సౌఖ్యదాయి, శం
కరుఁడు శుభప్రదుండలు జగమ్ములకున్ శివుఁడెల్ల భంగులన్

మూలాలు మార్చు

  1. ఆంగీరస (1 April 1986). "గ్రంథ విమర్శలు - శ్రీ కాకాని మల్లీశ్వర మాహాత్యము". భారతి. 63 (4): 79. Retrieved 24 February 2017.[permanent dead link]