శ్రీ కృష్ణ లీలలు (1958 సినిమా)

శ్రీ కృష్ణ లీలలు నవంబర్ 28, 1958 న విడుదలైన తెలుగు సినిమా. గీతా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంటిపూడి వెంకటరత్నం, సూరపనేని సత్యనారాయణ, కాట్రగడ్డ లక్ష్మీ నరసింహారావులు నిర్మించిన ఈ సినిమాకు కుందన్ కుమార్ దర్శకత్వం వహించాడు. లిని జయవంత్, రాజ్‌కుమార్ ప్రధాన తారాగనంగా నటించిన ఈ సినిమాకు ఎస్.ఎల్.మర్చంట్, ఎం.ఎస్.శ్రీరాం లు సంగీతాన్నందించారు.[1]

తారాగణం

మార్చు
  • నళినీ జయవంత్,
  • రాజ్‌కుమార్ (హిందీ నటుడు),
  • ప్రేమ్ అడిబ్,
  • ఎస్.ఎన్. త్రిపాఠి,
  • లలిత పవార్,
  • మిశ్రా,
  • కులదీప్ కౌర్,
  • సులోచన చటర్జీ,
  • ఉమాకాంత్

సాంకేతిక వర్గం

మార్చు
  • స్టూడియో: గీతా ప్రొడక్షన్స్
  • నిర్మాత: కాంతిపుడి వెంకట్రత్నం, సూరపనేని సత్యనారాయణ, కాట్రగడ్డ లక్ష్మి నరసింహారావు;
  • ఛాయాగ్రాహకుడు: పి.ఆర్.రామరావు;
  • ఎడిటర్: ఎం. సుందరం;
  • స్వరకర్త: ఎస్.ఎల్.మర్చంట్, M.S. శ్రీరామ్;
  • గేయ రచయిత: అనిసెట్టి సుబ్బారావు, బైరాగి, వీటూరి

పాటల జాబితా

మార్చు
  • ఏడబాసి పోయే జీవనజ్యోతి , ఘంటసాల , రచన: అనిశెట్టి సుబ్బారావు
  • ఓ మురళీ ధారీ ఓ మురళీదారీ శోకమ్మే నాగతి ఈవేళ, పులపాక సుశీల, రచన.అనిశెట్టి సుబ్బారావు
  • ఆహా వ్రేపల్లె వాడలా ముదితల్ కూడగా ఆడే చిన్నికృష్ణయ్యా, రచన: బైరాగి
  • తీయని మోహములూరించే నీ మురళీ మ్రోగనీ హాయి నామనసు, రచన: అనిశెట్టి సుబ్బారావు
  • కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో(పద్యం)
  • పరిత్ర్రానాయ సాధునామ్ వినాశాయ దుస్కృతామ్, ఘంటసాల వెంకటేశ్వరరావు(భగవద్గీత నుండి)
  • భగవంతా విను కష్టమయం భారతగాధ విను భారతగాథ,
  • మురళీధరా కృష్ణయ్యా నిన్నే నమ్ముకొంటినయ్యా కరుణించి రావదేల,రచన: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి
  • యశోదా నీ కృష్ణయ్య ఎంతచక్కనాడే ఓయమ్మ ఎంత వన్నేకాడే, రచన: భైరాగి
  • యదా యదాహిధర్మస్య గ్లానిర్భవతి భారతి(భగవద్గీత నుండి).

మూలాలు

మార్చు
  1. "Sri Krishna Leelalu (1958)". Indiancine.ma. Retrieved 2021-05-21.

2.ghantasala galaamrutamu, kolluri bhaskararao blog.