పి. బి. శ్రీనివాస్

(పి.బి. శ్రీనివాస్ నుండి దారిమార్పు చెందింది)

పి. బి. శ్రీనివాస్ (సెప్టెంబరు 22, 1930 - ఏప్రిల్ 14, 2013) (పూర్తి పేరు ప్రతివాది భయంకర శ్రీనివాస్)[1] చలనచిత్ర నేపథ్యగాయకుడు. ఆయన తన మాతృభాష అయిన తెలుగులో కంటే కన్నడ, తమిళ చిత్రాలలో ఎక్కువ పాటలు పాడారు. ఆయన హిందీ, మలయాళం చిత్రాలలో కూడా పాటలు పాడారు. కన్నడ నటదిగ్గజం రాజ్‌కుమార్‌కు శ్రీనివాస్ ఎన్నో గీతాలు ఆలపించారు. శ్రీనివాస్ తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ, ఉర్దూ, ఆంగ్ల, సంస్కృత భాషలలో దిట్ట. శ్రీనివాస్ ఎన్నో గజళ్లు వ్రాసారు. శ్రీనివాస్ గళం సువర్ణ గళంగా గుర్తింపు పొందింది. శ్రీనివాస్ మొట్టమొదటిసారిగా జాతక ఫలం (1954) చిత్రంలో పాడారు. ఆయన సుమారు 3000 లకు పైగా పాటలు పాడారు.[2]

పి. బి. శ్రీనివాస్
పి. బి. శ్రీనివాస్
జననంసెప్టెంబరు 22, 1930
గొల్లప్రోలు, కాకినాడ,
మద్రాసు రాష్ట్రం
మరణంఏప్రిల్ 14, 2013
చెన్నై . తమిళనాడు
నివాస ప్రాంతంచెన్నై,
తమిళనాడు
ఇతర పేర్లుపి.బి.ఎస్.
వృత్తినేపథ్యగాయకుడు
మతంహిందూ మతం
తండ్రిఫణీంద్రస్వామి
తల్లిశేషగిరమ్మ

జీవితం

మార్చు

ఆయన ఆంధ్రపదేశ్ లో తూర్పు గోదావరి జిల్లా లోని కాకినాడ పట్టణమునందు ఫణీంద్ర స్వామి, శేషగిరమ్మ దంపతులకు సెప్టెంబర్ 22, 1930న జన్మించాడు.[1] ఆయన కళాశాల చదివి బి.కాం. డిగ్రీని సంపాదించాడు. ఆయన పూర్వీకులు పసలపూడి గ్రామానికి చెందినవారు.

ఆయన ఎనిమిది భాషలలో అనర్గళంగా మాట్లాడగలడు. అవి తెలుగు, కన్నడం, తమిళం, మళయాళం, హిందీ, ఉర్దూ, ఆంగ్లం.[3] ఆయన దేశంలోని ప్రధానమైన భాషలలో ఎన్నో పాటలు పాడినప్పటికీ ఎక్కువ పాటలను కన్నడ భాషలోనే పాడాడు. తెలుగు చిత్రాల్లో ఎన్నో ప్రజాదరణ పొందిన పాటలను తన మధుర గాత్రంతో ఆలపించాడు. శాంతినివాసం (1960) చిత్రంలో మహానటుడు నాగయ్య గారికి "శ్రీ రఘురాం జయ రఘురాం " అనే పాటను పాడటం విశేషం.

తండ్రి సంస్కృత పండితులు కావటం వల్ల సంస్కృతం శ్రీనివాస్‌కి చిన్ననాడే అబ్బింది. ఫణీంద్రస్వామి కంటే తల్లి శేషగిరమ్మ దగ్గర చనువెక్కువ. తండ్రి క్రమశిక్షణకు పెట్టింది పేరు. తల్లి సంస్కృత విదుషీతల్లజ. కిడాంబి వారింటి ఆడపడుచు. ఆమెది కోయిల గొంతు. సంగీతకోవిద. గురువుల నుంచి శ్రీనివాస్ నేర్చుకొన్నదేమన్నా ఉంటే అది తల్లి నుంచే. ఆమే అతనుకు ఆదిగురువు, తుది గురువు.

కళారంగం

మార్చు

తమిళనాడు ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి కరుణానిధి గారి నుంచి కలైమామణి పురస్కారాన్ని అందుకొన్నారు. ఇంకా కర్ణాటక ప్రభుత్వ పురస్కారాన్ని, శ్రీ రాఘవేంద్ర మఠం వారి ప్రతిష్ఠాత్మకమైన సంగీత కళానిధి పురస్కారాన్ని అందుకొని ఆస్థాన విద్వాంసులుగా నియమితులయ్యారు. కంచి జగద్గురుపీఠం నుంచి శ్రీ జయేంద్రసరస్వతుల నుంచి సంగీతరత్న, సంగీత నాథమణి బిరుదాలను స్వీకరించారు. ఆరిజోనా విశ్వవిద్యాలయం నుంచి సంగీత సాహిత్యాలకు అందించిన సేవలకు గాను డాక్టరేట్ గౌరవాన్ని కూడా అందుకొన్నారు.[4]

శ్రీనివాస్ 1952లో జెమిని వారి హిందీ చిత్రం "మిస్టర్ సంపత్"తో తన చలనచిత్ర జీవితం ప్రారంభించారు. అందులో ఆయన పాడిన పాట "ఆజి హం భారత్ కీ నారి" ఒక యుగళ గీతం. దీనిని "గీతా దత్త్ "తో కలిసి పాడి ప్రాముఖ్యత పొందారు. 1955 లో మళయాళ చిత్రం "హరిశ్చంద్ర"[5] లో పాడారు. ఆయన మొదటి సోలో సాంగ్ "ప్రేమ పాశం" చిత్రంలో పి.సుశీలతో పాడారు. ఇది ఎంతో విశేషతను సంతరించుకుంది. తర్వాత కన్నడ కంఠీరవ రాజ్ కుమార్కు చాలా కాలంపాటు పాటలు పాడారు. ఇవి విమర్శకులచే, అభిమానులచే, పరిశ్రమలచే కొనియాడబడ్డాయి. తమిళ పరిశ్రమలో జెమిని గణేశన్కు అనేక పాటలు పాడారు. ఆయనపాటలలో పేరొందిన పాట "నిలవే ఎన్నిదం నెరుంగతె". ఆయన ఇతర నటులకు కూడా అనేక సందర్భాలలో పాటలు పాడారు. ముఖ్యంగా కొన్ని పాటలను ఎం.జి.రామచంద్రన్, శివాజీ గణేశన్ లకు పాడారు. 1964 లో మై భీ లడకీ హూ అనే హిందీ చిత్రంలో లతా మంగేష్కర్తో కలిసి పాడిన పాట "చందా సె హోగా వో ప్యారా" ఎంతో విశేషతను పొందింది. ఆయన కంఠం తమిళంలో అనేక మంది నటులకు ఉపయోగపడింది. వారు జెమినీ గణేశన్, ముత్తురామన్, రవిచంద్రన్, జైశంకర్.

"పావా మనిప్పు" అనే చిత్రంలో కన్నదాసన్ వ్రాసిన "కలగాలి ఆవల్ వసంతమ్" అనే పాటను ఎం.ఎస్.విశ్వనాథన్, టి.కె.రామమూర్తి గారి సంగీత సారథ్యంలో పాడారు. అంజలీ పిక్చర్స్ వారి ఆడుతా వీట్టుప్పెన్ అనే చిత్రంలో కొన్ని పాటలు పాడారు. శ్రీనివాస్ గాయనీమణులైన పి.సుశీల, ఎస్.జానకి, పి.భానుమతి, కె.జమునా రాణి, ఎల్.ఆర్.ఈశ్వరి, లతా మంగేష్కర్ ల సరసన పాడారు.

ఆయన ఆధ్యాత్మిక పాటలను కూడా పాడారు. అవి "శారదా భుజంగ స్తోత్రం", "శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్", "ముకుంద మాల", "శ్రీ మల్లికార్జునస్తోత్రం", పురందరదాసు సంకీర్తనలు.

చైన్నై లోని ఆయన ఉంటున్న వుడ్‌లాండ్స్ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ లో ఏ సమయములో అతనును సందర్శించినా ప్రశాంతంగా కవితలు వ్రాసుకుంటుండేవారు.[6]

పి. బి. శ్రీనివాస్ ఏప్రిల్ 14, 2013లో తన 82వయేట చెన్నై లోని ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు.

వివిధ చిత్రాలలో పాడిన పాటలు

మార్చు
సంవత్సరం చిత్రం భాష పాట
1952 మిష్టర్ సంపత్ హింది Aji hum Bharat ki naari (with Geeta Dutt)
1955 హరిశ్చంద్ర మళయాళం
1955 రాణీ రత్నప్రభ తెలుగు
1956 భలే రాముడు తెలుగు
1958 శ్రీ రామభక్త హనుమాన్ తెలుగు లేవయ్యా లేవయ్యా లేరయ్య నీసాటి వీరాంజనేయా
1959 జయభేరి తెలుగు
1960 భక్త కనకదాస కన్నడం Baagilanu Theredu
Eethaneega Vasudevano
Badukideno
Kula Kula
Singara Sheela
1960 భక్త శబరి తెలుగు
1960 ఋణానుబంధం తెలుగు
1960 సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి తెలుగు
1960 శాంతినివాసం తెలుగు
1961 విజయనగరద వీరపుత్ర కన్నడం Apaara Keerthi
1961 ఇద్దరు మిత్రులు తెలుగు
1961 ఇంటికి దీపం ఇల్లాలే తెలుగు
1961 పాశమలర్ తమిళం Yaar Yaar Avar Yaaro
1961 పావ మన్నిప్పు తమిళం Kalangalil Aval
1961 తిరుడతే
1961 శ్రీ సీతారామ కల్యాణం తెలుగు
1962 ఆత్మ బంధువు తమిళం
1962 స్వర్ణ గౌరి కన్నడం Baara Chandrama
Nudi Mana
Baare Nee Cheluve
Beeso Gaali
1962 భీష్మ తెలుగు మనసులోని కోరిక తెలుసు నీకు ప్రేమికా
1962 దక్ష యజ్ఞం తెలుగు
1962 కులగోత్రాలు తెలుగు Rave Rave Bala Hello My Dear Leela
1962 రక్త సంబంధం తెలుగు
1962 వీర తిరుమగన్ తమిళం Paadatha Paatellam
Roja Malarae
1963 చదువుకున్న అమ్మాయిలు తెలుగు
1963 లవ కుశ తలుగు
1963 పార్ మగలె పార్ తమిళం Aval Paranthu Ponale
Madhurai Nagaril
Madura Nagaril
1964 మై భీ లడకీ హూన్ హిందీ Chanda Se Hoga Wo Pyaara (with Lata Mangeshkar)
1964 పతివ్రత తెలుగు చిన్నారి వన్నెలాడీ నీతో స్నేహం కోరి వుంటినమ్మా
సా సా సా సా పాడమ్మా .. మోహన మూర్తివి నీవో
1964 బొబ్బిలి యుద్ధం తెలుగు
1964 డా. చక్రవర్తి తెలుగు
1964 సర్వర్ సుందరం తమిళం Poga Poga Theriyum
1964 కాదలిక్క నేరమిల్లై తమిళం Anubavam Puthumai
Viswanathan Velai Vendum
Unga Ponnana Kaigal
1965 గుడి గంటలు తెలుగు నీలి కన్నుల నీడల లోన
1965 ప్రేమించి చూడు తెలుగు Meda Meeda Meda Katti Kotlu Koodabettinatti Kamandu
Mee Andala Chetulu Kandenu Papam
1965 శ్రీ సింహాచల క్షేత్ర మహిమ తెలుగు Jayahe Mohana Roopa Gaana Kalaapa
1965 తేనె మనసులు తెలుగు
1966 మంత్రాలయ మహాత్మె కన్నడం Indu Enage Govinda
Kaliyirondu Paatavannu
Tunge Theera
Rasika Saalade
Neenu Baralilla
1966 కప్పు బిలుపు కన్నడం Ide Roopa
Indina Hindu Deshada
1966 ఎమ్మె తమ్మన్న కన్నడం Belli Hakki Aguva
Kanneradu Kareyuthide
Kolalanoodi Kuniva
Neenaarigaadeyo Ele Maanava [7]
1966 శ్రీకృష్ణ పాండవీయం తెలుగు ఏమిటయా నీ లీలా కృష్ణా
1966 లేత మనసులు తెలుగు
1967 బంగారద హూవు కన్నడం Aaha Mogavu
Do Do Do Basavanna
Oduva Nadi
1967 లగ్న పత్రికె కన్నడం Bramhachaari
Gandu Muthina Chandu
Illi Yaaru Illa
Kanneradu
Nijavo Sullo
1967 బెల్లి మొద [8] కన్నడం Belli Modada
Ideega Nee
Ide Nanna Uthara
Odeyithu
1967 సాక్షి తెలుగు
1967 ఊటీ వరై ఉరవు తమిళం
1968 బేడి బండవలు కన్నడం Neera Mele Aleya Ungura
1969 మేయర్ ముత్తన్న కన్నడం Ayyayyayyo Halli Mukha
Haavige
Halliyadarenu Shiva
Onde Naadu
1969 సప్తస్వరాలు తెలుగు
1970 అరిశిన కుంకుమ కన్నడం Honnaase Ullavage
Thaavare Hoo Kere
Ilidu Baa Thaaye
1971 శర పంజర కన్నడం Kodagina Kaveri
Uthara Drivadhim
1971 జై జవాన్ జై కిసాన్ హిందీ Nakhrewali Chaal
1971 కస్తూరి నివాస కన్నడం Aadisi Nodu Beelisi Nodu
1971 సీత కన్నడం Ee Cheluvanu
Barede Neenu Ninna Hesara
1971 సంపూర్ణ రామాయణం తెలుగు వెడలెను కోదండపాణి
1971 పరోపకారి కన్నడం Hodare Hogu
Guttonda Heluve
Kaviya Madhura
1971 సాక్షాత్కార కన్నడం Janma Janmada Anubandha
Olave Jeevana
1971 చెల్లెలి కాపురం తెలుగు
1972 సిపాయి రాము కన్నడం Kathe Mugiyithe
Nidireyu Sadaa
1972 నాగర హావు కన్నడం Kannada Naadina Veera
Baare Baare
Sangama Sangama
Kathe Heluve
1972 బంగారద మనుష్య కన్నడం Nagu Nagutha
Aagadu Endu
Aaha Mysooru Mallige
Baala Bangara
Hani Hani Goodidare
1973 దూరద బెత్త కన్నడం Preethine Aa Dyaavru Thanda
Kaamanna Kathige
1973 సంగమ కన్నడ Sirivanthanaadaru
1973 గంధద గుడి కన్నడం Ellu hogalla
Naavaaduva nudiye kannada
1974 భూతయ్యన మగ అయ్యు కన్నడం Malenaada Henna
Maariya Gathiyendu
1974 భక్త కుంబర కన్నడం Naanu Neenu
Hari Naamave
Manava
Lakshmi Sthothram
Vitala Panduranga
Kande Hariya Kande
1974 ఎరదు కనసు కన్నడం Baadi Hoda
Endendu Ninnanu Marethu
Endu Ninna Noduve
1974 జై జై రాం హిందీ లవ్ కుశ్
1975 శుభ మంగళ కన్నడం Shubha Mangala
Hema... Naakondla Naaku
1975 భక్తి మే భగవాన్ హిందీ Dekha Hari Dekha
1976 ప్రేమద కణికె కన్నడం Chinna Endu Naguthiru
Putta Putta Hejje
1976 జీవనజ్యోతి తెలుగు
1976 సీతాకల్యాణం తెలుగు
1977 సొసెతండ సౌభాగ్యా కన్నడం Ravi Varmana
Saaku Ennuvane
Eke Avasaravu
1977 బభృవాహన కన్నడం Ninna Kanna Notadalli
Yaaru Thiliyaru
1977 తబ్బలి నీనదె మగనె కన్నడం Dharani Mandala Madhyadolage
1977 దేవర దుడ్డు కన్నడం Godhuli
Krishna..Gaaliya Patadanthe
1978 స్వర్ణ భూమి కన్నడం Kaanada Devaru
Siri Kannada Naadu
1978 పద్వారల్లి పందవరు కన్నడం Haadomme Haadabeku
Thookadisi Thookadisi Beeladiru Thamma
1978 గోరంత దీపం తెలుగు
1979 లక్ష్మీ పూజ తెలుగు
2004 7జి రెయిన్ బౌ కాలనీ తమిళం Idhu Enna Maatram
2010 ఆయిరథిల్ ఒరువన్ తమిళం Pemmane
  1. Laxmi Pooja (1979)
  2. Gorantha Deepam (1978)
  3. Jeevana Jyothi (1976)
  4. Seeta Kalyanam (1976)
  5. Chelleli Kapuram (1971)
  6. Saptaswarulu (1969)
  7. Ooty Varai Uravu (1967)
  8. Sakshi (1967)
  9. Letha Manasulu (1966)
  10. Tene Manasulu (1965)

ఇవి కూడా చూడండి

మార్చు

లింకులు

మార్చు

సూచికలు

మార్చు
  1. 1.0 1.1 [1]
  2. [2]
  3. "The Hindu : Music cannot thrive without rasikas". Archived from the original on 2012-11-03. Retrieved 2013-04-15.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-11-04. Retrieved 2016-05-25.
  5. "The Hindu: Harishchandra (1955)". Archived from the original on 2011-10-08. Retrieved 2013-04-15.
  6. "The Hindu : Bit of drive-in nostalgia". Archived from the original on 2009-05-08. Retrieved 2013-04-15.
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-02-23. Retrieved 2013-04-15.
  8. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-04-14. Retrieved 2013-04-15.