శ్రీ రాజా వత్సవాయి జగపతి బహద్దూర్ మహారాణి కళాశాల, పెద్దాపురం

శ్రీ రాజా వత్సవాయి జగపతి బహద్దూర్ మహారాణి కళాశాల పెద్దాపురం పరిసర ప్రాంతాలకు 1967 వ సంవత్సరం ఆగస్టులో స్థాపించబడిన మొట్టమొదటి కళాశాల

స్థాపన

మార్చు

శ్రీ రాజా వత్సవాయి జగపతి బహద్దరు మహారాణీ కాలేజీ
తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్, భారతీయ సంస్కృతీ ధర్మ పరిరక్షకులు
S.B.P.B.K. సత్యనారాయణ గారి విశేష కృషి వల్ల మహారాణీ కాలేజీ ఆగష్టు 1967 వ సంవత్సరంలో మహారాణీ సత్రం యొక్క మిగులు నిధులు నుంచి రూ. 90,000/, కాలేజీ కి అవసరమైన స్థలం కొనుగోలు నిమిత్తం సర్వారాయ ఎడ్యుకేషన్ ట్రస్టు నిధులు నుంచి రూ, 50,000/, ఇంకా ఇతర అవసారాల నిమిత్తం అయిన ఖర్చులను శ్రీ ముప్పన అంకయ్య సోదరులు పెద్ద మనసుతో స్వచ్చందంగా ఇవ్వగా పెద్దాపురం పరిసర ప్రాంత విద్యార్ధుల ఆశాదీపం మహారాణీ కళాశాల స్థాపన ఘనంగా జరిగింది.

కళాశాల స్థాపనకి పురిగోల్పిన సంఘటనలు

మార్చు

1967 ఆరోజుల్లో పెద్దాపురం పేరుకి డివిజన్ ముఖ్య కేంద్రం అయినప్పటికీ అక్షరాస్యతా శాతంలో అట్టడుగు స్థానంలో వుండేది. యస్ యస్ యల్ సి చదివిన వారి సంఖ్య వేళ్ళ మీద లెక్కించవచ్చు అంత తక్కువగా ఉండేది. జిల్లాల్లో రాజమండ్రి, కాకినాడ, పెద్దాపురం లాంటి ప్రాంతాలలో మాత్రమే హైస్కూళ్ళు ఉండటంతో సుదూర ప్రాంతాలనుడి విద్యార్థులు ఉన్నత విద్య కోసం పెద్దాపురం వచ్చేవారు. పెద్దాపురం ప్రజలలో ఎక్కువ శాతం మంది వ్యవసాయ, చేనేత, చేతి వృత్తులవారు కావడంతో చాలా మంది పేద విద్యార్థులు యస్ యస్ యల్ సి అత్యున్నత మార్కులతో ఉత్తీర్ణులైనప్పటికీ కళాశాల చదువుల కోసం చెన్నపట్టణం పోలేక కన్నీళ్లు దిగమింగుకొని కార్మికులుగానే స్థిరపడి పోయేవారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ప్రతీ విద్యార్థికి ఉన్నత చదువులు చేరువకావాలనే సత్ సంకల్పంతో మహానుబావుల విశేష పరిశ్రమ వల్ల కళాశాల స్థాపన జరిగింది.

మైలు రాళ్లు

మార్చు

1967 లో పి. యు. సి (P.U.C), బి. ఎ (B.A), బి.కామ్ (B.Com) లలో 200 మంది విద్యార్థులు-15 మంది స్టాఫ్ తో ప్రారంభమై, తరువాత సంవత్సరమైన 1968 లో బి. ఎస్. సి (B.S.C) లో కొన్ని కాంబినేషన్లతో,

ఆ తరువాత 1969 సంవత్సరంలో పి. యు. సిని సైన్స్, ఆర్ట్స్, కామర్స్, విభాగాలలో రెండు సంవత్సరాల ఇంటర్ మీడియట్ గా మార్చడం, జూలై 1987 లో అటానమస్ గా గుర్తిపు పొంది బి. ఎ - బి యెస్. సి కోర్సులలో గల అన్ని కాంబినేషన్ లు ( B.S.C. Mpac, Mpe – B.A. Epp, Ecf) లు జత చేయడం జరిగింది.

ఆ తరువాత 1993 - 94 నుంచి అటానమస్ వద్దు అనుకుని ఆంధ్రా యూనివర్సిటీ రెగ్యులేషన్ ఫాలో అవ్వడం,

2007 సంవత్సరం నుండి పి. జి కోర్సులు కూడా ప్రారంభించి 18 ఎకరాల సువిశాల స్థలం, విశాలమైన క్రీడా ప్రాంగణం, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం, క్రమశిక్షణతో కూడిన విద్య - అంకిత బావాన్ని అలవరిచే ఎన్ సి సి (N.C.C) - సామాజిక బాధ్యతను పెంపొందిచే ఎన్. యెస్. ఎస్. (N.S.S), రెడ్ క్రాస్,

పూర్తి స్థాయి సాంకేతిక పరికరాలతో కూడిన లాబరేటరీ - ఇ క్లాస్ రూమ్స్ - విద్యార్థులకు ఇంటర్నెట్ సౌకర్యం, అధునాతన లైబ్రరీ, తో అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ దిన దిన ప్రవర్ధమాన మవుతూ నేటికి 2000 విద్యార్థులు, 60 టీచింగ్ స్టాఫ్, 50 నాన్ టీచింగ్ స్టాఫ్ తో సరస్వతీ నిలయంగా శోభిల్లుతుంది.

ఈ కళాశాలలో చదివిన ప్రముఖులు

మార్చు

నీతి నిజాయితీకి మారు పేరుగా పిలువబడే రౌతులపూడి రైతుబిడ్డ - ఆర్.నారాయణమూర్తి చదివింది ఈ కాలేజీ లోనే