శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయం, మోత్కూర్

తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూర్ పట్టణంలో ఉన్న దేవాలయం

శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూర్ పట్టణంలో ఉన్న దేవాలయం. త్రేతాయుగంలో రాముడు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఈ దేవాలయానికి శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయం అనే పేరు వచ్చింది. ఈ దేవాలయ ముఖద్వారం పడమరపైపుకు ఉండడం దీని ప్రత్యేకత.

శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయం
శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయ ముఖద్వారం
శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయ ముఖద్వారం
శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయం is located in Telangana
శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయం
శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయం
తెలంగాణ రాష్ట్రంలో ఉనికి
భౌగోళికాంశాలు :17°27′00″N 79°16′00″E / 17.45°N 79.2667°E / 17.45; 79.2667
ప్రదేశం
దేశం:భారత దేశము
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:యాదాద్రి భువనగిరి జిల్లా
ప్రదేశం:మోత్కూర్ గ్రామం, మోత్కూర్ మండలం
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:శివుడు
ముఖ్య_ఉత్సవాలు:శివరాత్రి

చరిత్ర

మార్చు

ఈ గుడి కాలతీయుల కాలంలో నిర్మించబడింది. ఈ గుడి నిర్మాణానికి సంబంధించి ఒక కథ ప్రాచూర్యంలో ఉంది. కాకతీయ మహారాజు తన రాజ్యంలోని ఒక గ్రామంలో గుడిని నిర్మించదలచి ఉన్న విశ్మకర్యలకు నిర్మాణబాధ్యతను అప్పగించి, దానికి ప్రతిఫలంగా తూమెడు (పాతకాలపు కొలమానం) బంగారు నాణాలు ఇస్తానని వాగ్దానం చేశాడు. దాని ప్రకారం అనుకున్న సమయంలో అనుకున్న విధంగా శిల్పి గుడిని నిర్మించారు.

ఆ తరువాత రాజు దగ్గరికి వెళ్ళి బంగారు నాణాల గురించి అడుగగా, గొడ్డలి తూము (గొడ్డలికి ఉండే రంధ్రం) నిండా బంగారు నాణాలు ఇచ్చాడు. వాగ్దానం చేసినదాని ప్రకారం బంగారు నాణాలు ఇవ్వాలని, లేకుంటే ఆ రాత్రే గుడిని తీసుకుపోతామని విశ్వకర్మలు రాజుతో చెప్పారు. కట్టిన గుడిని తీసుకుపోలేరన్న ధీమాతో రాజు అంగీకరించాడు. విశ్వకర్మలు తమకున్న మంత్రశక్తులతో రాత్రికి రాత్రే ఆ గుడిని తరలించుకుపోయారు. అలా తరలిస్తున్న గుడిని చూసిన వేరే ఊరి ప్రజలు విశ్వకర్మల దగ్గరికి వచ్చి ఆ గుడిని తమ ఊళ్ళో ఉంచాలని, తామ పూజించుకుంటామని కోరడంతోపాటు తూమెడు బంగారు నాణాలు ఇస్తామని చెప్పడంతో విశ్మకర్మలు అంగీకరించి ఆ గుడిని అక్కడ వదిలివెళ్ళారు. అలా గుడి ముఖద్వారం పడమరవైపుకు ఉండిపోయింది.[1]

నిర్మాణం

మార్చు

విష్ణుకుండిన కాలంలో దేవాలయం నిర్మించబడగా, కళ్యాణి చాళుక్యుల కాలంలో ప్రవేశ ద్వారం వద్ద రెండస్తుల మండపం నిర్మించబడింది. దేవాలయంలోని అన్ని ద్వారాలకు రెండు వైపులా కలశాలున్నాయి. కాకతీయులకాలంలో అర్ధమండపం, ముఖమండపం, అంతరాళం, గర్భగుడులతో ఈ దేవాలయం పునరుద్ధరించబడింది. స్తంభాలపై చెక్కిన శిల్పాలు దేవాలయ కాలాన్ని, శైవమతం శాఖల ప్రాభవాన్ని చెబుతున్నాయి. ద్వారపతంగం మీద గజలక్ష్మీ, చాళుక్యశైలిలో ద్వార బంధాలు, అంతరాళం ముందు గుండ్రని రాతిబిల్ల రంగ మండపం ఉన్నాయి. ఆరు అంగుళాల ఎత్తున్న శివలింగం వెనకాల అర్చామూర్తుల్లో సీతారామలక్ష్మణులు ఉండటం ఇక్కడి విశేషం.[2][3]

ఉత్సవాలు

మార్చు

ప్రతి ఏట బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. గుడి ముందున్న కళ్యాణ మండపంలో శివపార్వతుల వివాహం జరిగిన తర్వాత పార్వతీ సమేతుడైన రామలింగేశ్వరున్ని గ్రామంలోని ప్రతి ఇంటికి ఊరేగింపుగా తీసుకువస్తారు. గ్రామస్థులు కొబ్బరికాయలు, నైవేద్యంతో పూజించిన తరువాత, గుడి దగ్గర అగ్నిగుండాల కార్యక్రమం జరుగుతుంది.

ఇతర పండుగలు

మార్చు
  1. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు.
  2. ఉగాది రోజున అర్చనలు, పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం

మూలాలు

మార్చు
  1. కాకతీయుల కాలంనాటి రామలింగేశ్వరుని గుడి, ఈనాడు, నల్లగొండ ఎడిషన్, మార్చి 15, 1993, పుట.9
  2. "శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం పరిశీలన". సాక్షి, యాదాద్రి జిల్లా ఎడిషన్, పేజీ. 2. 2022-04-06. Archived from the original on 2022-04-06. Retrieved 2022-04-06.
  3. "రామలింగేశ్వరస్వామి గుడి శాసనంపై పరిశోధనలు". epaper.eenadu.net. 2022-04-06. Archived from the original on 2022-04-06. Retrieved 2022-04-06.