శ్రీ వెంకటేశ్వర దేవస్థానం, పిట్స్బర్గ్

తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పోలిన ఆలయం ఒకటి అమెరికా దేశంలోని పెన్సిల్ వేనియా రాష్ట్రంలో ఉన్న పిట్స్ బర్గ్ నగరంలో ఉంది. అమెరికాలోని తొలి దేవాలయంగా ప్రసిద్ధి పొందిన పిట్స్ బర్గ్ శ్రీ వెంకటేశ్వర దేవస్థానం అమెరికన్లనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారి నందరిని ఆకర్షిస్తుంది.

పిట్స్ బర్గ్సవరించు

250 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ నగరం ఒకప్పుడు ఒక చిన్న రేవు పట్టణం. అప్పట్లో పోర్ట్ బిట్ అని పిలవబడిన ఆ రేవుపై ఆధారపడి జీవించే వారి జనాభా భారీగా పెరిగిపోయి క్రమంగా పెద్ద జనావాసంగా మారింది. తరువాతి కాలంలో అక్కడే పిట్స్ బర్గ్ గా రూపాంతరం చెందింది. బ్రిటన్ ప్రధానమంత్రి అయిన విలియం పిట్ పేరు మీద పిట్స్బర్గ్ కి నామకరణం చేశారు. ఉక్కు పరిశ్రమకి ప్రధాన కేంద్రంగా ఉంటూ సిటీ ఆఫ్ బ్రిడ్జ్స్ అని, సిటీ ఆఫ్ స్టీల్ అని పేరు గాంచిన పిట్స్ బర్గ్ ఇప్పుడు అన్ని రంగాలలో అభివృద్ధి చెంది అమెరికాకే తలమానికంగా భాసిల్లుతుంది. పిట్స్ బర్గ్ అనగానే అమెరికాలోని తెలుగు వారికి మాత్రం తిరుమలకు పరియాయ పదమే అని స్ఫురిస్తుంది.

శ్రీ వెంకటేశ్వర దేవస్థానంసవరించు

వెన్నెలతో పోత పోసినట్లు మురిసిపోతున్న కట్టడమే పిట్స్ బర్గ్ శ్రీ వెంకటేశ్వర టెంపుల్ తిరుపతికి కంచుకోటగా సంస్కృతికి రాచబాటగా అధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే పూల తోటలతో అమెరికాలోని తెలుగువారికి ఆధ్యాత్మికతను పంచుతుంది పిట్స్బర్గ్ శ్రీ వెంకటేశ్వర దేవస్థానం. అమెరికాలోని తొలి దేవాలయంగా ప్రసిద్ధి పొందిన పిట్స్ బర్గ్ యస్.వి.టెంపుల్ అమెరికన్లనే కాదు ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారి నందరిని ఆకర్షిస్తుంది. అమెరికాకు వచ్చిన తెలుగు వారు ఎవరు మిస్సవ్వడానికి ఇష్టం లేకుండా కచ్చితంగా చూసి దర్శించే విధంగా పర్యాటక కేంద్రంగా పేరు పొందింది. పేరులోనే కాదు, రూపంలో కూడా అచ్ఛం తిరుమల ఆలయాన్ని స్ఫురింపజేయడం S.V.Temple ప్రత్యేకత. చుట్టూ కొలువు తీరిన కొండలు, ప్రకృతి సౌందర్యం సమోహితులను చేస్తాయి.

బయటి లింకులుసవరించు