శ్రీ సనాతన హిందూ మందిరం (లండన్)
శ్రీ సనాతన హిందూ మందిరం, లండన్‌లోని రెండు హిందూ దేవాలయాలు. ఒకటి బ్రెంట్, వెంబ్లీలోని ఈలింగ్ రోడ్‌కి దూరంగా, మరొకటి వాల్‌థమ్‌టోన్‌లోని విప్స్ క్రాస్‌లో ఉన్నాయి. శ్రీ వల్లభ నిధి యుకె అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ మందిరాలు నడుపబడుతున్నాయి.[1] ఈ దేవాలయాలు సనాతన ధర్మాన్ని ( హిందూమతం ) అనుసరిస్తాయి.[2]
లేటన్‌స్టోన్ దేవాలయం
మార్చులేటన్స్టోన్లోని దేవాలయాన్ని శ్రీనాథ్‌జీ మందిరం అని పిలుస్తారు. 1980 జూన్ లో ఈ దేవాలయం ప్రారంభించబడింది. ఇందులో శ్రీరామ్, శ్రీనాథ్‌జీ, శివ పరివారం, అంబా మాతాజీ, జలరామ్ బాపా, హనుమంతుడు దేవతామూర్తులు ఉన్నారు.[3]
వెంబ్లీ దేవాలయం
మార్చు2010లో ప్రారంభించబడిన ఈ దేవాలయ నిర్మాణానికి 14 సంవత్సరాల కాలం పట్టింది. భారతదేశం నుండి తీసుకొచ్చిన సున్నపురాయితో ఈ దేవాలయం నిర్మించబడింది.[4] ఇది 2.4 ఎకరాల (9,700 చ.మీ.) విస్తీర్ణంలో ఉంది.[5] ఈ దేవాలయానికి సంబంధించిన అనేక భాగాలు గుజరాత్ రాష్ట్రం సోలా పట్టణంలో చెక్కబడ్డాయి. పాలరాతితో 41 దేవతల విగ్రహాలు తయారు చేయబడ్డాయి. ఎత్తైన ప్రదేశంలో, 66 అడుగుల (20మీ) ఎత్తులో ఈ దేవాలయం ఉంది.[6] వినాయకుడు, సహజానంద స్వామి, అంబా మాతాజీ, సిమంధర్ స్వామి, రాధా కృష్ణ, శ్రీరామ్ దర్బార్, శ్రీనాథ్‌జీ, తిరుపతి బాలాజీ, శివపరివార్, జలరామ్ బాపా, హనుమంతుడు మొదలైన దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారు.
మూలాలు
మార్చు- ↑ "Welcome to Shri Vallabh Nidhi UK". Shri Vallabh Nidhi UK. Archived from the original on 2017-10-05. Retrieved 2022-05-09.
- ↑ "Sanatan Dharma". Shri Vallabh Nidhi UK. Archived from the original on 2018-01-06. Retrieved 2022-05-09.
- ↑ "Leytonstone temple". Shri Vallabh Nidhi UK. Archived from the original on 2018-01-02. Retrieved 2022-05-09.
- ↑ Nye, Catrin (2010-05-31). "New £16m Hindu temple opens in Wembley". BBC News.
- ↑ "New syncretic temple opens in London". The Hindu.
- ↑ "Wembley temple". Shri Vallabh Nidhi UK.