శ్రీ సైనీ భారత సంతతికి చెందిని అమెరికా యువతి. అమెరికాలోని ప్యూర్టోరికోలో జరిగిన మిస్‌వరల్డ్‌–2021 పోటీలో అమెరికా తరపున  పాల్గొని  మొదటి రన్నరప్‌గా నిలిచింది..[4]

శ్రీ సైనీ
జననంజనవరి 6, 1996 (వయస్సు 26) పంజాబ్, భారతదేశం
పంజాబ్, భారతదేశం
జాతీయతఅమెరికన్
విద్యాసంస్థయూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్
వృత్తిమోడల్
ఎత్తు5 అడుగుల 9 అంగుళాలు (1.75 మీ)
బిరుదుమిస్ వరల్డ్ అమెరికా 2020

(బ్యూటీ విత్ ఎ పర్పస్ అంబాసిడర్) మిస్ వరల్డ్ 2021

(1వ రన్నరప్)
పురస్కారాలుమిస్ ఇండియా యూ ఎస్ ఏ [1] (2017-2018)
Miss India Worldwide[2] (2018-2019)
Miss World America Washington 2019[3] (contestant)

జననం మార్చు

శ్రీ సైనీ పంజాబ్‌కు చెందిన సంజయ్‌ సైనీ, ఏక్తా సైనీ దంపతులకు జనవరి 6, 1996 న జన్మించింది.

విద్య మార్చు

ఈమె శ్రీ హార్వర్డ్, యేల్ ,స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలలో విజిటింగ్ స్టూడెంట్‌గా చేరి , తర్వాత వాషింగ్టన్ యూనివర్శిటీలో అండర్ గ్రాడ్ డిగ్రీ ని పొందింది.[5]

ప్రదర్శన మార్చు

తొలిసారి 2017లో మిస్‌ ఇండియా యూఎస్‌ఏ కిరీటాన్ని గెలుచుకుంది. మరుసటి ఏడాది మిస్‌వరల్డ్‌ ఇండియా వరల్డ్‌ వైడ్‌ కిరీటాన్ని గెలుచుకుంది. 2020లో వాషింగ్టన్‌లోని సీటెల్, ఎలెన్స్‌బర్గ్ నివాసిగా లిస్ట్ అయిన సైనీ, 2020 మిస్ వాషింగ్టన్ వరల్డ్ అమెరికాస్ బ్యూటీ విత్ ఎ పర్పస్ నేషనల్ అంబాసిడర్ గా నిలిచింది. 2020లో, ప్యాషన్ విస్టా నుండి 'వరల్డ్ పీస్ మెసెంజర్' అవార్డు పొందింది. ప్యూర్టో రికోలో జరిగే మిస్ వరల్డ్ 2021 లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కు ప్రాతినిధ్యం వహించింది.[6]

మిస్ వరల్డ్ 2021 మార్చు

మిస్ వరల్డ్ 2021 పోటీలో సైనీ మొదటి రన్నరప్‌గా నిలిచింది , పోలాండ్‌కు చెందిన కరోలినా బిలావ్స్కా విజేతగా నిలిచింది.[7]

మిస్ వరల్డ్ అమెరికా 2020 మార్చు

  • టాప్ 10 ఫైనలిస్ట్
  • మిస్ వరల్డ్ అమెరికాస్ బ్యూటీ విత్ ఎ పర్పస్ నేషనల్ అంబాసిడర్
  • పర్పస్ టాప్ 10 ఫైనలిస్ట్‌
  • టాప్ ఇన్‌ఫ్లుయెన్సర్ నేషనల్ విన్నర్
  • పీపుల్స్ ఛాయిస్ నేషనల్ విన్నర్
  • టాలెంట్ టాప్ 10 ఫైనలిస్ట్
  • టాలెంట్ ఆడియన్స్ ఛాయిస్[8]

మిస్ వరల్డ్ అమెరికా 2019 మార్చు

  • బ్యూటీ విత్ ఎ పర్పస్ సర్వీస్ అవార్డు నేషనల్ విన్నర్
  • టాప్ ఇన్‌ఫ్లుయెన్సర్ నేషనల్ విన్నర్
  • ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఛాలెంజ్ నేషనల్ విన్నర్
  • పీపుల్స్ ఛాయిస్ నేషనల్ విన్నర్
  • టాప్ మోడల్ 1st  రన్నరప్
  • టాలెంట్ 1st  రన్నరప్

మూలాలు మార్చు

  1. "Shree Saini from USA crowned Miss India Worldwide 2018". The Pioneer (in ఇంగ్లీష్).
  2. "UW student Shree Saini wins Miss India Worldwide 2018". Northwest Asian Weekly. 7 January 2019.
  3. "Indian-American model Shree Saini selected for Miss World America Pageant 2019". 3 October 2019.
  4. "షైనింగ్‌ సైనీ: విధిని ఎదిరించింది అందాల పోటీలో నిలిచింది". Sakshi. 2022-03-18. Retrieved 2022-03-19.
  5. Anderson, Mark Cronlund; Robertson, Carmen. (2007). "The "Bended Elbow" News, Kenora 1974: How a Small-Town Newspaper Promoted Colonization". The American Indian Quarterly. 31 (3): 410–440. doi:10.1353/aiq.2007.0027. ISSN 1534-1828.
  6. "Toward an Open World", An Open World, Yale University Press, pp. 89–119, 2020-09-15, retrieved 2022-03-19
  7. "భారతీయ అమెరికన్ శ్రీ సైనీ మిస్ వరల్డ్ 2021 ఫస్ట్ రన్నరప్‌". andhrajyothy. Retrieved 2022-03-19.
  8. "Shree Saini", Wikipedia (in ఇంగ్లీష్), 2022-03-18, retrieved 2022-03-19
"https://te.wikipedia.org/w/index.php?title=శ్రీ_సైనీ&oldid=3491098" నుండి వెలికితీశారు