షట్టరు వేగం
ఛాయాచిత్రకళలో షట్టరు వేగం లేదా బహిర్గత సమయం ఫోటోని చిత్రీకరించే సమయంలో షట్టరు తెరచి ఉంచవలసిన కాల పరిమాణం. ఫోటోగ్రఫిక్ ఫిలిం/ఇమేజ్ సెన్సర్ పైకి చేరబడే కాంతి బహిర్గత సమయానికి అనుపాతంలో ఉంటుంది.
పరిచయం
మార్చుఛాయాచిత్రకళలో సృజనాత్మక వినియోగం
మార్చువివిధ షట్టరు వేగాలతో తిరుగుతూ ఉన్న ఒక సీలింగ్ ఫ్యాన్ యొక్క ఛాయాచిత్రాలు
మార్చుఒకే సూక్ష్మరంధ్రంతో షట్టరు వేగం ఎక్కువ ఉంటే (తక్కువ సమయం తెరచి ఉంచబడుతుంది కాబట్టి), కదిలే వస్తువులు ఆగిపోయినట్లుగా చిత్రీకరించవచ్చు. షట్టరు వేగం తక్కువ ఉంటే (ఎక్కువ సమయం తెరచి ఉంచబడుతుంది కాబట్టి), వస్తువుల కదులుతోన్నట్లుగా చిత్రీకరించవచ్చు. ఉదాహరణకు, ఒక గదిలో ఒకే వేగంతో తిరుగుతోన్న సీలింగు ఫ్యానును వివిధ షట్టరు వేగాలతో చిత్రీకరించినట్లయితే, షట్టరు వేగం ఎక్కువగా ఉన్న ఛాయాచిత్రాలలో ఫ్యాను అసలు తిరగనట్లుగా ఉంటే, షట్టరు వేగం తక్కువగా ఉన్న ఛాయాచిత్రాలలో ఫ్యాన్య్ యొక్క రెక్కల వేగం తెలుస్తుంది.
ఒకే సూక్ష్మరంధ్రంతో షట్టరు వేగం తగ్గే కొద్దీ, నమోదు అయ్యే కాంతి పెరుగుతూ పోతుంది, కావున, ఐ ఎస్ ఓ వేగం తగ్గిస్తూ రావాలి.
-
సెకనులో 640వ వంతు సమయం పాటు షట్టరు తెరిచి ఉంచినపుడు (ISO Hi)
-
320వ వంతు (ISO 6,400)
-
160వ వంతు (ISO 3,200)
-
80వ వంతు (ISO 1,600)
-
40వ వంతు (ISO 800)
-
25వ వంతు (ISO 400)
-
20వ వంతు (ISO 400)
-
10వ వంతు (ISO 200)
-
5వ వంతు (ISO 100)