షర్ఫుద్దౌలా
షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్ (Bengali: শরফুদ্দৌলা ইবনে শহীদ) (జననం 16 అక్టోబర్ 1976), అంతర్జాతీయ క్రికెట్ అంపైరు, బంగ్లాదేశ్‌కు చెందిన మాజీ ఫస్ట్-క్లాస్ ఆటగాడు. [1] పురుషుల అంతర్జాతీయ క్రికెట్‌లో 100 మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించిన తొలి బంగ్లాదేశ్ అంపైరు. 2023 లో జరిగే ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్‌కు మ్యాచ్ అధికారిగా ఎంపికైన బంగ్లాదేశ్‌కు చెందిన మొదటి అంపైరు కూడా ఇతను. [2]
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | షర్ఫుద్దౌలా ఇబ్న్ షాహిద్ సైకత్ | ||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | రాజ్‌షాహి, బంగ్లాదేశ్ | 1976 అక్టోబరు 16||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 8 అం. (1.73 మీ.) | ||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | ||||||||||||||||||||||||||
బౌలింగు | Slow left-arm orthodox | ||||||||||||||||||||||||||
పాత్ర | Umpire | ||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||
2000–2001 | Dhaka Metropolis | ||||||||||||||||||||||||||
తొలి ఫక్లా | 22 November 2000 Dhaka Metropolis - Sylhet Division | ||||||||||||||||||||||||||
చివరి ఫక్లా | 27 January 2001 Dhaka Metropolis - Chittagong Division | ||||||||||||||||||||||||||
అంపైరుగా | |||||||||||||||||||||||||||
అంపైరింగు చేసిన టెస్టులు | 9 (2021–2023) | ||||||||||||||||||||||||||
అంపైరింగు చేసిన వన్‌డేలు | 52 (2010–2023) | ||||||||||||||||||||||||||
అంపైరింగు చేసిన టి20Is | 43 (2011–2023) | ||||||||||||||||||||||||||
అంపైరింగు చేసిన మవన్‌డేలు | 13 (2012–2022) | ||||||||||||||||||||||||||
అంపైరింగు చేసిన మటి20Is | 28 (2012–2022) | ||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 24 August 2023 |
ఆటగాడిగా
మార్చు1994లో కెన్యాలో జరిగిన 1994 ICC ట్రోఫీలో షర్ఫుద్దౌలా బంగ్లాదేశ్ తరపున మూడు మ్యాచ్‌లు ఆడాడు. [3] 2000, 2001లో ఢాకా మెట్రోపాలిస్ తరపున 10 ఫస్ట్-క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడాడు.[4]
అంపైరింగ్ కెరీర్
మార్చుఅతను 2007 ఫిబ్రవరిలో బారిసల్ డివిజన్, సిల్హెట్ డివిజన్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అంపైర్‌గా తన తొలి ఫస్ట్-క్లాస్ ఆటలో నిలబడ్డాడు.[5]
జనవరి 2010లో అతను బంగ్లాదేశ్, శ్రీలంకల మధ్య జరిగిన తన మొదటి వన్‌డే మ్యాచ్‌లో అంతర్జాతీయ స్థాయిలో అంపైరింగు చేసిన పదవ బంగ్లాదేశీగా నిలిచాడు. [6]
2022 ఫిబ్రవరిలో అతను, న్యూజిలాండ్‌లో జరిగే 2022 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆన్-ఫీల్డ్ అంపైర్‌లలో ఒకరిగా ఎంపికయ్యాడు. [7] [8] జనవరి 2023లో, అతను 2023 ICC అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ కోసం ఆన్-ఫీల్డ్ అంపైర్‌లలో ఒకరిగా ఎంపికయ్యాడు. [9] [10]
ఫిబ్రవరి 2021లో, అతను బంగ్లాదేశ్, వెస్టిండీస్ మధ్య ఆడిన రెండు టెస్ట్ మ్యాచ్‌లకు ఆన్-ఫీల్డ్ అంపైర్‌గా ఎంపికయ్యాడు, టెస్ట్ మ్యాచ్‌లలో అధికారిగా వ్యవహరించిన ఐదవ బంగ్లాదేశ్ అంపైర్ అతడు. [11] [12]
2023 సెప్టెంబరులో, 2023 క్రికెట్ ప్రపంచ కప్‌కు మ్యాచ్ అధికారులలో ఒకరిగా షర్ఫుద్దౌలా ఎంపికయ్యాడు. పురుషుల ప్రపంచ కప్‌కు ఎంపికైన అంపైర్‌లలో ఒకరిగా పేరు పొందిన మొదటి బంగ్లాదేశ్ అంపైర్ అయ్యాడు. [13]
2023 మార్చిలో, బంగ్లాదేశ్, ఐర్లాండ్ మధ్య జరిగిన 3వ T20I సమయంలో, అతను 100 పురుషుల అంతర్జాతీయ మ్యాచ్‌లలో అధికారిగా వ్యవహరించిన మొదటి బంగ్లాదేశ్ అంపైర్ అయ్యాడు. [14] [15]
జింబాబ్వేలో 2018 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ కోసం అతను మ్యాచ్ అధికారులలో ఒకరిగా ఎంపికయ్యాడు. [16] 2018 అక్టోబరులో 2018 ICC మహిళల వరల్డ్ ట్వంటీ20 కోసం పన్నెండు మంది ఆన్-ఫీల్డ్ అంపైర్‌లలో ఒకరిగా ఎంపికయ్యాడు. [17] 2019 అక్టోబరులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన 2019 ICC T20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్‌లో మ్యాచ్‌లను నిర్వహించే పన్నెండు మంది అంపైర్‌లలో ఒకరిగా అతను నియమితుడయ్యాడు. [18] జనవరి 2020లో, అతను దక్షిణాఫ్రికాలో జరిగే 2020 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం పదహారు అంపైర్‌లలో ఒకరిగా ఎంపికయ్యాడు. [19]
మూలాలు
మార్చు- ↑ "Sharfuddoula". Cricket Archive. Retrieved 23 May 2011.
- ↑ "Sharfuddoula first Bangladeshi umpire in ODI World Cup". The Business Standard (in ఇంగ్లీష్). 8 September 2023. Retrieved 8 September 2023.
- ↑ "ICC Trophy Matches played by Sharfuddoula". Cricket Archive. Retrieved 23 May 2011.
- ↑ "Sharfuddoula". ESPNcricinfo. Retrieved 23 May 2011.
- ↑ "Sharfuddoula as Umpire in First-Class Matches". Cricket Archive. Retrieved 23 May 2011.
- ↑ "Sharfuddoula as Umpire in One-Day International Matches". Cricket Archive. Archived from the original on 7 November 2012. Retrieved 23 May 2011.
- ↑ "Eight women among 15 Match Officials named for ICC World Cup 2022". Women's CricZone. Retrieved 22 February 2022.
- ↑ "Match officials chosen for ICC Women's Cricket World Cup 2022". International Cricket Council. Retrieved 22 February 2022.
- ↑ "ICC announces highest number of female match officials for ICC U19 Women's T20 World Cup 2023". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Retrieved 15 January 2023.
- ↑ "ICC announces highest number of female match officials for U19 Women's T20 World Cup 2023". ThePrint. 5 January 2023. Retrieved 15 January 2023.
- ↑ "Sharfuddoula made BCB test umpire". Shining Bangladesh (in ఇంగ్లీష్). 26 January 2021. Retrieved 3 February 2021.[permanent dead link]
- ↑ Gupta, Rishabh (26 January 2021). "Richard Illingworth becomes first neutral umpire to officiate a Test since COVID-19 pandemic". India TV (in ఇంగ్లీష్). Dhaka. IANS. Retrieved 3 February 2021.
- ↑ প্রতিবেদক, ক্রীড়া (8 September 2023). "বিশ্বকাপে আম্পায়ারিংয়ে বাংলাদেশের অন্যরকম 'প্রথম'". Prothomalo (in Bengali). Retrieved 8 September 2023.
- ↑ আনোয়ার, সাইফুল্লাহ্ বিন. "শামীমের ফিফটি, ১২৪ রানেই থামল বাংলাদেশ". Prothomalo (in Bengali). Retrieved 31 March 2023.
- ↑ ডেস্ক, খেলা. "আম্পায়ার হিসেবে 'সেঞ্চুরি' শরফৌদউল্লাহর". Prothomalo (in Bengali). Retrieved 7 April 2023.
- ↑ "PNG defend 200 to take ninth place". International Cricket Council. Retrieved 17 March 2018.
- ↑ "11th team for next month's ICC Women's World T20 revealed". International Cricket Council. Retrieved 25 October 2018.
- ↑ "Match Officials announced for ICC Men's T20 World Cup Qualifier 2019". International Cricket Council. Retrieved 10 October 2019.
- ↑ "Match officials named for ICC U19 Cricket World Cup". International Cricket Council. Retrieved 8 January 2020.