షెర్లిన్ చోప్రా

ప్లేబోయ్ అనే శృంగార పత్రికలో పూర్తి నగ్నంగా ఫోజులిచ్చి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన మొట్టమొదటి భారతీయ మహిళ షెర్లిన్ చోప్రా. [1] మోనా చోప్రా అని కూడా పిలుబడే ఈమె బాలీవుడ్ నటి, గాయని, మోడల్.

షెర్లిన్ చోప్రా
Sherlyn Chopra snapped at Tunu Tunu album launch (03) (cropped).jpg
షెర్లిన్ చోప్రా
జననం (1984-02-11) 1984 ఫిబ్రవరి 11 (వయసు 39)
జాతీయతభారతీయురాలు
వృత్తిమోడల్, నటి, గాయని
వెబ్‌సైటుwww.sherlynchopra.com

బాల్యంసవరించు

జార్చి అమితాబ్ చోప్రా, సుసాన్ అమీర్ దంపతులకు హైదరాబాద్లో 1984 ఫిబ్రవరి 11 న జన్మించిన షెర్లిన్ చోప్రా హైదరాబాదులోని స్టాన్లీ బాలికోతన్న పాఠశాలలో విద్యాబ్యాసం చేసింది. తర్వాత సెంట్ ఆన్స్ కళాశాల (మెహదీపట్నం) లో డిగ్రీ రెండవ సంవత్సరంలో ఉండగానే మిస్ ఆంధ్రా అందాల పోటీల్లో పాల్గొని గెలిచిన షెర్లిన్ చోప్రా దృష్టి సినిమాల వైపు మళ్ళింది. సినిమాలలో అవకాశాల కోసం బొంబాయి వెళ్ళింది.

కెరీర్సవరించు

జూమ్ ఛానల్ వారి ఇంటర్యూలో అమితాబ్ బచ్చన్ వంటి వ్యక్తిని పెళ్ళి చేసుకోవాలని ఉందనే అభిప్రాయాన్ని షెర్లిన్ చోప్రా వ్యక్తం చేసింది. గేమ్, టైమ్ పాస్ వంటి ఎన్నో హిందీ చిత్రాల్లో నటించిన ఈమె 2002 లో బీపర్ అనే హాలివుడ్ సినిమాలో నటించింది. 2005 లో దోస్తీ, ఫరెవర్ ఫ్రెండ్స్ సినిమాల్లో, 2006 లో జవాని దివానీ అనే సినిమాలో, 2006 లో నాటీ బాయ్ అనే సినిమాలో, 2007 లో రఖీబ్ అనే సినిమాలో నటించింది. బిగ్ బాస్ హౌస్ కి సెక్సీగా ఆకుపచ్చ లేహంగా చోళీ దుస్తుల్లో వెళ్ళింది. నవంబరు 2012 న ప్లేబోయ్ మాస పత్రిక కవర్ పేజీపై షెర్లిన్ చోప్రా పూర్తి నగ్న ఫొటో ప్రచురితమైంది. లాస్ ఎంజల్స్ లో తనను నగ్నంగా ఫొటో తీసిన Hugh Hefner ను "భూమి పై అత్యంత దయ గల మనిషి"గా ప్రశంసించింది [2][3]

మూలాలుసవరించు

  1. "Sherlyn Chopra - First Indian Woman Nude for Playboy". snadgy.
  2. India today, Jul 13, 2012
  3. BBC News, 24, July, 2012

లంకెలుసవరించు