షెల్ ఖాతా రిమోట్ సర్వర్‌లోని వినియోగదారు ఖాతా, సాంప్రదాయకంగా యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కింద నడుస్తుంది, ఇది టెల్నెట్ లేదా ఎస్‌ఎస్‌హెచ్ వంటి కమాండ్-లైన్ ఇంటర్ఫేస్ ప్రోటోకాల్ ద్వారా షెల్‌కు ప్రాప్తిని ఇస్తుంది.[1] అలా వేరే కంప్యూటర్లలోకి లాగిన్అయ్యి, అక్కడ ఆదేశాలు(commands) జారీచేసి మీకు కావలిసిన పనులు చేయించుకోవచ్చు. ఇతర కంప్యూటర్లు బౌగోలికంగా మీకు అందుబాటులో లేకపోయినా కూడా, షెల్లు ఖాతా ఉపయోగించి, ఆ కంప్యూటర్లతో మీకు కావలిసిన పనులు చేయించుకోవచ్చు. సాధారణంగా షెల్లు ఖాతా ఉపయోగించుకోవడానికి టెల్నెట్ లేదా ఎస్.ఎస్.హెచ్ లాంటి ప్రోగ్రాములను వాడతారు.

ఆధునిక వెబ్సైటును నడపాలనుకున్నప్పుడు, షెల్లు ఖాతా ఎంతో ఉపయోగ పడుతుంది. ఆధునిక వెబ్సైటును సమర్పించే కంప్యూటర్లలో చాలా విలువైన సమాచారం ఉంటుంది, అందుకని సాధారణంగా ఆ కంప్యూటరుని, అత్యంత భద్రమైన ప్రదేశంలో ఉంచుతారు. అ తరువాత ఆ కంప్యూటరుని ముట్టుకోవడానికి కూడా ఎవరికీ అనుమతి ఇవ్వరు. ఇలాంటి సందర్భాలలో షెల్లు ఖాతాలను సృష్టించి, ఆ షెల్లు ఖాతాలనుండి వెబ్సైటుకు మార్పులు చేర్పులు చేస్తుంటారు. వెబ్సైటు మాత్రమే కాదు, ఐ.ఆర్.సీ, ఈమెయిలు లాంటి ఆధునిక కార్యక్రమాలను నడుపుతున్న కంప్యూటర్లను కూడా షెల్లు ఖాతాలతో నియంత్రించవచ్చు. అంతేకాదు మీరు ఇతర ఆపరేటింగు సిస్టములు ఎలా పనిచేస్తున్నాయో చూడాలనుకున్నప్పుడు కూడా షెల్లు ఖాతా చాలా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కాక షెల్లు ఖాతా ఉపయోగించి బాట్ల ద్వారా ఇతర కంప్యూటర్లలో యాంత్రికమైన పనులు కూడా నిర్వహించవచ్చు.

షెల్లు ఖాతాలను చాలాసార్లు దుర్వినియోగపరుస్తూ ఉంటారు. ఆలా దుర్వునియోగ పరచటం వలన ముఖ్యమయిన సమాచారం నాశనమైపోవచ్చు లేదా కంప్యూటరే చెడిపోవచ్చు. ఇలాంటి దుశ్చర్యలన్నీ అరికట్టటానికి వాటి నిర్వాహకులు షెల్లు ఖాతాలపై ఎన్నో నిబంధనలు, ఆంక్షలు విధిస్తారు. వాటిలో మొదటిది అదృశ్యరూపంలో ప్రోగ్రాములను (background processes) నడపనివ్వకపోవటం. తరువాత ఒకేసారి ఎంతమంది షెల్లు ఖాతాల ద్వారా లాగిన్ అవ్వొచ్చనే దానిపైన కూడా నిబంధన విధిస్తారు. అంతేకాదు షెల్లు ఖాతాల ద్వారా ఏఏ పనులు నిర్వర్తించవచ్చు అనే దానిపై కూడా నియమనిబంధనలు విధిస్తారు.

సామూహిక సంస్థలు / ప్రొవైడర్ల సమూహాలు / షెల్లు ఖాతా ప్రొవైడర్ల జాబితా

మార్చు

చారిత్రకంగా ఉచిత షెల్లుఖాతా ఇస్తున్న వాళ్లు

మార్చు
  • అర్బోర్నెట్ - ఫ్రీబిఎస్‌డి
  • సైబర్‌స్పేస్ కమ్యూనికేషన్స్ వారి గ్రెక్స్ - ఓపెన్‌బిఎస్‌డి
  • సూపర్ డిమెన్షనల్ ఫోర్ట్రెస్ - నెట్‌బిఎస్‌డి
  • పోలార్‌హోం - వివిధ లినక్సులను సమర్పిస్తుంది; ఫ్రీబిఎస్‌డి, ఓపెన్‌బిఎస్‌డి, నెట్‌బిఎస్‌డి, ఓపెన్‌విఎంఎస్, ఐఆర్ఐఎక్స్, ఏఐఎక్స్ ఆపరేటింగ్ సిస్టం, క్యుఎన్ఎక్స్, సోలారిస్ ఆపరేటింగ్ ఎన్విరాన్మెంట్, హెచ్‌పి-యుఎక్స్

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు