షేక్ మహబూబ్ బాష

(షేక్‌ మహబూబ్ బాష నుండి దారిమార్పు చెందింది)

బాషా మహబూబ్‌ షేక్‌.... 'తెలుగు భాషాభివృద్ధి ఉద్యమ వేదిక' ఏర్పాటు చేసి వేదిక అధ్యక్షులుగా తెలుగు బాషాభివృద్ధికి నిరంతర కృషి చేశారు. తెలుగు భాషాభిమాని. అనేక రచనలు చేశారు. తెలుగు భాషాభిమాని.

జీవన వ్యాసంగము

మార్చు

బాషా మహబూబ్‌ షేక్‌ .... గుంటూరు జిల్లా గుంటూరులో 1947 జూలై 1 ఒకిటిన జననం. వీరి తల్లితండ్రులు: షేక్‌ హబీబున్నీసా బేగం, షేక్‌ ముహమ్మద్‌ ఖాశిం. వీరు 12వ తరగతి వరకు చదువుకున్నారు. ఎం.ఎల్‌..సి (ఉస్మానియా). 'నవీన సాహితి బాషా' గా విఖ్యాతులు. ఆయుర్వేద వైద్యులు.

రచనా వ్యాసంగము

మార్చు

1974లో పురాణం సుబ్రమణ్యం శర్మ ప్రోత్సాహంతో 'స్పందన' కథానిక ఆంధ్రజ్యోతి వారపత్రికలో (1974 ఫిబ్రవరి) ప్రచురితమైంది. అప్పటి నుండి కథలు, కథానికలు, నాటికలు, నాటకాలు, కవితలు, పరిశోధనా వ్యాసాలు వివిధ పత్రికలలో మాత్రమే కాకుండా కవితా, కథానికల సంకలనాలలో చోటు చేసుకున్నాయి. మంచి వక్త. తెలుగు భాషాభివృద్థి ప్రధాన లక్ష్యంగా 'తెలుగు భాషాభివృద్ధి ఉద్యమ వేదిక' ఏర్పాటు చేసి వేదిక అధ్యక్షులుగా తెలుగు బాషాభివృద్ధికి నిరంతర కృషి చేశారు. తెలుగు భాషాభిమాని.

పురస్కారాలు

మార్చు

సాహితీ రత్న (పాలకొల్లు), సాహిత్య గాంధర్వ (విజయవాడ), తెలుగు వెలుగు బాషా (తెలుగు భాషా చైతన్య స్రవంతి, విజయవాడ). లక్ష్యం: తెలుగు అక్షరం ద్వారా తెలుగు భాషాభివృద్థి. 1982లో హైదారాబాద్‌లో జరిగిన 'ఆంధ్రప్రదేశ్‌ ముస్లిం తెలుగు రచయితల సమ్మేళనం' సందర్భంగా వెలువడిన 'తెలుగు దివెవ్వలు' ప్రత్యేక సంచికలో 'స్నేహితునికి చిన్న మాట' వ్యాసం రాశారు.

మూలాల జాబితా

మార్చు

మూలాల జాబితా

మార్చు