షేక్ మహబూబ్ సుభానీ
షేక్ మహబూబ్ సుభానీ కాలేషాబీ దంపతులు ప్రఖ్యాత నాదస్వర విద్వాంసులు.కలైమామణి బిరుదాంకితులు.
జీవిత విశేషాలు
మార్చుప్రకాశం జిల్లా వీరికి మద్దిపాడు మండలం పెదకొత్తపల్లి గ్రామం.ఈయన తల్లిదండ్రులు షేక్ మీరాసాహెబ్, హుస్సేన్‌భీలు.ఈయన ఎనిమిదవ తరగతి వరకూ గ్రామంలోనే చదివారు.పై చదువులకు వాకాడులో హాస్టల్ లో చదివాడు. ఈయన భార్య షేక్ కాలేషాబితో కలిసి దేశ విదేశాలలో నాదస్వర కచేరీలు ఇస్తున్నారు.షేక్ కాలేషాబి ది .ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చేకూరపాడు గ్రామం వారిది కూడా విధ్వాంసుల కుటుంబమే.విరికి 1977 లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు.ఒక కుమారుడు. ఈయన తన 10 వ ఏట నుండే నాథ స్వర సాధనను చదువుకుంటూనే చేస్తూ వారి తండ్రిగారితో కచేరీలలో పాల్గొనేవారు.
ఈయన గురువు ప్రముఖ నాదస్వర విద్వాంసులు షేక్ చిన మౌలానా.అతని ద్వారానే ఈ దంపతులు వెలుగులోకి వచ్చారు. ఈయన కృషికి కలైమామణి బిరుదును తమిళనాడు ప్రభుత్వం జూలై 29న 1994లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత ఇచ్చారు. ఇద్దరికి ఒకే సారి ప్రభుత్వం బిరుదులు ప్రధానం చేయటం అరుదైన గౌరవం.
విశేష వ్యక్తుల ఎదుట కచేరీలు
మార్చు- రాష్ట్రపతిభవన్‌లో కేవలం దేశంలోని 100 మంది ప్రముఖులు మాత్రమే కూర్చుని చూడగలిగే ఇంద్రధనస్సు థియేటర్‌లో రాష్ట్రపతి అబ్ధుల్ కలాం ఎదుట ప్రదర్శించిన కచేరి.
- రాష్ట్రపతి వెంకట రామన్ ఎదుట, ఎన్నికల కమిషనర్ ఎన్ గోపాల స్వామి ఎదుట, ఢిల్లీలోని మురుగన్ మలై టెంపుల్‌లో, కరుణానిధి ఎదుట, టివిజి అకాడమీ చెన్నైలోనిర్వహించిన కార్యక్రమంలో అప్పటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్థనరెడ్డి, బాలమురళీకృష్ణ ఎదుట ప్రదర్శించి కచేరీలు
నచ్చిన రాగాలు, కీర్తనలు
మార్చుఈయనకు నచ్చిన రాగం తోడి, కాపి రాగాలు. నచ్చిన కీర్తన ఎందుకు దయ రాదు...అనేవి
దంపతుల ప్రత్యేకత
మార్చుభార్యా భర్తలు ఇద్దరు కలిసి నాదస్వరం వాయించడము వీరి ప్రత్యేకత. వీరి ప్రతిభకు మెచ్చి తమిళనాడు ప్రభుత్వము వీరికి కలైమామిలి పురస్కారాన్ని ప్రసాదించి గౌరవించింది. భారత రాష్ట్రపతుల ఎదుట వీరి పాండిత్యాన్ని ప్రదర్శించే అవకాశము వీరికి కలిగింది. దంపతులుగా భారతదేశములో ఇటువంటి అరుదైన గౌరవాన్ని పొందిన వారు ఎవరు లేక పోవడము వీరి గొప్పతనము.సుబానీ, కాలేషాబీ దంపతులకు 9.11..2021 న పద్మశ్రీ అవార్డు ఇచ్చారు .వీరి కుటుంబంలో ఎనిమిది తరాలు స్వరార్చనలోనే ఉన్నారు.నాదస్వరానికి రాగవిస్తారం (ఘనరాగాల)తో చిలకలూరిపేట బాణి తెచ్చారు.దూదేకుల ముస్లింలైన వీరి సంగీతార్చనతో ఎందరో దేవుళ్లు నిద్రలేస్తారు.ఏడో తరానికి చెందిన నాదబ్రహ్మ, నాదస్వర గానకళా ప్రపూర్ణ షేక్ చినపీరు సాహెబ్ చిలకలూరిపేటలో నివసించిన ప్రాంతానికి చినపీరుసాహెబ్ వీధిగానే నామకరణం చేశారు. నాదస్వర విద్వాంసుడిగా పేరొందిన షేక్ చినపీరు సాహెబ్‌కు ముందు 1825 నుంచి వారి వంశీకులు షేక్ నబీసాహెబ్, షేక్ చిన నసర్దీ, పెద నసర్దీ సోదరులు, షేక్ పెద హుస్సేన్, చిన హుస్సేన్, దాదాసాహెబ్, గాలిబ్‌సాహెబ్ సోదరులు నాదస్వర విద్వాంసులే. చినపీరు సాహెబ్ వద్ద శిష్యరికం చేసిన షేక్ ఆదంసాహెబ్ సంగీత విద్వాంసుల కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు.మరో శిష్యుడు కరువది షేక్ చినమౌలాసాహెబ్ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. షేక్ చినపీరుసాహెబ్ మనవడే (కూతురి కుమారుడు) షేక్ మహబూబ్ సుభాని. ఆయన భార్య షేక్ కాలేషాబీ కూడా చినపీరుసాహెబ్‌కు వరుసకు మనవరాలే. సుభాని దంపతుల కుమారుడు షేక్ ఫిరోజ్‌బాబు కూడా తల్లిదండ్రులతో పాటు నాదస్వర విద్వాంసుడే.సుభాని తండ్రి షేక్ మీరా సాహెబ్ వద్ద నాదస్వరంలో ఓనమాలు దిద్దారు. షేక్ కాలేషాబీ తన తొమ్మిదో ఏట ఆమె తండ్రి షేక్ జాన్‌సాహెబ్ వద్ద నాదవిద్య అభ్యసించారు. 1978లో వీరి వివాహం అనంతరం కర్నూలు ప్రభుత్వ శారదా సంగీత కళాశాల ప్రిన్సిపాల్ కె.చంద్రమౌళి వద్ద కొంతకాలం పద్మశ్రీ డాక్టర్ షేక్ చినమౌలానా సాహెబ్ వద్ద నాదస్వరం అభ్యసించారు.2010 అక్టోబర్ నుంచి ఆలిండియా రేడియోలో వీరు టాప్‌గ్రేడ్ నాదస్వర విద్వాంసుల ద్వయంగా కొనసాగుతున్నారు.
వేలాది కచేరీలు,బిరుదులు
మార్చు- 2005 మార్చి 5న రాష్ట్రపతి భవన్‌లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ముందు కచేరీ
- 2001 మార్చి 24 నుంచి శృంగేరి శ్రీశారదా పీఠం ఆస్థాన విద్వాంసులుగా ఉన్నారు.
- 1994లో తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డు
- 2000లో చెన్నై బాలాజీ టెలివిజన్ సంస్థ దేశ థమారై అవార్డు,
- 2002లో నాదస్వర కళానిధి అవార్డు
- 2004లో అమెరికాలోని సౌత్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ ఆఫ్ కాలిఫోర్నియా అవార్డు
- 2005లో డాక్టర్ తిరువెంగడు సుబ్రమణ్యపిళ్లై శతాబ్ది అవార్డు
- 2008లో నాదస్వర చక్రవర్తి అవార్డు
- 2009లో ఇంటిగ్రిటీ కల్చరల్ అకాడమీ (చెన్నై) అవార్డు
- 2009లో కెనడియన్ ఫైన్ ఆర్ట్స్ అవార్డు
- 2015లో సంగీత మాసపత్రిక (చెన్నై) నాదబ్రహ్మం అవార్డు
- 2016లో శ్రీలంకలో నాదస్వర గానకళా వారధి అవార్డు
- 2017లో ఏపీ ప్రభుత్వం హంసకళా రత్న అవార్డు