షేఖ్‌పురా జిల్లా

బీహార్ లోని జిల్లా

బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో షేఖ్‌పురా జిల్లా ఒకటి. 1934 జూలై 31 ముంగేర్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లాను రూపొందించారు. షేఖ్‌పురా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. షేఖ్‌పురా జిల్లా ముంగేర్ డివిజన్‌లో భాగం. జిల్లా డాక్టర్ శ్రీ కృష్ణా సింగ్ (బీహార్ మొదటి ముఖ్యమంత్రి), స్వాతంత్ర్య సమర యోధుడు, నాయకులు శ్రీ రాధా రమణ్ శర్మ, సుఖదేవ్ ప్రసాద్ సింగ్, పార్లమెంటు సభ్యుడు రావు సింగ్ వంటివారికి స్వస్థానంగా ఉంది. భారతీయ చలనచిత్ర దర్శకుడు, సంగీత దర్శకుడు సుధాకర్ స్నేహ్ కూడా ఈ జిల్లాకు చెందిన వాడే. 2011 గణాంకాల ప్రకారం బీహార్ రాష్ట్ర జిల్లాలలో జనసఆంధ్రతా పరంగా షేఖ్‌పురా జిల్లా జిల్లా అత్యల్ప జనసాంధ్రత కలిగిన జిల్లాగా గుర్తించబడింది..[1]

షేఖ్‌పురా జిల్లా
शेखपुरा जिला,ضلع شیخ پورہ
బీహార్ పటంలో షేఖ్‌పురా జిల్లా స్థానం
బీహార్ పటంలో షేఖ్‌పురా జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంబీహార్
డివిజనుముంగేర్
ముఖ్య పట్టణంషేఖ్‌పురా
Government
 • లోకసభ నియోజకవర్గాలుజమూయి
Area
 • మొత్తం689 km2 (266 sq mi)
Population
 (2011)
 • మొత్తం6,34,927
 • Density920/km2 (2,400/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత65.96 %
 • లింగ నిష్పత్తి926
ప్రధాన రహదార్లుNH 82
Websiteఅధికారిక జాలస్థలి

భౌగోళికం మార్చు

షేఖ్‌పురా జిల్లా వైశాల్యం 689 చ.కి.మీ.,[2] ఇది సొలోమన్ ద్వీపాలకు చెందిన కొలోమంగర [3]

ఆర్ధికం మార్చు

షేఖ్‌పురా బీహార్ రాష్ట్రంలోని చిన్న జిల్లాలలో ఒకటి. ఇదిలో 6 బ్లాకులు మాత్రమే ఉన్నాయి. ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిసున్నారు. సోన్ మైనింగ్ జిల్లాలో ప్రధానంగా ప్రజలకు ఉపాధి కల్పిస్తుంది.

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో షేఖ్‌పురా జిల్లా ఒకటి అని గుర్తించింది.[4] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి. .[4]

విభాగాలు మార్చు

జిల్లాలో ఒక ఉపవిభాగం ఉంది. జిల్లాలో 6 మండలాలు ఉన్నాయి: అరియారి, షేఖ్‌పురా, బార్భిగా, అసెంబ్లీ నియోజకవర్గాలు షేఖ్‌పురా, బర్బిఘా

పోలీస్ స్టేషన్లు మార్చు

షైఖ్పుర పి.ఎస్, సిరరి ఒ.పి, అరియరి పి.ఎస్, కసర్ ఒ.పి, మహులి ఒ.పి, కుసుంభ ఒ.పి,చెవర పి.ఎస్.కరందే ఒ.పి, కుర్మా పి.ఎస్. మెహుస్ పి.ఎస్, బర్బిఘ పి.ఎస్, ఝయ్రంపుర్ ఒ.పి.

ప్రయాణసౌకర్యాలు మార్చు

రహదార్లు మార్చు

జిల్లా మొత్తం చక్కగా రహదార్లతో అనుసంధానితమై ఉంది. అన్ని తరచుగా నగరాలకు బసులు లభిస్తాయి.

రైల్వే మార్చు

షేఖ్‌పురా రైల్వే స్టేషన్ బ్రాడ్‌గేజ్ రైలుమార్గం నుండి కియుల్ జంక్షన్, గయ నగరాలతో అనుసంధానమై ఉన్నాయి. ఇక్కడి నుండి దినసరి కొలకత్తా, వారాంతర రైళ్ళు గౌహతి నగరాలకు రైలు వసతి లభిస్తున్నాయి. ఇక్కడి నుండి పాట్నాకు రైలు వసతి లభిస్తుంది. ఫాతుయా - ఇస్లాంపూర్, భక్తిపూర్ - రైగర్ రైలు మార్గాలు ఉన్నాయి.

వాయుమార్గం మార్చు

జిల్లాకు సమీపంలో ఉన్న విమానాశ్రయం " పాట్నా ఎయిర్‌పోర్ట్ " ఇక్కడి నుండి దేశీయంగా పలు నగరాలకు విమానసేవలు లభిస్తున్నాయి.

.

2001 లో గణాంకాలు మార్చు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 634,927,[1]
ఇది దాదాపు. మోణ్టెంగ్రొ దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. వర్మొంట్ నగర జనసంఖ్యకు సమం.[6]
640 భారతదేశ జిల్లాలలో. 516వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 920 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 20.82%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 926:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. స్వల్పంగా తక్కువ
అక్షరాస్యత శాతం. 65.96%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

భాషలు మార్చు

జిల్లాలో ప్రధానంగా హిందీ, ఉర్దూ, ఇండో - ఆర్యన్ భాష మాగహి (దేవనాగరి లిపిలో వ్రాయబడుతుంది) భాషలు వాడుకలో ఉన్నాయి.

సంస్కృతి మార్చు

పర్యాటక ఆకర్షణలు: ఆర్ఘుతి పోకర్, గిరిహింద పహర్ (శివాలయం ఉంది), సమాస్ (విష్ణు ఆలయం ఉంది), నిమిలో ప్రముఖ మహారాణి ఆలయం ఉంది. .

పాఠశాలలు మార్చు

  • ఎస్.డి.ఎన్. కాన్వెంట్ స్కూల్
  • హై స్కూల్ అయిఝి కతారి
  • డి.ఎం. ఉన్నత పాఠశాల
  • ఉన్నత పాఠశాల ఐఫ్ని
  • హై స్కూల్ మెహుస్,
  • జనతా హై స్కూల్ సిరరి,
  • ఉన్నత పాఠశాల నిమి, రజొ హై స్కూల్
  • అంబరి, కస్తూర్బా మహాత్మా గాంధీ బాలికా విద్యాలయ,
  • గగరి, కస్తూర్బా మహాత్మా గాంధీ బా ఒక విద్యాలయ
  • షెఖొపుర్ సారాయ్,
  • ఆర్.ఎన్. ఝ హై స్కూల్,
  • బరమ,
  • రాజకీయ మధ్యప్రదేశ్ విద్యలయ్ బిమన్,
  • ఉచ్చ విద్యలయ్ లోహన్
  • కాలేజ్ : ఇస్లామియా ఉన్నత పాఠశాల జవహర్ నవోదయా విద్యాలయ, చంద్రశేఖర్ బంకే నసీబ్ కాలేజ్, హతిమా, సంజయ్ గాంధి స్మరిక వుమంస్ కాలేజ్ (షేఖ్‌పురా), సుందర్ సింగ్ కాలేజ్ మెహుస్, షేఖ్‌పురా, నిమి కాలేజ్ షేఖ్‌పూర్ సరై, మురళీధర్ మురార్క, సంస్కార్ పబ్లిక్ ఉన్నత పాఠశాల.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: బీహార్: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
  3. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2018-02-20. Retrieved 2011-10-11. Kolombangara 688km2
  4. 4.0 4.1 Ministry of Panchayati Raj (8 September 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 5 ఏప్రిల్ 2012. Retrieved 27 September 2011.
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Montenegro 661,807 July 2011 est.
  6. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Vermont 625,741

వెలుపలి లింకులు మార్చు

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు