షైజా ఖాన్

పాకిస్తానీ మాజీ క్రికెటర్

షైజా సైద్ ఖాన్ (జననం 1969, మార్చి 18) పాకిస్తానీ మాజీ క్రికెటర్. కుడిచేతి లెగ్ బ్రేక్ బౌలర్ గా, కుడిచేతి బ్యాటర్‌గా రాణించింది.

షైజా ఖాన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
షైజా సైద్ ఖాన్
పుట్టిన తేదీ (1969-03-18) 1969 మార్చి 18 (వయసు 55)
కరాచీ, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి లెగ్ బ్రేక్
పాత్రఆల్ రౌండర్
బంధువులుషర్మీన్ ఖాన్ (సోదరి)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 7)1998 ఏప్రిల్ 17 - శ్రీలంక తో
చివరి టెస్టు2004 మార్చి 15 - వెస్టిండీస్ తో
తొలి వన్‌డే (క్యాప్ 9)1997 జనవరి 28 - న్యూజీలాండ్ తో
చివరి వన్‌డే2004 ఏప్రిల్ 2 - వెస్టిండీస్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2005/06Karachi
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మలిఎ
మ్యాచ్‌లు 3 40 46
చేసిన పరుగులు 69 391 517
బ్యాటింగు సగటు 13.80 11.17 13.25
100s/50s 0/0 0/0 0/0
అత్యధిక స్కోరు 35 38 38
వేసిన బంతులు 864 2,076 2,394
వికెట్లు 19 63 79
బౌలింగు సగటు 24.05 23.95 21.74
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 2 2 2
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1 0 0
అత్యుత్తమ బౌలింగు 7/59 5/35 5/35
క్యాచ్‌లు/స్టంపింగులు 7/– 7/– 8/–
మూలం: CricketArchive, 13 December 2021

షైజా సైద్ ఖాన్ 1969, మార్చి 18న పాకిస్తాన్లో కరాచీలోని ఒక సంపన్న కార్పెట్ వ్యాపారికి జన్మించింది. ఆమె, ఆమె సోదరి షర్మీన్ పాకిస్థాన్‌లో మహిళా క్రికెట్‌కు మార్గదర్శకులుగా పరిగణించబడ్డారు.[1] కరాచీలోని కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీలో చేరింది. తరువాత ష్రాప్‌షైర్‌లోని ఆక్టన్ బర్నెల్‌లోని కాంకర్డ్ కళాశాలలో చేరింది. యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్‌లో టెక్స్‌టైల్ ఇంజినీరింగ్‌ను అభ్యసించింది.

క్రికెట్ రంగం

మార్చు

1997 - 2004 మధ్యకాలంలో మూడు టెస్ట్ మ్యాచ్‌లు, 40 వన్ డే ఇంటర్నేషనల్స్‌లో పాక్ తరుపున ఆడింది. జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. ఆమె కరాచీ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[2][3]

మహిళల క్రికెట్ జట్టుకు మొదటి బ్రిటీష్‌యేతర కెప్టెన్‌గా అవతరించింది.[1] 1991లో మిడిల్‌సెక్స్ తరపున ఈస్ట్ ఆంగ్లియాతో జరిగిన మ్యాచ్‌లో కూడా ఆడింది, తన 11 ఓవర్లలో 6/39 తీసుకుంది.[4]

2004లో కరాచీలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 13/226తో ఒక టెస్ట్ మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలతో ప్రపంచ రికార్డును కలిగి ఉంది.[5][6][7] 13 వికెట్లు తీసిన సమయంలో ఆమె హ్యాట్రిక్ కూడా సాధించింది, ఇది మహిళల టెస్ట్ చరిత్రలో బెట్టీ విల్సన్ తర్వాత రెండవది.[8]

కరాచీలోని నేషనల్ స్టేడియంలో 23 వికెట్లతో మహిళల వన్డేలలో ఒకే మైదానంలో అత్యధిక వికెట్లు తీసిన రికార్డును 2019లో షబ్నిమ్ ఇస్మాయిల్ బద్దలు కొట్టే వరకు ఆమె రికార్డు సృష్టించింది.[9]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Strong arms: The story of Pakistan women's cricket".
  2. "Player Profile: Shaiza Khan". ESPNcricinfo. Retrieved 13 December 2021.
  3. "Player Profile: Shaiza Khan". CricketArchive. Retrieved 13 December 2021.
  4. "Middlesex Women v East Anglia Women, 12 June 1991". CricketArchive. Retrieved 12 December 2021.
  5. "Records | Women's Test matches | Bowling records | Best figures in a match | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2017-05-03.
  6. "Only Test: Pakistan Women v West Indies Women at Karachi, Mar 15-18, 2004 | Cricket Scorecard | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2017-05-03.
  7. "Pakistan draw despite heroics from Baluch and Shaiza". Cricinfo (in ఇంగ్లీష్). Retrieved 2017-05-03.
  8. "Records | Women's Test matches | Bowling records | Hat-tricks | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2017-05-03.
  9. "Records | Women's One-Day Internationals | Bowling records | Most wickets on a single ground | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2017-05-03.

బాహ్య లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=షైజా_ఖాన్&oldid=4016419" నుండి వెలికితీశారు