షోడశోపచారాలు
(షోడశోపచారములు నుండి దారిమార్పు చెందింది)
షోడశోపచారాలు హిందువులు షోడశోపచార పూజా విధానంలో దేవున్ని పూజిస్తారు. షోడశ అనగా పదహారు; ఉపచారాలు అనగా సేవలు. షోడశోపచారాలు తెలుగు వ్యాకరణంలో గుణ సంధి.
- ఆవాహనం
- ఆసనం
- పాద్యం
- ఆర్ఘ్యం
- ఆచమనీయం
- స్నానం
- వస్త్రం
- యజ్ఞోపవీతం
- గంధం
- పుష్పం
- ధూపం
- దీపం
- నైవేద్యం
- తాంబూలం
- నమస్కారం
- ప్రదక్షిణం
ఉపచార విధానం పూజా విధానంలో ఇంటికి వచ్చిన పెద్దలను ఎలా గౌరవిస్తారో అలానే షోడశోపచారములలో కూడా భగవానుని అలాగే గౌరవిస్తారు. అలా పూజా పరంగా భగవానుని మర్యాద చేయడం ఉపచార విధానం.
- ఆవాహనము -- మనస్ఫూర్తిగా ఇంట్లోకి ఆహ్వానించడం
- ఆసనము -- వచ్చిన వారిని కూర్చోబెట్టడం
- పాద్యము -- కాళ్ళు కడుగుకొనేందుకు నీళ్ళివ్వడం
- ఆర్ఘ్యము -- చేతులు శుభ్రపరచడం
- ఆచమనీయము -- దాహమునకు నీళ్ళివ్వడము
- స్నానము -- ప్రయాణ అలసట తొలగుటకు స్నానింపచేయడం
- వస్త్రము -- స్నానానంతరము పొడి బట్టలివ్వడం
- యజ్ఞోపవీతము -- మార్గమధ్యలో మైల పడిన యజ్ఞోపవీతమును మార్చడం