సంకట మోచన్ హనుమాన్ దేవాలయం (వారణాసి)
సంకట మోచన్ హనుమాన్ ఆలయం, ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో ఉన్న హనుమంతుడికి అంకితం చేయబడిన దేవాలయం. ఇది అస్సీ నది ఒడ్డున ఉంది. "సంకట్ మోచన్" అంటే "సమస్యల నివారిణి" అని అర్థం.[1]
సంకట మోచన్ హనుమాన్ దేవాలయం | |
---|---|
संकट मोचन हनुमान मंदिर | |
వారణాసి జిల్లా మ్యాప్‌లో ఆలయ స్థానం | |
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 25°16′56″N 83°00′00″E / 25.2821062°N 82.9999769°E |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
ప్రదేశం | వారణాసి |
సంస్కృతి | |
దైవం | హనుమంతుడు, శ్రీ రాముడు |
వాస్తుశైలి | |
నిర్మాణ శైలులు | హిందూ ఆర్కిటెక్చర్ |
చరిత్ర, నిర్వహణ | |
నిర్మించిన తేదీ | 16వ శతాబ్దం |
సృష్టికర్త | తులసీదాస్ |
చరిత్ర
మార్చుఆలయ కట్టడ పనులు 16 వ శతాబ్దంలో ప్రసిద్ధ హిందూ ధర్మ బోధకుడు, కవి, సాధువు శ్రీ గోస్వామి తులసీదాస్ ద్వారా ప్రారంభించబడ్డాయి.[2]
తీవ్రవాద సంఘటన
మార్చుసాధారణంగా భక్తులు సందర్శిస్తున్న రోజుల్లోనే వారణాసిలో 2006 మార్చి 7 న మూడు పేలుళ్లు సంభవించాయి. దీని వల్ల తీవ్రంగా నష్టం జరిగింది.[3]
ప్రస్తుత ఆలయం
మార్చునిరంతరం ప్రస్తుత ఆలయంలో భక్తులు హనుమాన్ చాలీసా పఠిస్తూ దైవ దర్శనం చేసుకుంటూ ఉంటారు. 2006 తీవ్రవాద సంఘటన తరువాత, ఒక శాశ్వత పోలీసు పోస్ట్ ను ఆలయం లోపల ఏర్పాటు చేశారు.[4]
సంకట్ మోచన్ ఫౌండేషన్
మార్చుసంకట్ మోచన్ ఫౌండేషన్ (SMF) వీర భద్ర మిశ్రా, ఆలయ మహంత్ (పూజారి) ద్వారా 1982 లో స్థాపించబడింది, ఇది గంగా నదిని రక్షించేందుకు పనిచేస్తుంది.[5]
సంకట్ మోచన్ సంగీత్ సమరోహ
మార్చుఏప్రిల్ నెలలో ప్రతి సంవత్సరం, ఆలయం "సంకట్ మోచన్ సంగీత్ సమరోహ" పేరుతో ఒక శాస్త్రీయ సంగీత, నృత్య సంగీత ఉత్సవం నిర్వహిస్తుంది. దీనిలో భారతదేశంలోని సంగీతకారులు, ప్రదర్శకులు పాల్గొంటారు. ఈ పండుగ 88 సంవత్సరాల క్రితం నుండి నిర్వహించబడుతోంది.[6]
మూలాలు
మార్చు- ↑ Chaturvedi, B. K. (31 December 2002). Tulsidas (Mystics Saints of India). Allahabad: Books For All. ISBN 8173862508.
- ↑ Callewaert, Winand M. (2000). Banaras: vision of a living ancient tradition. Hemkunt Press. p. 90. ISBN 81-7010-302-9.
- ↑ "Blasts in Sankatmochan temple and railway station kill dozen, several injured". Indian Express. 8 March 2006.
- ↑ "Varanasi temple gets permanent police post". Indian Express. 14 March 2006.
- ↑ "Adult Award Winner in 1992: Veer Bhadra Mishra". en:Global 500 Roll of Honour website. Archived from the original on 2011-06-22. Retrieved 2022-04-17.
- ↑ "Sankat Mochan music concert begins". The Times of India. 4 Apr 2010.