సంఖ్యాకాండం
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
సంఖ్యాకాండం (ఎడారి ప్రయాణాలు)
మార్చుపరిచయం పేరు: యూదులు ఈ పుస్తకాన్ని మొదటి వచనంలోని “ఎడారిలో” అనే పేరుతో పిలిచేవారు. పాత తెలుగు బైబిలులోని పేరు గ్రీకు తర్జుమా అయిన “సెప్టుయజింట్” నుంచి వచ్చినది, దానికంటే హీబ్రూ భాషలో ఉన్న పేరు అర్థవంతమైనది. ఈ పుస్తకాన్ని సంఖ్యాకాండం అనడంకంటే “ఎడారి ప్రయాణాలు” అనడమే మేలనిపిస్తుంది. రచయిత, వ్రాసినకాలం: ఆదికాండంలో పరిచయం చూడండి. ముఖ్యాంశం: ఎడారిలో ఇస్రాయేల్‌ప్రజలు దేవుని శిక్షణలో. ఎడారి సంచారం దేవుడు వీరికిచ్చిన శిక్ష అయినా ఈ శిక్ష ద్వారా దేవుడు వారికి (మనకు కూడా) ముఖ్యమైన పాఠాలెన్నో నేర్పాడు. అవిశ్వాసం, దేవుని విధానాలకు వ్యతిరేకంగా సణగడం ఇలాంటి వాటివల్ల కష్టాలు, నష్టాలు వస్తాయనీ, దేవుని మీద నమ్మకం, విధేయతవల్ల ఆశీర్వాదాలు కలుగుతాయనీ దేవుడు చూపించాడు. ఎడారిలో గడిపిన 40 సంవత్సరాలలోనూ దేవుడు తాను వారికి చేసిన వాగ్దానాల పట్ల నమ్మకత్వం కనపరుస్తూ ఆయన ప్రజలు వాగ్దాన దేశంలో అడుగుపెట్టేలా వారిని సిద్ధం చేశాడు. విషయసూచిక
జనాభా లెక్కలు 1:1-54 ప్రయాణాల కోసం గోత్రాలు నడిచే క్రమం, మకాం చేసే ఏర్పాటు 2:1-34 లేవీ గోత్రం 3:1-51 లేవీ గోత్రంలోని మూడు కుటుంబాల విధులు 4:1-33 లేవీ గోత్రంలోని మూడు కుటుంబాల వారిని లెక్కించడం 4:34-49 శిబిరంలో గడిపే జీవితం గురించిన ఆదేశాలు 5:1-31 నాజీర్ వారు 6:1-21 యాజులు ప్రజలను దీవించవలసిన పద్ధతి 6:22-27 గోత్రాల నాయకుల అర్పణలు 7:1-89 లేవీ గోత్రం ప్రతిష్ఠ 8:1-26 ఈజిప్ట్ తరువాత మొదటి పస్కాపండుగ 9:1-14 దేవుని మేఘం 9:15-23 బూరల సంకేతాలు 10:1-10 ఇస్రాయేల్ ప్రజలు సీనాయిని వదలిపెట్టడం 10:11-36 ప్రజల సణుగుణ్ణి మంటలతో శిక్షించడం 11:1-3 దేవుడు వారికి పూరేడు పిట్టలతోపాటు శిక్ష ఇవ్వడం 11:4-35 మిర్యాం, అహరోను మోషేకు విరోధంగా లేవడం 12:1-16 కనానులోకి గూఢచారులు వెళ్ళడం 13:1-25 గూఢచారుల చెడు సమాచారం 13:26-33 కాదేషు–బర్నేయాలో ఇస్రాయేల్ ప్రజల తిరుగుబాటు 14:1-10 దేవుని కోపం, మోషే ప్రార్థన 14:11-19 దేవుడు శిక్షను నియమించడం 14:20-38 ఇస్రాయేల్‌వారు మళ్ళీ అవిధేయత చూపడం 14:39-45 వివిధ అర్పణలకు నియమాలు 15:1-29 బుద్ధిపూర్వకంగా గర్వంతో చేసిన పాపానికి శిక్ష 15:30-36 బట్టలు కుచ్చులు 15:37-41 కోరహు, అతని స్నేహితుల తిరుగుబాటు 16:1-22 కోరహుపై, అతని స్నేహితుల పై శిక్ష 16:25-35 ఇస్రాయేల్ మళ్ళీ సణగడం, తిరుగుబాటు చేయడం 16:41-50 అహరోను కర్ర చిగిర్చడం 17:1-12 లేవీవారి, యాజుల బాధ్యతలు 18:1-7 లేవీవారి కోసం, యాజుల కోసం పోషణ విధానం 18:9-32 అశుద్ధతను తొలగించే నీళ్ళు 19:1-22 కోపంలో మోషే అవిధేయత పూర్వకంగా రెండోసారి బండను కొట్టడం 20:2-11 మోషే అవిధేయతకు దండన 20:12 ఎదోంవారు ఇస్రాయేల్‌వారిని తమ దేశం గుండా వెళ్ళనివ్వక పోవడం 20:14-21 అహరోను మరణం 20:22-29 కంచు పాము 21:4-9 మోయాబుకు ప్రయాణం 21:10-20 సీహోను, ఓగుల పరాజయం 21:21-35 ఇస్రాయేల్‌ను శపించడానికి బాలాకు బిలాము కోసం కబురంపించడం 22:1-41 బిలాము తిరస్కరించడం 22:8-13 బిలాము ఒప్పుకోవడం 22:14-20 బిలాము గాడిద 22:21-31 బిలాము సందేశాలు 23:1 – 24:25 బయల్ పెయోర్ దగ్గర ఇస్రాయేల్ పాపం 25:1-18 రెండోసారి జనాభా లెక్కలు 26:1-65 కుమార్తెలు వారసత్వం పొందడానికి హక్కు 27:1-11 మోషే తరువాత నాయకుడు 27:12-23 అర్పణలు, బలులూ, సంవత్సరిక పండుగలను గురించిన చట్టాలు 28:1 – 29:40 మొక్కుబడి 30:1-16 మిద్యానుతో యుద్ధం 31:1-54 ఇస్రాయేల్‌వారు కొందరు తమ వాటాను యొర్దాను తూర్పుప్రాంతంలో కోరుకోవడం 32:1-42 ఈజిప్ట్‌నుండి మోయాబువరకూ జరిగిన ప్రయాణాల జాబితా 33:1-58 కనాను దేశంలో ఇస్రాయేల్ ప్రజల సరిహద్దులు 34:1-29 లేవీవారి కోసం పట్టణాలు 35:1-5 శరణు పట్టణాలు 35:6-34 కుమార్తెల వారసత్వం 36:1-13