సంగారెడ్డి పురపాలకసంఘం

సంగారెడ్డి జిల్లాకు చెందిన పురపాలక సంఘం
(సంగారెడ్డి పురపాలక సంఘం నుండి దారిమార్పు చెందింది)

సంగారెడ్డి పురపాలక సంఘం, సంగారెడ్డి జిల్లాకు చెందిన పురపాలక సంఘాలలో ఒకటి. 1954లో ఏర్పడిన ఈ పురపాలక సంఘం ప్రస్తుతం మొదటిశ్రేణి పురపాలక సంఘంగా కొనసాగుతోంది. 2011 గణన ప్రకారం పురపాలక సంఘం పరిధిలోని జనాభా 71426 కాగా, 2014 మార్చి నాటికి 52556 ఓటర్లున్నారు. ప్రస్తుతం ఇందులో 31 వార్డులు ఉన్నాయి.

ఆదాయ-వ్యయములు

మార్చు

2010-11 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ పురపాలక సంఘం ఆదాయం రూ. 976.45 కోట్లు కాగా వ్యయము రూ. 806.14 కోట్లు.[1]

ఎన్నికలు

మార్చు

1954 నుంచి 2005 వరకు జరిగిన 9 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 5, భారతీయ జనతాపార్టి 3, తెరాస ఒక్కసారి చైర్మెన్ పదవులను పొందాయి. ఈ పురపాలక సంఘం చైర్మెన్‌గా పనిచేసిన లక్ష్మన్‌జీ తదుపరి కాలంలో ఆందోల్ శాసన సభ్యులు కూడా ఎన్నికయ్యారు.

2014 ఎన్నికలు

మార్చు

2014 మార్చి 30న 10వ సారి ఎన్నికలు జరిగాయి.

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-04-09. Retrieved 2014-04-04.

వెలుపలి లంకెలు

మార్చు