సంగీత రత్నాకరము

సంగీత రత్నాకరము ను శార్ఙ దేవుడు 13 వ శతాబ్దంలో రచించాడు. అటు హిందుస్తానీ సంగీతానికి ఇటు కర్ణాటక సంగీతానికి ఇది ప్రామాణిక గ్రంథం. వేదకాలం నుంచీ ముస్లింల ప్రాబల్యం వరకూ గల మధ్య కాలంలో సంగీతానికి గల స్థితిగతులను తెలియజెప్పే గ్రంథమిది. దీనినే సప్తాధ్యాయి అని కూడా అంటారు. ఇందులో 7 అధ్యాయాలు ఉన్నాయి. అవి వరుసగా :

  1. స్వరగతాధ్యాయము
  2. రాగవివేకాధ్యాయము
  3. ప్రకీర్ణకాధ్యాయము
  4. ప్రబంధాధ్యాయము
  5. తాళాధ్యాయము
  6. వాద్యాధ్యాయము
  7. నర్తనాధ్యాయము : ఈ చివరి అధ్యాయం నాట్యం గురించి చెబుతుంది.

ఈ గ్రంథం పై వ్రాయబడిన వ్యాఖ్యానాలు

మార్చు
  1. సింహభూపాలుని సంగీత సుధాకరము
  2. కల్లినాథుని కళానిధి