కర్నల్ సంతోష్ మహాదిక్ 41-రాష్ట్రీయ రైఫిల్స్‌లో కమాండింగ్ అధికారిగా ఉండేవారు. భారత్-పాక్ సరిహద్దుల్లో ఉగ్రవాదులతో జరిగిన బీకర పోరులో భారత మిలిటరీ కల్నల్ సంతోష్ మహాదిక్ అమరుడైనాడు. సంతోష్ ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానంతో వారిని పట్టుకునేందుకు బృందంతో కలిసి వెళ్లారు. ఉగ్రవాదులతో జరిపిన కాల్పుల్లో సంతోష్ త్రీవంగా గాయపడగా.ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నవంబరు 17 2015 న మృతిచెందారు.[1] [2]

Santosh Mahadik
సంతోష్ మహాదిక్
జననం(1977-01-15)1977 జనవరి 15
పొగర్వాడి, సతారా, మహారాష్ట్ర, భారతదేశం
మరణం2015 నవంబరు 17(2015-11-17) (వయసు 38)
కుప్వారా, జమ్మూ, కాశ్మీర్
మరణ కారణంటెర్రరిస్టుల ఎదురు కాల్పులు
జాతీయతభారతీయుడు
విద్యాసంస్థసైనిక స్కూలు, సతారా
వృత్తికర్నల్, భారత సైనికదళం
క్రియాశీల సంవత్సరాలు1977–2015
రాష్ట్రీయ రైపిల్స్ 41 విభాగంలొ కమాండిగ్ ఆఫీసరు
జీవిత భాగస్వామిసరస్వతి
పిల్లలు2

జీవిత విశేషాలు మార్చు

ఆయన సొంత రాష్ట్రం మహారాష్ట్ర సతరాలోని సైనిక స్కూల్‌లో చదవి ఆర్మీలో చేరారు. 38 ఏళ్ల సంతోష్‌ మహాదిక్‌ ఆర్మీ కమాండింగ్‌ అధికారి. ఈ ఏడాది జరిగిన ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ కమాండింగ్‌ స్థాయి అధికారి చనిపోవడం ఇది రెండోసారి. విశిష్ఠమైన పారా స్పెషల్ ఫోర్సెస్ అధికారి అయిన కల్నల్ సంతోహ్ మహదిక్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఎన్నో ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించారు. జమ్ముకశ్మీర్‌లోనూ, ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఉగ్రవాదులు దాగున్న ప్రదేశాల్లోకి వెళ్లి ఆపరేషన్లు నిర్వహించిన సాహసం ఆయనది. 2003లో ఈశాన్య భారతంలో నిర్వహించిన ఆపరేషన్ రినోకు గాను ఆయనకు సేనా శౌర్య పతకం లభించింది. కల్నల్‌ గా పదోన్నతి పొందిన తర్వాత కూడా ఆయన సాహసోపేత ఆపరేషన్లను ఆపలేదు. జమ్ముకశ్మీర్‌లో తిరుగుబాటుదారులను అణచివేసేందుకు ఆర్మీ ప్రత్యేకంగా చేపట్టిన ఆపరేషన్‌లో భాగమైన రాష్ట్రీయా రైఫిల్స్ బెటాలియన్‌కు ఆయన నేతృత్వం వహించారు. ఎల్‌వోసీ దాటి వచ్చిన ఉగ్రవాదుల తరుముతూ వెళ్లిన దళానికి నేతృత్వం వహించిన కల్నల్ మహాదిక్‌ ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందారు.[3]

వ్యక్తిగత జీవితం మార్చు

మహాదిక్‌కు భార్య సరస్వతి, 11 ఏళ్ల కూతురు, ఐదేళ్ల కొడుకు ఉన్నారు.[4]

మూలాలు మార్చు

  1. http://www.hindustantimes.com/india/colonel-santosh-mahadik-dies-after-gunbattle-in-kashmir/story-vDKmbeHrRr4xe8yqQXGFVO.html
  2. http://www.ndtv.com/india-news/colonel-seriously-injured-in-kupwara-encounter-1244320
  3. "అమరవీరుడు కల్నల్ సంతోష్ మహాదిక్‌కు సైనిక లాంఛనాలతో అశ్రునివాళులు". Archived from the original on 2015-11-24. Retrieved 2016-01-09.
  4. "కర్నల్ మహాదిక్ కు కన్నీటి వీడ్కోలు". Archived from the original on 2016-03-05. Retrieved 2016-01-09.

ఇతర లింకులు మార్చు