సంధ్యారాగం ( 2013 తెలుగు సినిమా )

మూలాలు మార్చు

దస్త్రం:సంధ్యారాగం సినిమా విడుదలైన చంద్రమహల్ ధియేటర్ శ్రీకాకుళం

సంధ్యారాగం 2013లో విడుదలయిన  తెలుగు చలనచిత్రం. శ్రీనివాస్ నేదునూరి  ఈ చిత్ర రచయిత, దర్శకులు. వైష్ణవి ఫిలిం కార్పొరేషన్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో సుహాస్ సిస్టు , కావ్య శ్రీ , పావలా శ్యామల, జాకీ  ముఖ్య పాత్రల్లో నటించారు.

కథ మార్చు

సీతాపతి రామలక్ష్మి  వృద్ధదంపతులు. ఇద్దరు కొడుకులు ( జాకీ , ఆకెళ్ళ గోపాల కృష్ణ ) ఉన్నా తల్లిదండ్రులిద్దరిని చెరో నెలా ఒక్కో దగ్గర ఉండేటట్లు పంచుకుంటారు. (రామలక్ష్మి )అత్తను పనిమనిషికన్నా హీనంగా చూస్తారు కోడళ్ళు. ముసలాళ్ళిద్దరు ఒకరిని ఒకరు కలుసుకుని చూసుకోవడానికి కూడా  కుదరని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో తన షష్టి పూర్తిని చేసుకోవాలని , అది కూడా తన మొదటి రాత్రి జరిగిన ఎదుర్లంక గ్రామంలో గోదారి ఒడ్డున  ఇంట్లో  జరుపుకోవాలని అందుకు తన పెళ్లి చేసిన బాల్య స్నేహితుడు కొండబాబు సహాయం కోరతాడు. ఇదిలా ఉండగా .. ఓ రోజు తను రోడ్డుపై వెళ్తూ ఉంటె ఓ సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటుంది. అక్కడకు వెళ్లి ఆ సినిమా డైరెక్టర్ ( ఫణిప్రకాష్ ) ని కలిసి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే మంచి కథ ఉందని .. ఒకసారి వినమని రిక్వెస్ట్ చేస్తాడు. అందుకు డైరెక్టర్ ఒప్పుకోవడంతో సీతాపతి కథ చెబుతాడు.

ఆ కథ సీతాపతి జీవితం. సీతాపతి రామలక్ష్మి చిన్ననాటి స్నేహితులు.రామలక్ష్మి ఊరి ప్రసిడెంట్ కూతురు. సీతాపతి ఓ చిన్న వ్యవసాయదారుడి కొడుకు.  సీతాపతి , రామలక్ష్మి పెరిగి పెద్దవాళ్లవుతున్నా  చాలా స్నేహంగా ఉండటం రామలక్ష్మి నాన్నమ్మ ( పావలా శ్యామల ) కు నచ్చదు. పైగా ఈ ఇంట్లో పని చేస్తున్న సూరిగాడికి ఈ జంట తోటలో గడపడం చూసి ప్రెసిడెంట్ కు చెప్పడం జరుగుతుంది. ఊరిలో ఎవరూ  మూడు రోజుల పాటు సీతాపతితో మాట్లాడకూడదని, కొరడా దెబ్బలు కొట్టి చెట్టుకి కట్టేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో  రాత్రికి రాత్రే  రామలక్ష్మి సీతాపతి ఊరొదిలి వెళ్లిపోతారు. ప్రాణ స్నేహితుడు కొండబాబు వీరిద్దరికి పెళ్లిచేసి జీవితంలో నిలదొక్కుకునేటట్లు చేస్తాడు. ఆనాడు కలిసి బ్రతకడానికి పెద్దలను ఎదిరించి ఊరొదిలి వచ్చేసిన ఈ జంట .. ఈ 60 ఏళ్ల వయసులో కలిసి బ్రతకడానికి పిల్లలను ఎదిరించి  షష్టిపూర్తి కోసం ఈ జంట ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోతారు,  కథ ప్రీ క్లైమాక్స్  వరకు చెప్పి మిగిలిన కథ ఆలోచించి చెప్తానని డైరెక్టర్ ని ఒప్పించి వెళతాడు సీతాపతి. ఆ తరువాత సీతాపతి కోసం  డైరెక్టర్ ఎదురుచూస్తూ ఉంటాడు  ఓ రోజు సీతాపతి కోసం ఇంటి ల్యాండ్ లైన్ నంబర్ కి కాల్ చేసి కనుక్కునే టైంలో పెద్ద కోడలు కాల్ లిఫ్ట్ చేస్తుంది. అప్పటికే పేరెంట్స్ మిస్ అయ్యారని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దామని రకరకాల ఆలోచనల్తో ఉంటారు. ఆ కోపం అంతా డైరెక్టర్ మీద చూపిస్తుంది పెద్దకోడలు.

కొండబాబు ఇంటికి చేరిన సీతాపతి-రామలక్ష్మి దంపతులను కొండబాబు ఆతిధ్యం ఇచ్చి  షష్టిపూర్తి కార్యక్రమం చేస్తాడు. ఆ తరువాత ఈ జంట వృద్ధాశ్రమానికి  వెళ్లాలని నిర్ణయించుకుంటారు. వీరితో పాటే కొండబాబు కూడా వెళతాడు. వృద్ధాశ్రమం నుంచి సినిమా డైరెక్టర్ కి ఫోన్ చేసి కథకు కొనసాగింపు చెబుతాడు సీతాపతి. మళ్ళీ క్లైమాక్స్  పోస్ట్ ఫోన్ చేస్తాడు సీతాపతి.

ఇంతలో ఓ టెలివిజన్ ఛానల్ వాళ్ళు వృద్ధాశ్రమాలు - వృద్ధుల మనోగతాలు కార్యక్రమం చిత్రికరించడానికి ఈ ఆశ్రమానికి వస్తారు.సీతాపతి,రామలక్ష్మి,కొండబాబు లతో పాటు వృద్ధులంతా తమ పిల్లలతో పడిన కష్టాలను చెప్తారు. టీవీల్లో ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. పియస్ లో ఫిర్యాదు చేద్దామని అనుకుంటున్న సీతాపతి కొడుకులు , కోడళ్ళు టివిలో ప్రోగ్రాం చూసి వృద్ధాశ్రమానికి వస్తారు. తల్లిదండ్రులను ఇంటికి వచ్చెయ్యమంటారు. అయినా వెళ్లరు. కోపంతో వెనుతిరిగిపోతారు పిల్లలు.

ఇలాంటి పరిస్థితిలో పిల్లల దగ్గరకు వెళ్లాలా  ? వృద్దాశ్రమంలోనే ఉండాలా ? అనే మీమాంసలో నిద్రలోనే చనిపోతాడు సీతాపతి. భర్త మరణాన్ని తట్టుకోలేక రామలక్ష్మి కూడా కుప్పకూలిపోతుంది . మంచి క్లైమాక్స్  ఇద్దరూ  కలిసి ఆలోచిద్దామని ఆశ్రమానికి వచ్చిన దర్శకునికి సితాపతి దంపతులు విగతజీవులుగా పడి ఉండటం చూసి చలించిపోతాడు. సీతాపతి పిల్లలు వచ్చి అంత్యక్రియలు చేయడంతో కథ ముగుస్తు


పాటలు మార్చు

సంధ్యారాగం చిత్రానికి సాకేత్ సాయిరామ్ సంగీతం అందించగా సాగర్ నారాయణ్ , బాలబాస్కర్ సాహిత్యాన్ని అందించారు. ఈ చిత్రంలోని పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా 19 నవంబర్ 2012 న తెలుగు ఫిలిం ఛాంబర్ లో  దర్శకులు సాగర్ , నిర్మాత,నటుడు అశోక్ కుమార్, నిర్మాత జెవి మోహన్ గౌడ్ చేతుల మీదుగా  విడుదలయ్యాయి.

విడుదల మార్చు

సంధ్యారాగం సినిమా 26 ఏప్రిల్ 2013 న ధియేటర్లో విడుదలయింది U/A సెన్సార్ సర్టిఫికెట్ సెన్సార్ బోర్డు వారిచే జారీ చేయబడింది.

దస్త్రం:సంధ్యారాగం 2013 తెలుగు ఫిలిమ్.jpeg