సంపన్న శ్రేణి (Creamy layer - క్రీమీ లేయర్) అనే పదాన్ని ఇతర వెనుకబడిన తరగతుల (ఒబిసిలు - Other Backward Classes - OBCs) ) యొక్క ధనిక, బాగా చదువుకున్న సభ్యుల తారతమ్యమును సూచించడానికి భారత రాజకీయాల్లో ఉపయోగిస్తారు. సంపన్న శ్రేణి అనగా బాగా ఆదాయమున్నవారు అని అర్థం. వీరిని ఉన్నత వర్గం, సంపన్న వర్గం అని కూడా అంటారు.

2013 సంవత్సరం నుంచి వేతనాలు, వ్యవసాయ ఆదాయం మినహాయించి మిగతా మార్గాల్లో వచ్చే వార్షిక ఆదాయం రూ.6 లక్షలకు పైన ఉన్నవారు బీసీ క్రీమీలేయర్ (బీసీ సంపన్న శ్రేణి) పరిధిలోకి వస్తారు.

రిజర్వేషన్

మార్చు

భారతదేశంలో రిజర్వేషన్ ప్రకారం ఒబిసి లకు కొన్ని ఉద్యోగాలు కేటాయిస్తారు. అయితే సంపన్న శ్రేణి క్రింద అభ్యర్థుల తల్లి దండ్రులు వచ్చినట్లయితే వారికి రిజర్వేషన్ ఇస్తున్నారా, లేదా అనేది ఆయా ఉద్యోగ ప్రకటనలలో తెలియజేస్తారు.