సంయుక్త సంఖ్య
సంయుక్త సంఖ్య ఒక ధన పూర్ణాంకం. దీనిని రెండు చిన్న ధన పూర్ణాంకాల లబ్దంగా రాయవచ్చును. ఆ సంఖ్యను లబ్దంగా రాసేటప్పుడు గుణకం, గుణ్యాలలో 1 లేదా అదే సంఖ్య ఉండకుండా, వేరొక ధనపూర్ణాంకాల లబ్దంగా రాసే విధంగా ఉండాలి.[1][2] ఉదాహరణకు 10 సంయుక్త సంఖ్య అవుతుంది. దీనిని 2,5 ల లబ్దంగా రాయవచ్చు. ప్రతీ ధన పూర్ణాంకం ప్రధాన సంఖ్య, సంయుక్త సంఖ్య లేదా 1 అయి ఉంటుంది. కనుక 1, ప్రధాన సంఖ్యలు కాని సంఖ్యలన్నింటినీ సంయుక్త సంఖ్యలుగా చెప్పుకోవచ్చు.[3][4]
ఉదాహరణకు, 14 సంయుక్త సంఖ్య అవుతుంది. దీనిని 2,7 ల లబ్దంగా రాయవచ్చు. అదే విధంగా 2, 3 లు సంయుక్త సంఖ్యలు కావు. ఎందుకనగా ఇవి 1, అదే సంఖ్యలతో మాత్రమే భాగించబడతాయి.
150 వరకు ఉన్న సంయుక్త సంఖ్యలు:
- 4, 6, 8, 9, 10, 12, 14, 15, 16, 18, 20, 21, 22, 24, 25, 26, 27, 28, 30, 32, 33, 34, 35, 36, 38, 39, 40, 42, 44, 45, 46, 48, 49, 50, 51, 52, 54, 55, 56, 57, 58, 60, 62, 63, 64, 65, 66, 68, 69, 70, 72, 74, 75, 76, 77, 78, 80, 81, 82, 84, 85, 86, 87, 88, 90, 91, 92, 93, 94, 95, 96, 98, 99, 100, 102, 104, 105, 106, 108, 110, 111, 112, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 128, 129, 130, 132, 133, 134, 135, 136, 138, 140, 141, 142, 143, 144, 145, 146, 147, 148, 150.
సంయుక్త సంఖ్యను రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రధాన సంఖ్యల లబ్దంగా రాయవచ్చు.[5] ఉదాహరణకు సంయుక్త సంఖ్య 299 ను 13 × 23 గా రాయవచ్చు. సంయుక్త సంఖ్య 360 ను 23 × 32 × 5 గా రాయవచ్చు. ఒక సంఖ్యను కారణాంకాల క్రమం ప్రకారం రాయవచ్చు. ఈ విధానాన్ని అంకగణిత ప్రాథమిక సూత్రం అంటారు.[6][7][8][9]
ఒక సంఖ్యను కారణాంకాలుగా విభజిమకుండా అది ప్రధాన లేదా సంయుక్త సంఖ్యలో తెలుసుకొనే అనేక విధానాలు కూడా ఉన్నాయి.
ఇవి కూడా చూడండి
మార్చునోట్సు
మార్చు- ↑ Pettofrezzo & Byrkit (1970, pp. 23–24)
- ↑ Long (1972, p. 16)
- ↑ Fraleigh (1976, pp. 198, 266)
- ↑ Herstein (1964, p. 106)
- ↑ Long (1972, p. 16)
- ↑ Fraleigh (1976, p. 270)
- ↑ Long (1972, p. 44)
- ↑ McCoy (1968, p. 85)
- ↑ Pettofrezzo & Byrkit (1970, p. 53)
మూలాలు
మార్చు- Fraleigh, John B. (1976), A First Course In Abstract Algebra (2nd ed.), Reading: Addison-Wesley, ISBN 0-201-01984-1
- Herstein, I. N. (1964), Topics In Algebra, Waltham: Blaisdell Publishing Company, ISBN 978-1114541016
- Long, Calvin T. (1972), Elementary Introduction to Number Theory (2nd ed.), Lexington: D. C. Heath and Company, LCCN 77-171950
- McCoy, Neal H. (1968), Introduction To Modern Algebra, Revised Edition, Boston: Allyn and Bacon, LCCN 68-15225
- Pettofrezzo, Anthony J.; Byrkit, Donald R. (1970), Elements of Number Theory, Englewood Cliffs: Prentice Hall, LCCN 77-81766