(Urdu: سابودانا;Hindi: साबुदाना; Gujarati: સાબુદાણા; Telugu: సగ్గు బియ్యం Tamil : ஜவ்வரிசி).

సగ్గు బియ్యం

మార్చు
 
సగ్గు బియ్యం తయారికి కావలసిన కర్ర పెడలము దుంపలు
 
న్యూ గినియా లోని సగ్గుబియ్యం తాటి చెట్లు


సగ్గు బియ్యం అనగానె అదేదో ఒక పంట నుండి వచ్చిందని లేదా మొక్కలకు పండుతుందని అనుకుంటారు చాల మంది. కానీ నిజానికి ఇది కేవలము పరిశ్రమలలో తయారవుతుంది. ఈ సగ్గు బియ్యాన్ని దేశ వ్వాప్తంగా అనేక వంటకాలలో వాడు తుంటారు. కాని సగ్గు బియ్యం తయారయ్యెది కేవలం మూడు రాష్ట్రాలలోనె. మొత్తం ఉత్పత్తిలో తమిళనాడు రాష్ట్రంలో 70 శాతం. మిగతా 30 శాతం కేరళ, ఆంధ్ర ప్రదేశ్ లది. ఆంధ్ర ప్రదేశ్ లో తూర్పు గోదావరి జిల్లాలో సామర్ల కోటకు చుట్టు పక్కల సుమారు ఇరవై అయిదు కిలోమీటర్ల పరిధిలో మొత్తం 40 సగ్గు బియ్యం తయారి మిల్లులున్నాయి. తమిళ నాడులో సుమారు 500 మిల్లులున్నాయి.

సగ్గు బియ్యాన్ని ఎలా తయారు చేస్తారు?

మార్చు
 
సగ్గుబియ్యం పిండి వడపోత

సగ్గు బియ్యం తయారికి ముడి సరుకు కర్ర పెండలము. దీన్ని భూమిని నుండి త్రవ్వి బయటకు తీసిన 24 గంటల లోపు సగ్గు బియ్యం తయారీ కేంద్రానికి చేర్చాలి. ఆ దుంపలను నీటిలో బాగా శుభ్రంచేసి దానిపై నున్న తొక్కను యంత్రాలతో తొలిగిస్తారు. గతంలో ఈపనిని స్త్రీలు చేసే వారు. తొక్క తీసిన దుంపలను మరొక్కసారి నీళ్ళలో శుభ్ర పరుస్తారు. అప్పుడు ఆ దుంపలను క్రషర్ లో పెట్టి పాలను తీస్తారు. చెరుకు నుండి చెరుకు రసాన్ని తీసే పద్ధతిలోనే ఈ దుంపలనుండి పాలను తీస్తారు. దుంపల నుండి వచ్చిన పాలు ఫిల్టర్ లలోనికి, అక్కడి నుండి సర్క్యులేటింగ్ చానల్స్ లోనికి వెళతాయి. ఈ క్రమంలో - పాల లోని చిక్కని పదార్థం ముద్దలా ఉంటుంది. దానితోనే సగ్గు బియ్యం తయారు చేస్తారు. ఈ పిండిని వివిధ రకాల పరిమాణంలో రంద్రాలున్న జల్లెడ లాంటి పాత్రలోకి వెళుతుంది. ఆ జల్లెడ అటు ఇటు కదులు తున్నందున ఆ జల్లెడ రంద్రాలనుండి తెల్లటి పూసల్లాగా జల జలా రాలి పడతాయి. అప్పుడు అవి మెత్తగా వుంటాయి. వాటిని పెద్ద పెనం మీద వేడి చేస్తారు. ఆ తరువాత వాటిని ఆరుబయట ఎండలో ఆర బెడతారు. ఇలా సుమారు 500 కిలోల దుంపల నుండి 100 కిలోల సగ్గు బియ్యం మాత్రమే తయారవుతాయి. ఇది సగ్గు బియ్యం తయారీ విధానం [1]

మూలాలు

మార్చు
  1. మూలం: ఆది వార ఆంధ్ర జ్యోతి 3 జూన్, 2012.

బాహ్య లింకులు

మార్చు