పురాతన కాలాలలో ఉద్భవించిన రూపంలో నేటివరకు శరీర నిర్మాణంలో ఎటువంటి మార్పు చెందకుండా జీవించివున్న జీవులను సజీవ శిలాజాలు (Living Fossils) అంటారు[1].

భూగోళంపై జీవజాతి పరిణామ క్రమంలో చాలా జీవజాతులు పురాతన కాలానికి, ఇప్పటికి ఎంతో మార్పు చెందాయి. కనుక వాటి పురాతన రూపం శిలాజాల వల్ల మాత్రమే తెలుస్తుంది. కాని కొన్ని జీవజాతులు పెద్దగా మార్పులు చెందలేదు. These species have all survived major extinction events, and generally retain low taxonomic diversities.అంటే వాటి పురాతన శిలాజాలను బట్టి అవి అప్పుడు ఎలా ఉండేవనిపిస్తుందో ఇప్పుడు బ్రతికి ఉన్న ఆ జాతి జీవులు కూడా ఇంచుమించు అలానే ఉన్నాయన్నమాట. పరిణామ క్రమంలో ఒక జన్యు అవరోధం (genetic bottleneck) ఏర్పడినపుడు కొన్ని జీవజాతులు వివిధ దిశలలో విస్తరిస్తాయి (successfully radiates forming many new species after a possible genetic bottleneck). ఇలాంటివాటిని సజీవ శిలాజాలు అనరాదు.

స్ఫీనోడాన్ మొదట పర్షియన్ యుగంలో ఉద్భవించి, ఇప్పటికీ అదే నిర్మాణంలో ఉంది. ఇది ఒక సజీవ శిలాజం. ఇలాంటి వాటి అధ్యయనంలో ఒక తెలిసిన జీవి యొక్క పురాతన శిలాజం దొరికినపుడు అవి రెండూ ఒకే విధంగఘ ఉన్నట్లు తెలుస్తుంది. కొన్నిమార్లు ముందుగా శిలాజం ద్వారా మాత్రమే శాస్త్రజ్ఞులకు తెలిసిన జీవి ఎక్కడో మారుఊల ప్రాంతంలో జీవశాస్త్రపరిశోధకులకు కనిపించి ఆశ్చర్యం కలుగజేస్తుంది. (as if the fossil had "come to life again"). "Living Fossil" అనే పదాన్ని మొట్టమొదట ఛార్లెస్ డార్విన్ తన ఆరిజిన్ ఆఫ్ స్పిషీస్ (The Origin of Species) అనే ప్రఖ్యాత రచనలో Ornithorhynchus (the platypus), Lepidosiren (the South American lungfish) అనే జీవుల గురించి వర్ణించే సందర్భంలో ఉపయోగించాడు.


ఎడమ వైపున ఉన్నది 170 మిలియన్ సంవత్సరాల క్రింది శిలాజం. కుడివైఉన ఉన్నది జింకో ప్రజాతి మొక్క ఆకులు. రెండూ ఒకే రకంగా ఉండడం ఈ చిత్రంలో గమనించవచ్చును.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. జంతుశాస్త్ర నిఘంటువు. హైదరాబాదు: తెలుగు అకాడమి.

బయటి లింకులు

మార్చు