సడిసేయ కో గాలి సడిసేయబోకే

సడిసేయ కో గాలి సడిసేయబోకే రాజమకుటం (1960) సినిమా కోసం దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన భావ గీతం. ఈ గీతాన్ని పి. లీల మధురంగా గానం చేయగా మాస్టర్ వేణు సంగీతాన్ని అందించారు. ఈ సన్నివేశంలో ఎన్.టి.రామారావు, రాజసులోచన లపై చిత్రీకరించారు.

నేపథ్యం మార్చు

ప్రతాప సింహుడు ( రామారావు) యువరాజు. మంత్రియైన గుమ్మడి మహారాజును కుట్ర పన్ని చంపి వేస్తాడు. దానిని యువరాజుకు తెలియనీయకుండా కొంత మంది అమాయకులను రాజహత్యా నేరం క్రింద మరణ శిక్ష విధించేటట్లు చేస్తాడు. ఆ చనిపోయిన వారిలో కథానాయిక ప్రమీల (రాజ సులోచన) అన్న కూడా ఉంటాడు. యువరాజు తన తల్లితో కలిసి దుర్మార్గుడైన మంత్రి ఆట కట్టించడం కోసం పధకం పన్నుతాడు. అందులో భాగంగా ప్రతాప సింహుడు ప్రతిరాత్రి రహస్యంగా రాజ్యంలోకి పోయి ప్రజలతో కలుస్తాడు. అక్కడ ప్రమీలతో ప్రేమలో పడతాడు. ఆ పోరాటంలో ప్రియుడిని దెబ్బలు తగిలి దరిచేరినప్పుడు ప్రేయసి సపర్యలు చేస్తూ పాడిన సందర్భోచిత గీతం.

పాట మార్చు

పల్లవి :

సడిసేయ కో గాలి సడిసేయబోకే

బడలి ఒడిలో రాజు పవ్వళించేనే | | సడిసేయ కో గాలి | |

చరణం 1 :

రత్నపీఠిక లేని రారాజు నా స్వామి

మణికిరీటము లేని మహారాజు గాకేమి

చిలిపి పరుగులు మాని కొలిచిపోరాదే | | సడిసేయ కో గాలి | |

చరణం 2 :

ఏటి గలగలలకే ఎగిరి లేచేనే

ఆకు కదలికలకే అదరి చూసేనే

నిదుర చెదరిందంటే నే నూరుకోనే | | సడిసేయ కో గాలి | |

చరణం 3 :

పండు వెన్నెల నడిగి పాన్పు తేదాదే

నీలిమబ్బుల దాగు నిదుర తేరాదే

విరుల వీవన పూని విసిరి పోరాదే | | సడిసేయ కో గాలి | |

బయటి లింకులు మార్చు