సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రపు మొదటి ప్రయోగ వేదిక

సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రపు మొదటి లాంచ్ ప్యాడ్ [1] ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట లోని రాకెట్ ప్రయోగ ప్రదేశం. ఇది 1993 లో పని ప్రారంభించింది. ప్రస్తుతం దీన్ని ఇస్రో యొక్క రెండు ప్రయోగ వాహనాలు ఉపయోగిస్తున్నాయి: పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పిఎస్ఎల్వి),జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జిఎస్ఎల్వి). శ్రీహరికోటలో పనిచేస్తున్న రెండు రాకెట్ ప్రయోగ వేదికల్లో ఒకటి. రెండవదైన రెండవ ప్రయోగ వేదికను[2] 2005 లో ప్రారంభించారు. మొదటి వేదిక నుండి మొట్టమొదటి ప్రయోగం 1993 సెప్టెంబరు 20 న చేసారు. ఇది పిఎస్‌ఎల్‌వి యొక్క తొట్టతొలి ప్రయోగం కూడా. ఈ ప్రయోగంలో ఐఆర్‌ఎస్-1ఇ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టారు.

మొదటి ప్రయోగ వేదిక
మొదటి ప్రయోగ వేదికపై పిఎస్‌ఎల్‌వి సి35
వేదిక స్థలంసతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం
స్థలం13°43′59″N 80°14′06″E / 13.733°N 80.235°E / 13.733; 80.235
పొట్టి పేరుFLP
ఆపరేటరుIndia ఇస్రో
ప్రయోగ వేదిక(లు)One
ప్రయోగ చరిత్ర
స్థితి Active
ప్రయోగాలు 36
తొలి ప్రయోగం 20 September 1993
PSLV / IRS-P1
చివరి ప్రయోగం 24 January 2019
PSLV-DL / PSLV-C44
రాకెట్లు PSLV
GSLV

ప్రయోగాలు మార్చు

2013 జూలై అంతానికి, 36 పిఎస్‌ఎల్‌విలను (1 వైఫల్యం, 1 పాక్షిక విజయం & 34 పూర్తిగా విజయవంతం) [3] , 3 జిఎస్‌ఎల్‌విలనూ (1 వైఫల్యం & 2 పూర్తిగా విజయవంతం) ఈ వేదిక నుండి అంతరిక్షం లోకి పంపించారు.

సౌకర్యాలు మార్చు

ఇవి కూడా చూడండి మార్చు

 
పిఎం మోడీ జూన్ 2014 లో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఫస్ట్ లాంచ్ ప్యాడ్ ను సందర్శించారు; నేపథ్యంలో ఉపగ్రహ వాహనం కనిపిస్తోంది.

మూలాలు మార్చు

  1. "Launch Facility". Indian Space Research Organisation. Retrieved 11 April 2010.
  2. "ISRO planning big missions this year". New Indian Express. Kerala, India. The New Indian Express. 2013-02-28. Archived from the original on 2016-03-15. Retrieved 6 March 2013.
  3. See the Wikipedian page List of Satish Dhawan Space Centre launches