సత్యేంద్ర కుమార్ జైన్

సత్యేందర్ కుమార్ జైన్ భారతదేశానికి చెందిన ఆర్కిటెక్ట్, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు.[2] ఆయన ఢిల్లీలోని షాకూర్ బ‌స్తీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి అరవింద్ కేజ్రివాల్ మంత్రివర్గంలో ఆరోగ్యం & కుటుంబ సంక్షేమం, పరిశ్రమలు, గృహం, విద్యుత్, నీరు, పట్టణాభివృద్ధి, నీటిపారుదల & వరద నియంత్రణ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.[3][4]

సత్యేంద్ర కుమార్ జైన్
సత్యేంద్ర కుమార్ జైన్


మంత్రి
పదవీ కాలం
14 ఫిబ్రవరి 2015 – 28 ఫిబ్రవరి 2023[1]
Lieutenant Governor నజీబ్ జాంగ్
అనిల్ బైజాల్
వినయ్ కుమార్ సక్సేనా
ముందు రాష్ట్రపతి పాలన
పదవీ కాలం
28 డిసెంబర్ 2013 – 14 ఫిబ్రవరి 2014
Lieutenant Governor నజీబ్ జాంగ్
ముందు కిరణ్ వాలియా
తరువాత రాష్ట్రపతి పాలన

శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
14 ఫిబ్రవరి 2015
ముందు రాష్ట్రపతి పాలన
నియోజకవర్గం షాకూర్ బ‌స్తీ
పదవీ కాలం
28 డిసెంబర్ 2013 – 14 ఫిబ్రవరి 2014
ముందు శ్యామ్ లాల్ గార్గ్
తరువాత రాష్ట్రపతి పాలన
నియోజకవర్గం షకూర్ బస్తీ

వ్యక్తిగత వివరాలు

జననం 1964 అక్టోబర్ 3
కిర్తల్, ఉత్తర ప్రదేశ్
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ
జీవిత భాగస్వామి పూనమ్ జైన్
సంతానం సౌమ్య జైన్, శ్రేయ జైన్
వృత్తి రాజకీయ నాయకుడు
శాఖ ఆరోగ్యం & కుటుంబ సంక్షేమం, పరిశ్రమలు, గృహం, విద్యుత్, నీరు, పట్టణాభివృద్ధి , నీటిపారుదల & వరద నియంత్రణ శాఖల మంత్రి

జననం, విద్యాభాస్యం

మార్చు

సత్యేందర్ జైన్ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, బాగ్‌పత్ జిల్లా, కిర్తల్ గ్రామంలో 1964 అక్టోబర్ 3న జన్మించాడు. ఆయన ఢిల్లీలోని రామ్‌జాస్ పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తి చేసి, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ నుండి ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.[5]

రాజకీయ జీవితం

మార్చు

సత్యేందర్ జైన్ అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేప్పట్టిన ఉద్యమంలో పాల్గొని ఆ తర్వాత అరవింద్ కేజ్రివాల్ ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి  వచ్చాడు. సత్యేందర్ జైన్ 2013లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో షకూర్ బస్తీ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అరవింద్ కేజ్రివాల్ మంత్రివర్గంలో 2013 డిసెంబరు 28 నుండి 2014 ఫిబ్రవరి 14 వరకు ఆరోగ్యం & కుటుంబ సంక్షేమం, గురుద్వారా ఎన్నికలు, పరిశ్రమల మంత్రిగా పనిచేశాడు.[6] ఆయన 2015లో జరిగిన ఎన్నికల్లో రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2015 ఫిబ్రవరి 4 నుండి 2020 ఫిబ్రవరి 13 వరకు ఆరోగ్యం & కుటుంబ సంక్షేమం, పరిశ్రమలు, గృహం, PWD, విద్యుత్, నీరు, పట్టణాభివృద్ధి, నీటిపారుదల & వరద నియంత్రణ రవాణా శాఖల మంత్రిగా పనిచేశాడు.

సత్యేందర్ జైన్ 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అరవింద్ కేజ్రివాల్ మంత్రివర్గంలో ఆరోగ్య & కుటుంబ సంక్షేమం, పరిశ్రమలు, హోమ్, పి.డబ్ల్యూ.డి, పవర్, నీరు, పట్టణాభివృద్ధి, నీటిపారుదల & వరద నియంత్రణ, ఢిల్లీ ప్రభుత్వం ఎన్.సి.టి మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.[7]

వివాదాలు

మార్చు

సత్యేంద్ర జైన్ కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీకి అక్రమంగా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణ చేపట్టి నిర్ధారించి ఆయనపై సీబీఐ 2017లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దీని ఆధారంగా ఈడీ ఈ కేసు దర్యాప్తు కొనసాగిస్తూ హవాలా కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 2022 మే 30న అరెస్ట్ చేసింది.[8]

మూలాలు

మార్చు
  1. Zee News Telugu (28 February 2023). "ఢిల్లీ మంత్రులుగా మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్లు రాజీనామా!". Archived from the original on 1 March 2023. Retrieved 1 March 2023.
  2. "Aam Aadmi Party sends list of proposed cabinet to Lt Governor". www.aamaadmiparty.org. Aam Aadmi Party. Archived from the original on 5 జూలై 2015. Retrieved 4 July 2015.
  3. The Hindu (28 December 2013). "Satyendra Kumar Jain: From architect to minister" (in Indian English). Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.
  4. "Delhi Govt Portal - Cabinet Ministers". delhi.gov.in. Government of NCT of Delhi, India. Retrieved 4 July 2015.
  5. "Delhi Govt Portal". web.delhi.gov.in. Retrieved 18 March 2020.
  6. NDTV (28 December 213). "Know your Delhi minister: Satyendra Kumar Jain". Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.
  7. V6 Velugu (4 January 2022). "ఢిల్లీలో లాక్డౌన్ పెట్టే ఆలోచన లేదు" (in ఇంగ్లీష్). Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  8. V6 Velugu (30 May 2022). "ఢిల్లీ ఆరోగ్యమంత్రి అరెస్ట్" (in ఇంగ్లీష్). Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)