సత్య ప్రకాష్ జరావత

సత్య ప్రకాష్ జరావత హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 శాసనసభ ఎన్నికలలో పటౌడీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

సత్య ప్రకాష్ జరావత

పదవీ కాలం
2019 – 2024
ముందు బిమ్లా చౌదరి
తరువాత బిమ్లా చౌదరి
నియోజకవర్గం పటౌడీ

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం హర్యానా
వృత్తి రాజకీయ నాయకుడు

ఉద్యోగ జీవితం

మార్చు

సత్య ప్రకాష్ జరావత గురుగ్రామ్ గ్రామీణ బ్యాంకులో క్లర్క్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత బ్యాంకులో అధికారిగా పని చేసి మాజీ ఐఏఎస్ అధికారి & దళిత నాయకుడు ఉదిత్ రాజ్‌తో పరిచయం ఏర్పడి షెడ్యూల్డ్ కుల తెగల ఉద్యోగుల సంఘం అధికారిగా, లార్డ్ బుద్ధ క్లబ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశాడు.

రాజకీయ జీవితం

మార్చు

సత్య ప్రకాష్ జరావత 2009లో బీజేపీ సీనియర్ నాయకుడు రావు ఇంద్రజిత్ సింగ్ సన్నిహితుడిగా ఉంటూ ఆయన ద్వారా 2009లో ఎన్నికలలో పోటీ చేయడానికి తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశాడు, కాని 2009లో, రావు ఇంద్రజిత్ సింగ్ ప్రయత్నించినప్పటికీ ఆయనకు కాంగ్రెస్ టిక్కెట్ దక్కకపోవడంతో పటౌడీ శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత తరువాత పంచాయతీ ఎన్నికలలో తన వార్డు నుండి పంచాయతీ సమితి సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికై ఆ తర్వాత పంచాయతీ సమితి ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు.

సత్య ప్రకాష్ జరావత 2015లో భారతీయ జనతా పార్టీలో చేరి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి రాష్ట్ర సహ అధికార ప్రతినిధిగా బాధ్యతను నిర్వర్తించాడు. ఆయన 2019 ఎన్నికలలో పటౌడీ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి నరేందర్ సింగ్ పహారీపై 36,579 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3]

మూలాలు

మార్చు
  1. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  2. India TV (24 October 2019). "Haryana Election Results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.
  3. "हरियाणा : टायर पंचर लगाने वाले सत्यप्रकाश को मंत्री पद का तोहफा संभव". 26 October 2019. Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.