సన్నిహిత్ సరోవర్

సన్నిహిత్ సరోవర్ భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో గల కురుక్షేత్ర జిల్లాలోని థానేసర్ పట్టణంలో గల ఒక పవిత్ర సరస్సు. దీనిని సప్త సింధు అనీ, ఏడుగురు సరస్వతీదేవిల సమావేశ స్థలం అనీ పిలుస్తారు. ఈ సరస్సు 48 కోసుల కురుక్షేత్ర ప్రదక్షిణ యాత్రలో ఒకటి.[1]

సన్నిహిత్ సరోవర్

నమ్మకాలు

మార్చు

హిందువులు హిందూ ధర్మం ప్రకారం ఈ సరస్సు పవిత్రమైన నీటిని కలిగి ఉంటుంది అని నమ్ముతారు. అమావాస్య రోజు లేదా గ్రహణం రోజున ఇక్కడి నీటిలో స్నానం చేస్తే అశ్వమేధ యజ్ఞం చేసినంత సమానమైన ఫలితాలను ఇస్తుందనీ, ఈ సరోవర్‌లో స్నానం చేయడం వల్ల చనిపోయిన వారి ఆత్మలకు శాంతి లభిస్తుందని కూడా నమ్ముతారు.[2]

కార్యక్రమాలు

మార్చు

చనిపోయినవారికి పిండ ప్రధానం చేయడం వంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తారు.[3]

ఆలయాలు

మార్చు

సరోవర్‌తో పాటు విష్ణువు, ధ్రువ నారాయణ్, లక్ష్మీ నారాయణ్, ధ్రువ భగత్, శ్రీ హనుమాన్, దుర్గాదేవి వంటి చిన్న చిన్న మందిరాలు ఉన్నాయి. సన్నిహిత్ సరోవర్ ను విష్ణువు నివాసం అని కూడా నమ్ముతారు.[4]

మూలాలు

మార్చు
  1. "Tirath in Kurukshetra - Sannehit Sarovar". Kurukshetra district website. Archived from the original on 2014-08-06. Retrieved 2014-08-08.
  2. "Tirath in Kurukshetra - Sannehit Sarovar". Kurukshetra district website. Archived from the original on 2014-08-06. Retrieved 2014-08-08.
  3. "Tirath in Kurukshetra - Sannehit Sarovar". Kurukshetra district website. Archived from the original on 2014-08-06. Retrieved 2014-08-08.
  4. "Tirath in Kurukshetra - Sannehit Sarovar". Kurukshetra district website. Archived from the original on 2014-08-06. Retrieved 2014-08-08.