చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో ఏడవ తిథి సప్తమి. అధి దేవత - సూర్యుడు.

సప్తమీ నిర్ణయం మార్చు

ధర్మ సింధు[1] ప్రకారం షష్ఠితో కూడిన సప్తమినే సర్వకర్మలకు గ్రహించాలి. పూర్వదినాన అస్తమయ పర్యంతం షష్ఠి ఉంటే, అష్టమీ విద్ధ అయినా పరదినమే గ్రహించక తప్పదు.

పండుగలు మార్చు

  1. మాఘ శుద్ధ సప్తమి - రథసప్తమి.
  • హేమాద్రి తన గ్రంథంలో రథసప్తమీ వ్రతమునేకాక కల్యాణసప్తమి, కమలసప్తమి, శర్కరాసప్తమి, అచలాసప్తమి, రథాంకసప్తమి, మహాసప్తమి, జయాసప్తమి, విజయాసప్తమి, జయంతీసప్తమి, అపరాజితాసప్తమి, మహాజయాసప్తమి, నందాసప్తమి, సిద్ధార్థకాదిసప్తమి, సాక్షుభార్యసప్తమి, సర్షపసప్తమి, మార్పాండసప్తమి, సుర్యవ్రతసప్తమి, సప్తసప్తిసప్తమి, అర్కసంపుటసప్తమి, నింబసప్తమి, మరీచసప్తమి, ఫలసప్తమి - మొదలైన చాలా సప్తమీ వ్రతములను పేర్కొన్నాడు. ఇవి యన్నియు సూర్యవ్రతములే.[2]

మూలాలు మార్చు

  1. సప్తమీ నిర్ణయం, ధర్మ సింధు, భాగవతుల సుబ్రహ్మణ్యం, నవరత్న బుక్ హౌస్, విజయవాడ, 2009, పేజీ: 53.
  2. రథ సప్తమి, హిందువుల పండుగలు-పర్వములు, తిరుమల రామచంద్ర, బాలసరస్వతీ బుక్ డిపో, కర్నూలు, 2004, పేజీలు: 188-192.
"https://te.wikipedia.org/w/index.php?title=సప్తమి&oldid=3892535" నుండి వెలికితీశారు