సబ్నవీసు వెంకటరామ నరసింహారావు

సబ్నవీసు వెంకటరామ నరసింహారావు స్వాతంత్ర్యానికి ముందున్న తెలంగాణ ప్రాంతంలో పాత్రికేయుడుగా పనిచేసాడు.

జననం మార్చు

ఇతను 1896లో నల్గొండ జిల్లా(ప్రస్తుత సూర్యాపేట జిల్లా) మామిళ్ళగూడెంలో పుట్టాడు. సబ్నవీసు లక్ష్మీనారాయణరావు, రంగనాయకమ్మ ఇతని తల్లిదండ్రులు.

పాత్రికేయుడిగా మార్చు

తెలంగాణ ప్రాంతంలో సంఘ దురాచారాల నిర్మూలనకు, భాష, సంస్కృతి వ్యాప్తికి నీలగిరి వార్తాపత్రిక ద్వారా సంపాదకునిగా ఎంతగానో కృషి చేసాడు. కళలు, గ్రామీణ పరిశ్రమలు హస్తకళల గురించి వివరించే వ్యాసాలు రాసాడు. గుడిపాటి వెంకటాచలం కథలను ప్రచురించాడు. ఈ నీలగిరి పత్రికలోనే బూర్గుల రామకృష్ణారావు, మాడపాటి హనుమంతరావు, పులిజాల రంగారావు మొదలగు వారు తమ వ్యాసాలను రాసేవారు.

తర్వాతి కాలంలో ఉస్మానియా ప్రింటింగ్ ప్రెస్ నెలకొల్పి 1924లో సంస్కారిణి గ్రంథమాల ప్రారంభించాడు. అనేక లఘుగ్రంథాలు ప్రచురించాడు. గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్నాడు. 1929లో కన్నుమూసాడు.[1]

మూలాలు మార్చు

  1. మన పాత్రికేయ వెలుగులు -- వైతాళికులు : సబ్నవీసు వెంకటరామ నరసింహారావు(1896-1929). హైదరాబాదు: వయోధిక పాత్రికేయ సంఘం. p. 5.