సమాచార సాధనాలు వివిధ రకాలుగా అభివృద్ధి చెందినవి. వీటిలో ముఖ్యంగా పత్రికలు, రేడియో, టెలివిజన్, ఇంటర్నెట్ పేర్కొనాలి.

పరిశోధనా నౌక ఆర్.వి థామస్ జి. థాంప్సన్ వంతెనపై కమ్యూనికేషన్ పరికరాలు, అమెరికాలోని వాషింగ్టన్, సీటెల్, వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో దాని రేవు వద్ద ఫోటోలు సేకరిస్తున్న చిత్రం

విస్తృతి సవరించు

ముఖ్య వ్యాసం: భారతదేశంలో సమాచార సాధనాల విస్తృతి

మీడియా రీసర్చ్ యూసర్స్ కౌన్సిల్ 2008R2 (జులై 2008) ప్రకారం టెలివిజన్ 55.84%, పత్రికలు 38.3%, రేడియో 21.4%, సినిమా 9.9% ఇంటర్నెట్ 1.7%వ్యక్తులకు చేరుతున్నది. 2006 R2 పోల్చితే టెలివిజన్, రేడియో, ఇంటర్నెట్ తమ విస్తృతిని పెంచుకొనగా, పత్రికలు, సినిమా తగ్గుముఖం పట్టాయి.

విద్య సవరించు

వార్తలు ప్రత్యేకాంశంగా సర్టిఫికెట్ నుండి పిజి స్థాయి వరకు వివిధ కోర్సులున్నాయి. ప్రతి పత్రిక, జర్నలిస్టులను తయారుచేయడానికి ఎంపిక చేసిన అభ్యర్థులకు ప్రత్యేక కళాశాలల ద్వారా శిక్షణ ఇస్తున్నది. అభ్యర్థులకు జర్నలిజం పట్ల ఆసక్తి, సామాజిక స్పృహ, చొచ్చుకుపోయే చొరవ, విన్నదీ కన్నదీ పదిమందితో పంచుకుందామనుకునే గుణం వుండి వాడుక భాషలో చక్కటి తెలుగు రాయగలిగే సామర్థ్యం వుంటే దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణంగా, ఇవ్వబడిన విషయంపై స్వంతంగా రాసిన వ్యాసము జతపరచాలి. ఆ తరువాత ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. డిటిపి (తెలుగు) వచ్చిన వారికి, ఆంగ్ల అనువాద సామర్థ్యం ఉన్న వారికీ ప్రాధాన్యం ఇస్తారు. శిక్షణ కాలంలో ఉపకార వేతనం ఇస్తారు.

ఉపాధి సవరించు

వార్తా పత్రికలలో విలేఖరి, ఎడిటింగ్, సబ్ఎడిటర్, ప్రూఫ్ రీడర్, నిర్వహణ, ఉత్పత్తి, సాంకేతిక, ముద్రణ కొరకు ఉపాధి అవకాశాలున్నాయి. టెలివిజన్ ఛానెళ్ళు పెరిగిపోవడంతో వార్తలు, ఫిల్మ్, వాణిజ్య ప్రకటణలు, టివి యాంకర్, వీడియో జాకీ లాంటి ఉపాధి అవకాశాలు పెరిగాయి.

ఇవీ చూడండి సవరించు

మూలాలు సవరించు

బయటి లింకులు సవరించు