సమ్మి అనేది పంజాబ్ రాష్ట్రంలోని గిరిజనుల తెగ యొక్క సాంప్రదాయక నృత్యం. ఈ నృత్యం పంజాబీ మహిళల యొక్క నృత్యం. ఈ నృత్యం పంజాబ్ లోని సాండల్‌బార్ ప్రాంతం (ప్రస్తుతం పాకిస్తాన్ లోనిది) లో ప్రసిద్ధమైనది. ఈ నృత్యాన్ని బాజీగర్, రాయి ప్రజలు, లోబానా, సాంసీ గిరిజన తెగల మహిలలు ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు.

ఈ నృత్యం మర్వాడ్ రాజ్యంలోని "సమ్మి మహారాణి" ప్రదర్శించేదని చారిత్రక గ్రంథాల ద్వారా తెలుస్తుంది. ఈ నృత్యాన్ని రాజస్థాన్ రాజకుమారుడు అయిన సుచ్‌కుమార్ తో వేరుపడడం వల్ల కలిగిన భావోద్రేకంతో ప్రదర్శించేదని కథనం.[ఆధారం చూపాలి]

వస్త్రధారణ మార్చు

ఈ నృత్యకారులు ప్రకాశవంతమైన రంగుకల కుర్తాను, పూర్తిగా పూలతో కూడిన స్కట్ లను (లహెంగా) ధరిస్తారు. ఈ నృత్యంలో వెండి కేశాలు గల ఆభరణాలను ధరిస్తారు.

ప్రదర్శన మార్చు

ఈ నృత్యం గిద్దా వలె వృత్తాకారంలో ప్రదర్శించబడుతుంది. నృత్యకారులు ఒక వలయంగా నిలబడి వారి చేతులను ప్రక్కలకు, కుడివైపుకు ఊపుతుంటారు. ఈ నృత్యంలో ముఖ్యమైన ప్రసిద్ధి పొంచిన సమ్మీ పాట "సమ్మీ మేరీ వాన్".

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

ఇతర పఠనాలు మార్చు

Schreffler, Gibb. 2012. “Desperately Seeking Sammi: Re-inventing Women’s Dance in Punjab.Sikh Formations 8(2).